For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాల్ సమయం తగ్గింపు వెనుక మర్మం, ట్రాయ్ అవసరంలేదని జియో

|

కాల్ రింగింగ్ సమయం ఎంత ఉండాలనే దానిపై టెలికం పరిశ్రమలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాయ్ జోక్యం చేసుకోవాలని, నిర్దిష్ట సమయాన్ని తప్పనిసరి చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై రిలయన్స్ జియో స్పందించింది. కాల్ రింగింగ్ విషయంలో ట్రాయ్ జోక్యం అవసరం లేదని అభిప్రాయపడింది. రింగింగ్ సమయంలో ఎంత ఉండాలనే దానిపై సూచనప్రాయ మార్గదర్శకాలు ఇస్తే పర్వాలేదు కానీ సమయాన్ని నిర్దేశిస్తూ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.

అలాంటి సూచనలు చేసినా 20 నుంచి 25 సెకన్ల రింగింగ్ సమయం ఉండేలా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరింది. జియో తమ నెట్ వర్క్ నుంచి ఇతర పోటీ సంస్థల నెట్ వర్క్స్‌కు వెళ్లే ఇన్‌కమింగ్ కాల్స్ విషయంలో రింగింగ్ సమయాన్ని ఏకపక్షంగా తగ్గించిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో గత నెలలో ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జీల రూపంలో తాము నష్టపోవాల్సి వచ్చిందని భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు ఆరోపించాయి. అంతేకాదు, ఈ సంస్థలు కూడా రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గించాయి.

Reliance Jio opposes regulatory intervention on call ring time

రోజా నెల శాలరీ రూ.2 లక్షలు, అలవెన్స్ కలిపి రూ.3.82 లక్షలురోజా నెల శాలరీ రూ.2 లక్షలు, అలవెన్స్ కలిపి రూ.3.82 లక్షలు

ఇటీవల జియో తన రింగింగ్ సమయాన్ని తగ్గించింది. ఇదే బాటలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా పయనించాయి. తమ రింగింగ్ టైంను 30 నుంచి 45 సెకన్ల నుంచి 25 సెకన్లకు తగ్గించింది. ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జీ (IUC) నిబంధనలను ఉల్లంఘించి జియో తొలుత రింగింగ్ టైంను 20 సెకన్లకు తగ్గించి అనంతరం 25 సెకన్లకు పెంచిందని ఎయిర్‌టెల్ ఆరోపించింది. రింగ్ సమయం తక్కువ ఉండడం వల్ల అవతలి వ్యక్తి తిరిగి కాల్ చేసే పరిస్థితి వస్తోందనేది ఆరోపణ. కాల్ చేసిన నెట్ వర్క్ వారు కాల్ ముగిసిన నెట్ వర్క్‌కు ఐయూసీ ఛార్జీలు చెల్లించాలి. అయితే దీనిని జియో కొట్టి పారేస్తోంది. అంతర్జాతీయ నిబంధనల మేరకు 15-20 సెకన్ల రింగ్ సమయం ఉంటే చాలని పేర్కొంది. ఇప్పుడు అందరి దృష్టి ట్రాయ్‌పై ఉంది.

English summary

కాల్ సమయం తగ్గింపు వెనుక మర్మం, ట్రాయ్ అవసరంలేదని జియో | Reliance Jio opposes regulatory intervention on call ring time

Amid an industry feud over call ringing time, Reliance Jio has urged the telecom regulator to abstain from mandating a specific duration for calls to ring, and said the matter should be kept under forbearance as there is no need for any regulatory intervention.
Story first published: Saturday, October 5, 2019, 14:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X