For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ హాట్ కేక్... కారణాలు ఇవే..

|

అన్ని రకాల సదుపాయాలు, తక్కువ స్థాయిలో ఆఫీస్ అద్దె, మంచి వాతావరణం, సుస్థిర ప్రభుత్వం ఎక్కడ ఉంటుందని ఆలోచిస్తే ముందుగా గుర్తుకు వచ్చే నగరాల్లో హైదరాబాద్ నిలుస్తోంది. అందుకే దేశ విదేశీ కంపెనీలు హైదరాబాద్ బాట పడుతున్నాయి. ఇక్కడ తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఇక్కడ కేంద్రాల్ని నిర్వహిస్తున్న కంపెనీలు తమ విస్తరణకు హైదరాబాద్ నే ఎంచుకుంటున్నాయి. కొత్త కంపెనీల రాకకు తోడుగా పాత కంపెనీల విస్తరణతో హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ జోరుగా పెరుగుతోంది. ఇదే విషయం పలు సంస్థల సర్వేల్లోనూ వెల్లడవుతోంది. తాజాగా ప్రాపర్టీ కన్సల్టెంట్ కొలీర్స్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.

నాడు నిజాం వేసిన రూ.8 కోట్లు వడ్డీతో నేడు రూ.306 కోట్లునాడు నిజాం వేసిన రూ.8 కోట్లు వడ్డీతో నేడు రూ.306 కోట్లు

7 నగరాల్లో 9 శాతం పెరుగుదల

7 నగరాల్లో 9 శాతం పెరుగుదల

* కొలీర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ వరకు స్థూలంగా లీజుకు ఇచ్చిన ఆఫీస్ స్పేస్ 9 శాతం పెరిగి 1.39 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంది. ఈ ఏడు నగరాల్లో హైదరాబాద్, ఢిల్లీ - ఎన్ సిఆర్, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, పూణే ఉన్నాయి.

* జనవరి-సెప్టెంబర్ కాలంలో స్థూలంగా లీజుకు ఇచ్చిన ఆఫీస్ స్పేస్ 4.01 కోట్ల చదరపు అడుగులు.గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే వృద్ధి 9 శాతంగా ఉంది.

* కార్పొరేట్లు, కో వర్కింగ్ ఆపరేటర్ల నుంచి ఆఫీస్ స్పేస్ కు ఎక్కువ డిమాండ్ ఏర్పడుతోంది.

మరింత పెరిగే ఛాన్స్...

మరింత పెరిగే ఛాన్స్...

* దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో మందగమనం నెలకొంది. అయినప్పటికీ కంపెనీలు తమ విస్తరణ కార్యకలాపాలు చేపడుతూనే ఉన్నాయి. మెరుగైన బిజినెస్ సపోర్ట్ ఎకో సిస్టమ్ ఉండటం వల్లనే ఇది సాధ్యమవుతోంది. అందుకే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో అద్దెకు తీసుకున్న ఆఫీస్ ప్రదేశం గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 9 శాతం పెరిగి 1.39 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంది.

* ఈ ఏడాదిలో కంపెనీలు అద్దెకు తీసుకునే ఆఫీస్ స్పేస్ గత ఏడాదితో పోల్చితే 7-9 శాతం పెరిగే అవకాశం ఉందని కొలీర్స్ అంచనా వేస్తోంది.

ఐటీ, బీపీఎం వాటాయే అధికం

ఐటీ, బీపీఎం వాటాయే అధికం

* ఆఫీస్ లను అద్దెకు తీసుకుంటున్న కంపెనీల్లో ఐటీ - బీపీఎం (బిజినెస్ ప్రాసెస్ మేనేజిమెంట్), టెక్నాలజీ కంపెనీల వాటాయే 36 శాతంగా ఉంది.

* జనవరి నుంచి సెప్టెంబర్ వరకు చూస్తే ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ వాటా 18 శాతం ఉంది.

రెండో స్థానంలో హైదరాబాద్

రెండో స్థానంలో హైదరాబాద్

* జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో ఆఫీస్ స్పేస్ అద్దెకు ఇవ్వడంలో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. మొత్తంగా అద్దెకు ఇచ్చిన ఆఫీస్ స్పేస్ లో బెంగళూరు వాటా 30 శాతంగా ఉంది. ఈ నగరంలో అద్దెకు ఇచ్చిన ఆఫీస్ ప్రదేశం 1.21 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. గత ఏడాది జనవరి- సెప్టెంబర్ తో పోల్చితే 7 శాతం వృద్ధి నమోదయింది.

* ఢిల్లీ - ఎన్ సి ఆర్ ను అధిగమించి హైదరాబాద్ రెండో స్థానానికి చేరుకుంది. ఈ నగరంలో స్థూలంగా అద్దెకు ఇచ్చిన ఆఫీస్ స్పేస్ వాటా 19 శాతంగా ఉంది. జనవరి-సెప్టెంబర్ లో స్థూలంగా అద్దెకు తీసుకున్న ప్రదేశం 84 శాతం పెరిగి 75 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది.

English summary

హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ హాట్ కేక్... కారణాలు ఇవే.. | Office space leasing up 9% to 13.9 million sq ft in across seven major cities

Gross leasing of office space rose 9 per cent to 13.9 million sq ft in July-September this year across seven cities on higher demand from corporates and co-working operators, according to property consultant Colliers. These seven cities are Delhi-NCR, Mumbai, Kolkata, Chennai, Bengaluru, Hyderabad and Pune.
Story first published: Friday, October 4, 2019, 9:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X