For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: ప్రభుత్వం కీలక నిర్ణయం, రూ.30కి దిగొచ్చిన ఉల్లి ధర

|

ముంబై: భారీ వరదలతో పంట నష్టం, గతంలో కంటే తక్కువ విస్తీర్ణంలో సాగు కారణంగా ఉల్లి ధరలు ఇటీవలి వరకు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. ప్రధానంగా ఉల్లి ఎగుమతులను బ్యాన్ చేసింది. దీంతో భారత్‌లో ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి వరకు రూ.80కి పైగా ఉన్న ఉల్లి ధరలు ఇప్పుడు రూ.30 వరకు దిగి వచ్చాయి. మహారాష్ట్రలోని లాసాల్‌గావ్ ఆసియాలోనే అతిపెద్ద హోల్‌సేల్ ఆనియన్ మార్కెట్. ఇక్కడ ఉల్లి ధర కిలో రూ.30గా ఉంది. ఇదే మార్కెట్లో ఇటీవల రూ.60 నుంచి రూ.80 వరకు ఉంది. ఇప్పుడు దిగి వచ్చింది.

రూ.100కు పైగా ఉల్లి: భారత్ అవసరం.. చైనాకు సూపర్ అవకాశంరూ.100కు పైగా ఉల్లి: భారత్ అవసరం.. చైనాకు సూపర్ అవకాశం

రూ.51 తగ్గిన ఉల్లి ధర

రూ.51 తగ్గిన ఉల్లి ధర

నేషనల్ హార్టికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ ((NHRDF) గణాంకాల ప్రకారం మిడ్ సెప్టెంబర్ నుంచి నాసిక్ జిల్లాలోని లాసాల్‌గావ్‌లో ఉల్లి గరిష్ట టోకు ధర కిలోకు రూ.51 వరకు తగ్గింది. లాసాల్‌గావ్ మార్కెట్ దేశవ్యాప్తంగా ఉల్లి ధరలను నిర్దేశిస్తుంది. ఈ మార్కెట్ హెచ్చుతగ్గులు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ఉల్లి ధరలను ప్రతిబింబిస్తాయి.

ధర గరిష్టం రూ.30, కనిష్టం రూ.15

ధర గరిష్టం రూ.30, కనిష్టం రూ.15

లాసాల్‌గావ్ వ్యవసాయ మార్కెట్లో గురువారం ఉల్లి సగటు టోకు ధర రూ.26 కాగా, గరిష్టంగా కిలో ఉల్లి ధర రూ.30.20 పైసలు, కనిష్ట ధర రూ.15 గా ఉంది. ఉల్లి పంట మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కువగా పండుతుంది. ఆగస్ట్ నెలలో భారీ వర్షాలు, వరదల కారణంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. నవంబర్ మిడిల్‌లో మరో పంట రానుంది. ప్రస్తుతం గత ఏడాది రబీ పంట స్టోరేజ్‌ను విక్రయిస్తున్నారు. ఖరీఫ్ పంట నవంబర్ నెలలో వస్తుంది.

ఉల్లి నియంత్రణకు చర్యలు...

ఉల్లి నియంత్రణకు చర్యలు...

ఉల్లి రాజకీయంగా కూడా చాలా సున్నితమైనది. కాబట్టి దేశీయ మార్కెట్లలో సరఫరాను పెంచి ధరను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.70గా ఉంది. ప్రభుత్వ చర్యలతో లాసాల్‌గావ్‌లో కిలో ఉల్లి ధర రూ.30 కన్నా తక్కువకు పడిపోయింది.

రైతులకు లేని లాభం..

రైతులకు లేని లాభం..

బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు రూ.80కి పెరిగినా రైతులకు పెద్దగా ప్రయోజనం ఉండదు. మధ్యవర్తులు, వ్యాపారులు ఈ లాభాలను సొమ్ము చేసుకుంటారు. ఉల్లిని స్టోర్ చేసుకొని ఇలాంటి పరిస్థితుల్లో విక్రయిస్తుంటారు. లేదా రైతుల నుంచి తక్కువకు కొనుగోలు చేసి ఎక్కువకు అమ్ముతుంటారు. ఓ వైపు రైతులు, మరోవైపు కొనుగోలుదారులు దీని వల్ల ఇబ్బందులు పడుతున్నారు.

English summary

గుడ్‌న్యూస్: ప్రభుత్వం కీలక నిర్ణయం, రూ.30కి దిగొచ్చిన ఉల్లి ధర | Export ban, stock limit pull wholesale onion prices to under Rs 30 per kg

Onion prices declined below Rs 30 per kg at Lasalgoan in Maharasthra, Asia’s largest wholesale market for the bulb crop, after the Government banned export and imposed stock limit on traders.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X