For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెప్టెంబర్‌లోను తగ్గిన ఆటో సేల్స్, రెండంకెల క్షీణత

|

గత కొన్ని నెలలుగా పడిపోయిన ఆటో సేల్స్ పడిపోతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలలోను అదే కొనసాగింది. పండుగ సీజన్, ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలపై ఆటో పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ సెప్టెంబర్ నెలలో అది నెరవేరలేదు. అక్టోబర్ నెలపై ఆశలు పెట్టుకుంది. ఆటోమొబైల్ దిగ్గజాలు మారుతి సుజుకీ, హ్యుండాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్, టయోటా సేల్స్ గత నెలలో రెండంకెలకు పడిపోయాయి. ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్న వాహన తయారీ సంస్థలకు పండుగ సీజన్లో రాయితీలు ప్రకటించినా ఆశించిన ఫలితంలేదు.

ఆటో పతనానికి ఉబెర్-ఓలా కారణమా, స్టాటిస్టిక్స్ ఏం చెబుతున్నాయి?ఆటో పతనానికి ఉబెర్-ఓలా కారణమా, స్టాటిస్టిక్స్ ఏం చెబుతున్నాయి?

దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ విక్రయాలు 27 శాతం క్షీణించాయి. సెప్టెంబర్ నెలలో 110,454 సేల్ అయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో సేల్స్ 151,512గా ఉన్నాయి. అయితే ఆగస్ట్ నెలలో 93,173 కంటే ఇది ఎంతో మెరుగు. హ్యుండాయ్ ప్యాసింజర్ వాహన విక్రయాలు 14.8 శాతం తగ్గి 40,705లకు పడిపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ 33% తగ్గి 14,333కి పడిపోయాయి. మహీంద్రా డొమెస్టిక్ సేల్స్ 21 శాతం తగ్గాయి. టాటా మోటార్స్ పాసింజర్ వెహికిల్ సేల్స్ 56 శాతం పడిపోయాయి.

Car sales continue downhill trip in September

దసరా, దీపావళి పండుగ నేపథ్యంలో అక్టోబర్ నెలలో సేల్స్ పుంజుకునే అవకాశం ఉందని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ సేల్ అండ్ మార్కెటింగ్ విజయ్ తెలిపారు. వర్షాలు బాగా కురవడం, కేంద్రం ఇటీవల ప్రకటించిన ఉద్దీపనలు ఆటోమొబైల్ రంగానికి ఊతమిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వినియోగదారుల్లో సెంటిమెంట్ ఇంకా నిరాశావాదంగా ఉందని, అందుకే సెప్టెంబర్ నెలలో సేల్స్ రెండంకెల స్థాయిలో డిపోయాయని చెబుతున్నారు.

ఆటో, వ్యాగన్ ఆర్ వంటి చిన్న కార్ల విభాగంలో విక్రయాలు 34,971 నుంచి 42.6 శాతం తగ్గి 20,085కు పడిపోయాయి. స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ వంటి కాంపాక్ట్ కార్ల విభాగంలో 22.7 శాతం తగ్గింది. మధ్యస్థాయి సెడాన్ సియాజ్ కార్ల విక్రయాలు 6246 నుంచి 1715కు తగ్గాయి. విటారా బ్రెజా, ఎర్టిగా వంటి యుటిలిటీ వాహనాల విక్రయాలు స్వల్పంగానే తగ్గాయి. ఎగుమతులు 17 శాతానికి పైగా తగ్గాయి.

English summary

సెప్టెంబర్‌లోను తగ్గిన ఆటో సేల్స్, రెండంకెల క్షీణత | Car sales continue downhill trip in September

Car sales continued its downward spiral as wholesale deliveries by companies fell yet again in September, just when the festive season kicks in.
Story first published: Wednesday, October 2, 2019, 16:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X