For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్టోబర్ నెలలో బ్యాంకులకు 11 రోజులు సెలవు, హాలీడేస్ లిస్ట్ ఇదే..

|

ఢిల్లీ: అక్టోబర్ నెలలో బ్యాంకులు 11 రోజులు మూతపడనున్నాయి. ఇది పండుగ సీజన్ కాబట్టి ఇతర నెలల కంటే దాదాపు ఎక్కువ రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఆది, శనివారాలు కాకుండా గాంధీ జయంతి, దసరా, దీపావళి, ఇతర నేషనల్ ఈవెంట్ సెలవు దినాలు ఉంటాయి. మొత్తంగా పదకొండు రోజులు మూతబడుతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు వర్తిస్తాయి.

అయితే, కొన్ని సెలవు దినాలు ఒక రాష్ట్రంలో ఓ తేదీన ఉంటే మరో రాష్ట్రంలో మరో రోజు ఉండవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ నెలలో రెండో శనివారం, నాలుగో శనివారం సెలవు దినాలు. అలాగే ఆదివారాలు సెలవు ఉంటుంది. వీటితో కలిపి మొత్తంగా 11 రోజులు సెలవులు ఉంటాయి. అంటే అక్టోబర్ నెలలో బ్యాంకులు 20 రోజులు మాత్రమే తెరిచి ఉంటాయి.

హోమ్ లోన్ మరింత చౌక కానున్నాయి, రెపో రేటు పెరిగితే...హోమ్ లోన్ మరింత చౌక కానున్నాయి, రెపో రేటు పెరిగితే...

banks will remain closed for 11 days

ఈ నెలలో ఏవైనా అవసరాలు ఉండి బ్యాంకును సందర్శించే ముందు సెలవు దినాలు చెక్ చేసుకోండి. అక్టోబర్ నెలలో సెలవు రోజులు....

- 2వ తేదీన గాంధీ జయంతి. కాబట్టి బ్యాంకులకు సెలవు.
6, 7, 8 తేదీల్లో వరుసగా మూడ్రోజులు బ్యాంకులు పని చేయవు. 6వ తేదీ ఆదివారం. 7వ తేదీ శరన్నవరాత్రులు. 8వ తేదీ దసరా.
- 12, 13 తేదీల్లో బ్యాంకులు పని చేయవు. 12వ తేదీ రెండో శనివారం. 13వ తేదీ ఆదివారం
- 20వ తేదీ ఆదివారం కాబట్టి బ్యాంకులకు సెలవు.
- 26వ తేదీ నాలుగో శనివారం, 27వ తేదీ ఆదివారం. కాబట్టి బ్యాంకులు క్లోజ్. 27వ తేదీన దీపావళి కూడా.
- 28, 29 తేదీలు కూడా బ్యాంకులు పని చేయవు. 28వ తేదీన గోవర్ధన్ పూజ కాగా, 29వ తేదీన భాయ్ దూజ్.
- తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే రెండు శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు బ్యాంకులు బంద్ ఉంటాయి. అంటే 6, 12, 13, 20, 26, 27 తేదీల్లో సెలవులు ఉంటాయి.
- వీటితో పాటు అక్టోబర్ 2 (గాంధీ జయంతి), 8వ తేదీ (దసరా) సెలవులు ఉంటాయి.

బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ నెట్ బ్యాంకింగ్ చేసేవారికి మాత్రం ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఆన్ లైన్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యథావిథిగా కొనసాగుతాయి. బ్యాంకులతో పని ఉంటే సెలవుల ఆధారంగా ప్లాన్ చేసుకోవాలి.

English summary

అక్టోబర్ నెలలో బ్యాంకులకు 11 రోజులు సెలవు, హాలీడేస్ లిస్ట్ ఇదే.. | banks will remain closed for 11 days

Festive season is around the corner and banks will remain closed for 11 days in the month of October on account of national holidays like Gandhi Jayanti, Dussehra, Diwali and other national events.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X