అమరావతి: ప్రభుత్వరంగ బ్యాంకుల పనివేళల్లో అక్టోబర్ 1వ తేదీ నుంచి మార్పులు చోటు చేసుకున్నాయి. స్థానిక అకౌంట్ హోల్డర్ల అవసరాలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సూచించిన మూడు రకాల పనివేళల్లో ఒక దానిని అమలు చేస్తారు. దేశంలోని 400 జిల్లాల్లో ఖాతాదారులకు బ్యాంకు సేవలన్ని మరింత చేరువ చేసేందుకు ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపడుతున్నారు.

బ్యాంకులకు 3 పనివేళల ఆప్షన్స్
భారత బ్యాంకర్ల సంఘం (IBA) సూచనల మేరకు మూడు రకాల పనివేళలను రూపొందించారు.
మొదటిది... ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.
రెండోది... ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు.
మూడోది... ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.
బ్యాంకులు ఈ మూడు రకాల పని వేళల్లో ఏదో ఒకదానిని ఎంచుకోవాలి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లాస్థాయి సంప్రదింపుల సమితిలో చర్చించి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితికి పంపిస్తారు. వారి ఆమోదంతో ఈ పనివేళలను అమలు చేస్తారు.

3వ తేదీ నుంచి రుణమేళా
ప్రభుత్వరంగ బ్యాంకులు రుణాల కోసం లోన్ మేళాలు ఏర్పాటు చేయనున్నాయి. పర్సనల్, వెహికిల్, స్టడీ, హోమ్ లోన్‌తో పాటు ఎంఎస్ఎంఈ, పంట రుణాల వంటివి ఇవ్వనున్నారు. ఖాతాదారులు తమ ఆదాయపన్ను దాఖలు పత్రాలు, గుర్తింపు ధృవీకరణ, కేవైసీ పత్రాలను చూపించాలి. అన్నీ సక్రమంగా ఉంటే పరిమితుల మేరకు అక్కడికక్కడే రుణం ఇస్తారు. దేశంలోని 400 జిల్లాల్లో ఖాతాదారులకు బ్యాంకు సేవలను మరింత చేరువ చేసేందుకు 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టామని రాష్ట్ర బ్యాంకర్ల సమితి (SLBC) కన్వీనర్ తెలిపారు.

రైతులకు సిబిల్ స్కోర్
బ్యాంకు ఖాతాదారులు తమ లోన్ హిస్టరీని తెలిపే సిబిల్ స్కోర్ సరిగా ఉండేలా చూసుకోవాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. రైతులకు కూడా సిబిల్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకొని రుణాలు ఇస్తామని చెబుతున్నారు.

ప్రకృతి వైపరీత్యాలు పరిగణలోకి తీసుకొని నిర్ణయం
ప్రకృతి వైపరీత్యాలు, రుణాల రీషెడ్యూల్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని స్థానిక బ్యాంకు మేనేజర్లు రైతుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ స్కీంలకు సంబంధించిన ఫండ్స్‌ను రుణబకాయిలకు జమ చేసుకోవద్దని బ్యాంకులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications