For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండుగ సీజన్ బంపరాఫర్: ఈ కారు ధర రూ.1 లక్ష తగ్గింపు

|

దాదాపు గత ఏడాది కాలంగా ఆటో సేల్స్ తగ్గి ఈ పరిశ్రమ మందగమనంతో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఆటో సేల్స్ తగ్గడంతో వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉద్దీపనలు ప్రకటించింది. మరోవైపు, కంపెనీలు కూడా తమ ఉత్పత్తులపై భారీఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

ఇటీవల మారుతీ మోడళ్ల పైన రూ.5,000 వరకు ధర తగ్గించింది. తాజాగా బాలెనో ఆర్ఎస్ మోడల్స్ పైన భారీగా తగ్గింపు ఇస్తోంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధరను రూ.1 లక్షకు పైగా తగ్గించింది. ఈ మేరకు బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. బాలెన్ ఆర్ఎస్ మోడల్ పైన ఈ తగ్గింపు వర్తిస్తుంది.

ఇటీవల మారుతీ సుజుకీ కంపెనీ తన కార్ల ధరల్ని తగ్గించింది. ఎంపిక చేసిన మోడల్స్ పైన రూ.5,000 వరకు తగ్గించింది. ఆల్టో 800, ఆల్టో K10, స్విఫ్ట్ డీజిల్ సెలెరియో, బాలెనో డీజిల్, ఇగ్నిస్, డిజైర్ డీజిల్, టూర్ ఎస్ డీజిల్, విటారా బ్రిజా, ఎస్ క్రాస్ మోడళ్ల ధరల్ని తగ్గిస్తున్నట్లు తెలిపింది.

Corporate tax: ఆఫర్లతో సహా ధరలు తగ్గించండి... నో చెబుతున్న కంపెనీలుCorporate tax: ఆఫర్లతో సహా ధరలు తగ్గించండి... నో చెబుతున్న కంపెనీలు

 Maruti Suzuki Baleno price slashed by Rs one lakh

ఈ కార్ల ధరలు రూ.2.93 లక్షల నుంచి రూ.11.49 లక్షల వరకు ఉన్నాయని, ప్రస్తుతం ఇస్తున్న డిస్కౌంట్స్, ఇతర ఆఫర్స్‌కు ఈ తగ్గింపు అదనమని తెలిపింది. ఈ తగ్గింపుతో అమ్మకాలు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు వల్ల వీటిని తగ్గిస్తున్నట్లు తెలిపింది.

ఆటో సేల్స్ తగ్గడంతో ఆటోమొబైల్ రంగం సంక్షోభంలో పడింది. దీంతో కస్టమర్లను ఆకర్షించి అమ్మకాలు పెంచుకునేందుకు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే అన్ని మోడల్స్ పైన ధర తగ్గించిన మారుతీ కారు.. దీంతో పాటు పలు ప్రమోషనల్ ఆఫర్లు కూడా ప్రకటించింది. దసరా, దీపావళి పండుగ సీజన్‌లో ధరలు తగ్గించడం వల్ల విక్రయాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల కార్పోరేట్ ట్యాక్స్ తగ్గిస్తూ కంపెనీలకు పెద్ద శుభవార్త చెప్పింది. దీంతో కంపెనీలే కాదు శుక్రవారం నుంచి మార్కెట్లు కూడా పరుగులు పెడుతున్నాయి. కార్పోరేట్లకు 10 నుంచి 12 శాతం వరకు ట్యాక్స్ తగ్గిస్తున్నట్లు గత శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దేశీయ కంపెనీలకు సెస్, సర్‌ఛార్జ్‌లు కలిపి 25.17 శాతం మాత్రమే. ఈ కొత్త ట్యాక్స్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.

English summary

పండుగ సీజన్ బంపరాఫర్: ఈ కారు ధర రూ.1 లక్ష తగ్గింపు | Maruti Suzuki Baleno price slashed by Rs one lakh

In a second round of price cut, automaker Maruti Suzuki today announced a massive decrease in prices of its popular Baleno RS model. According to a new price notification, the car will is now cheaper by ₹1 lakh.
Story first published: Friday, September 27, 2019, 16:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X