For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

థామస్ కుక్ మూసివేత! ఇబ్బందుల్లో లక్షన్నర మంది పర్యాటకులు!

|

178 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటిష్‌ పర్యాటక సంస్థ 'థామస్‌ కుక్‌' మూతపడింది. కార్యకలాపాల నిర్వహణకు తగినన్ని నిధులు లేకపోవడంతో కంపెనీ దివాలా తీసింది. అటు ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ దొరకడం దుర్లభం కావడం, ఇటు బ్రిటీష్ ప్రభుత్వ సాయం కూడా లభించకపోవడంతో థామస్ కుక్ కుప్పకూలింది.

పర్యాటక సంస్థ థామస్ కుక్ మూతపడడంతో.. ఈ కంపెనీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇప్పటికే పర్యటిస్తున్న లక్షన్నర మంది బ్రిటీష్ పర్యాటకులకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరోవైపు ఈ కంపెనీలో పనిచేస్తోన్న వేలాదిమంది ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరం కానుంది.

థమస్ కుక్‌కు ఎందుకీ పరిస్థితి?

థమస్ కుక్‌కు ఎందుకీ పరిస్థితి?

178 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటిష్‌ పర్యాటక సంస్థ ‘థామస్‌ కుక్‌' దివాలా తీయడానికి పలు కారణాలు ఉన్నాయి. పర్యాటక రంగంలో ఇతర సంస్థల నుంచి విపరీతమైన పోటీ ఎదురైంది. ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులు లభించకపోవడం, పర్యాటకానికి అంత్యంత అనుకూలమైన టర్కీ వంటి దేశాల్లో రాజకీయ అస్థిరత ఏర్పడడం, సమ్మర్ హాలీడే బుకింగ్స్‌లో తీవ్ర జాప్యం, బ్రెగ్జిట్ అనిశ్చితి.. ఇలా వరుస పరిస్థితుల కారణంగా సంస్థకు నష్టాలు మరింత పెరిగాయి.

గట్టెక్కడానికి ఎన్నో ప్రయత్నాలు, అయినా...

గట్టెక్కడానికి ఎన్నో ప్రయత్నాలు, అయినా...

నిర్వహణకు సరిపడా నిధులు సేకరించేందుకు పర్యాటక సంస్థ థామస్ కుక్ ఎంతగానో ప్రయత్నించింది. ఆగస్టులోనే తన అతిపెద్ద వాటాదారైన చైనా సంస్థ ఫోసున్ నేతృత్వంలో 900 మిలియన్ పౌండ్ల రెస్క్యూ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది, అయితే ఆకస్మిక నిధుల కోసం మరో 200 మిలియన్ డాలర్లను సమీకరించాలని రుణ బ్యాంకులు డిమాండ్ చేయడంతో ఈ ఒప్పందం అమలులోకి రాకుండాపోయింది. దీంతో ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో నష్టాలు భారీగా పెరగనున్నాయని ఈ ఏడాది మేలోనే థామస్‌ కుక్‌ వెల్లడించింది.

ఆదుకోమంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థించినా...

ఆదుకోమంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థించినా...

కార్యకలాపాలు కొనసాగించడానికి 25 కోట్ల డాలర్ల నిధులు అవసరమని థామస్‌ కుక్‌ గత శుక్రవారం వెల్లడించింది. నిధుల కోసం ఈ కంపెనీ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆదుకోవాలంటూ బ్రిటీష్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. మరోవైపు కంపెనీ మూతపడితే వేలాది మంది ఉద్యోగులు వీధులపాలవుతారని, కంపెనీని ప్రభుత్వమే ఆదుకోవాలని కంపెనీ ఉద్యోగుల సంఘం, టీఎస్‌ఎస్‌ఏ(ట్రాన్స్‌పోర్ట్‌ శాలరీడ్‌ స్టాఫ్స్‌ అసోసియేషన్‌) కూడా కోరింది. ఆదివారం రోజంతా రుణాల కోసం ఇతర సంస్థలతో సంప్రదింపులు జరిపినా ఫలితం కానరాలేదు. దీర్ఘకాలంలో ఈ కంపెనీ మనుగడపై సందేహాలున్న ప్రభుత్వ వర్గాలు కూడా తోడ్పాటుకు సందేహించాయి.

అప్పట్లో మోనార్క్‌ ఎయిర్‌లైన్స్, ఇప్పుడు‌...

అప్పట్లో మోనార్క్‌ ఎయిర్‌లైన్స్, ఇప్పుడు‌...

ప్రస్తుతం థామస్‌ కుక్‌ ఎదుర్కొంటున్న విషమ పరిస్థితినే రెండేళ్ల క్రితం మోనార్క్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా ఎదుర్కొంది. ఈ కంపెనీ మునిగిపోయినప్పుడు లక్షా పదివేల మంది ప్రయాణికులు వివిధ చోట్ల చిక్కుకు పోయారు. వీరిని వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి బ్రిటన్‌ ప్రభుత్వం ఎన్నో నిధులు వెచ్చించాల్సి వచ్చింది. అంతే కాకుండా బ్రిటన్‌లో 9,000 మందితో పాటు ప్రపంచవ్యాప్తంగా 22,000 మంది మోనార్క్ ఎయిర్ లైన్స్ ఉద్యోగులకు ఉద్యోగాలు పోయాయి.

ఇక ఇప్పుడేం జరుగుతుంది?

ఇక ఇప్పుడేం జరుగుతుంది?

థామస్ కుక్ మూతపడినట్లే. సంస్థ కుప్పకూలిపోవడం తీవ్ర విచారం కలిగించే విషయమని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ ఫాంక్‌హౌజర్ వ్యాఖ్యానించారు. బ్రిటీష్ ప్రభుత్వానికి చెందిన సివిల్ ఏవియేషన్ అధారిటీ(సీఏఏ) కూడా ఉన్నపాటున థామస్ కుక్ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. థామస్ కుక్ మూసివేతపై ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ గ్రాంట్ షాప్స్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడిక ఈ పర్యాటక సంస్థ ద్వారా ఇప్పటికే ప్రపంచంలోని వివిధ దేశాల్లో పర్యటిస్తోన్న వారిని తిరిగి స్వదేశానికి చేర్చాల్సి ఉంటుంది.

వెనక్కి రప్పించే ప్రయత్నాలు ఇలా...

వెనక్కి రప్పించే ప్రయత్నాలు ఇలా...

థామస్ కుక్ ద్వారా వివిధ దేశాల్లో పర్యటిస్తోన్న పర్యాటకులను తిరిగి స్వదేశానికి చేర్చడానికి బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. పర్యాటకుల తిరుగు ప్రయాణానికి అవసరమైన టిక్కెట్ ఛార్జీలను, ఇప్పటి వరకు వారు గడిపిన హోటల్ ఛార్జీలను ప్రభుత్వమే భరించనుంది. దీనికోసం ఇప్పటికే డజన్ల కొద్దీ ప్రత్యేక విమానాలను రంగంలోకి దించింది. ఈ విమానాలు ఆదివారమే వివిధ దేశాలకు బయలుదేరాయి. సోమవారం ఆయా దేశాల నుంచి పర్యాటకులను స్వదేశానికి చేర్చే పనిలో నిమగ్నమవుతాయి. ఈ విమానాల వివరాలు, వాటి తిరుగు ప్రయాణ వేళలు ఇప్పటికే సంబంధిత వెబ్ సైట్లలో పర్యాటకులకు అందుబాటులో ఉంచారు.

  English summary

  british travel agency thomas cook collapses as last-ditch rescue talks fail

  Thomas Cook has collapsed after last-minute negotiations aimed at saving the 178-year-old holiday firm failed. The UK Civil Aviation Authority (CAA) said the tour operator has "ceased trading with immediate effect".
  Story first published: Monday, September 23, 2019, 9:15 [IST]
  Company Search
  Thousands of Goodreturn readers receive our evening newsletter.
  Have you subscribed?
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more