For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PM Kisan: రైతులకు శుభవార్త, పోర్టల్‌లో నేరుగా రిజిస్టర్ చేసుకోవచ్చు

|

రైతులకు సంతోషాన్ని కల్పించే వార్త ఇది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ సిద్ధి (పీఎంకేఎస్ఎస్ ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నగదు అందని వారు చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా తమ పేర్లు రిజిస్టర్ కానీ రైతులు తామే నేరుగా పీఎం కిసాన్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకునే సదుపాయం వచ్చే వారం నుంచి అందుబాటులోకి రాబోతోంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 6,000 ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ చాలా మంది రైతులకు ఈ సొమ్ము కొంత మొత్తం అందింది.

కానీ మరి కొంత మంది రైతన్నలు ఈ సొమ్ము అందక ఎదురు చూసున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు నేరుగా తమ పేర్లను పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు వ్యవసాయ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం ఈ పథకం కింద రూ. 87,000 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

టాప్ 3లో ఆంధ్రప్రదేశ్, ఆ తేదీలోగా వివరాలు అందించిన రైతులకే పీఎం-కిసాన్టాప్ 3లో ఆంధ్రప్రదేశ్, ఆ తేదీలోగా వివరాలు అందించిన రైతులకే పీఎం-కిసాన్

సన్న, చిన్న కారు రైతులకు ప్రయోజనం

సన్న, చిన్న కారు రైతులకు ప్రయోజనం

* తొలుత ఈ పథకం ద్వారా 12 కోట్ల మంది చిన్న, సన్న కారు రైతులకు ఏటా రూ. 6,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు భూ పరిమితి 2 హెక్టార్ల వరకే ఉంది. అయితే దేన్నీ తర్వాత ఎత్తి వేయడంతో 14.5 కోట్ల మంది రైతులకు లాభం చేకూరే అవకాశం ఏర్పడింది.

పోర్టల్ ద్వారా ఇంకా ఏమి పొందవచ్చంటే..

పోర్టల్ ద్వారా ఇంకా ఏమి పొందవచ్చంటే..

* పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా రైతులు తమ ఆధార్ అతేంటికేషన్ ను కూడా పూర్తిచేసుకోవచ్చు. ఆధార్ వివరాల్లో మార్పులు ఉంటే చేసుకోవచ్చు.

* అంతే కాకుండా తమకు చెల్లింపులకు సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.

* సెప్టెంబర్ 23 నుంచి ఈ కొత్త సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

* పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఎన్ని విడతల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అయిందో కూడా తెలుసుకోవచ్చు.

6.55 కోట్ల మందికి చెల్లింపులు

6.55 కోట్ల మందికి చెల్లింపులు

* ఇప్పటికే ప్రభుత్వం ఒకటికి మించి విడతల్లో 6.55 కోట్ల మంది రైతులకు నగదు బదిలీ చేసింది. ఈ సొమ్ము రూ.24,000 కోట్లు.

* రైతులు నగదును పొందారా లేదా అన్నది ప్రస్తుతం తనిఖీ చేస్తున్నారు. ఇది ర్యాండమ్ పద్దతిలో జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు 5 శాతం మంది లబ్ధిదారులను క్రాస్ చెక్ చేయమని కేంద్రం కోరింది.

* ఈ పథకం ద్వారా రైతులు ఎంతగానో ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆర్ధిక మద్దతు ఇస్తున్నాయి. దీనికి కేంద్ర మద్దతు కూడా తోడవడంతో రైతులకు కాస్త ఆర్ధిక భరోసా ఏర్పడుతోంది.

English summary

PM Kisan: రైతులకు శుభవార్త, పోర్టల్‌లో నేరుగా రిజిస్టర్ చేసుకోవచ్చు | Farmers can register directly on PM KISAN portal from next week to get Rs 6K

Farmers can directly register on PM-Kisan portal from next week to get Rs 6,000 cash per year under a central scheme and also check the payment status, a senior agriculture ministry official said.
Story first published: Sunday, September 22, 2019, 17:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X