For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరుసగా 4 రోజులు బ్యాంకులు పని చేయవు: మీరేం చేయాలి!?

|

న్యూఢిల్లీ: పది మేజర్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల (PSB) విలీనం నేపథ్యంలో రెండు రోజుల పాటు ఆందోళన నిర్వహిస్తున్నట్లు బ్యాంకు యూనియన్ ప్రకటించింది. సెలవులు, ఆందోళనల నేపథ్యంలో సెప్టెంబర్ నెల చివర్లో బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు బంద్ కానున్నాయి. రెండు రోజులు బ్యాంకు స్ట్రైక్‌లు, రెండు రోజులు వారాంతపు సెలవులు. ఈ ప్రభావం చెక్ క్లియరెన్స్, క్యాష్ డిపాజిట్లు, విత్ డ్రా వంటి వాటిపై ప్రభావం చూపే అవకాశముంది.

గుడ్ న్యూస్: ఆధార్ కార్డులో ఈ మార్పులకు ప్రూఫ్స్ అవసరంలేదుగుడ్ న్యూస్: ఆధార్ కార్డులో ఈ మార్పులకు ప్రూఫ్స్ అవసరంలేదు

2 రోజులు సమ్మె

2 రోజులు సమ్మె

దేశవ్యాప్తంగా ఈ నెల సెప్టెంబర్ 25వ తేదీ అర్ధరాత్రి నుంచి 27వ తేదీ వరకు సమ్మెకు దిగనున్నట్లు ప్రభుత్వరంగ బ్యాంకుల అధికారుల సంఘాలు చెప్పాయి. ఈ మేరకు ఆలిండియా బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్, ఆలిండియా బ్యాంకు అధికారుల అసోసియేషన్, భారత జాతీయ బ్యాంకు అధికారుల కాంగ్రెస్, బ్యాంకు అధికారుల నేషనల్ ఆర్గనైజేషన్‌లు సంయుక్తంగా నోటీసు ఇచ్చాయి.

మొత్తంగా 4 రోజులు వరుసగా బ్యాంకులు పని చేయవు

మొత్తంగా 4 రోజులు వరుసగా బ్యాంకులు పని చేయవు

ఆర్బీఐ నిబంధనల మేరకు ప్రతి నెల రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు. దీంతో 26, 27 సమ్మెతో పాటు 28వ తేదీన రెండో శనివారం బ్యాంకుకు సెలవు. 29వ తేదీన ఆదివారం. కాబట్టి వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు పని చేయవు.

ముందు జాగ్రత్తలు..

ముందు జాగ్రత్తలు..

వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు పని చేయవు కాబట్టి బ్యాంకులతో పనులు కలిగినవారు ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. నాలుగు రోజుల పాటు డిపాజిట్లు, ఉపసంహరణలు చేయలేరు. చెక్కులు క్లియర్ కావడానికి సమయం తీసుకుంటుంది.

ఈ సమస్యలు రావొచ్చు...

ఈ సమస్యలు రావొచ్చు...

'రెండు రోజుల పాటు బ్యాంకర్ల సమ్మె, రెండు రోజులు వరుసగ సెలవవలు కాబట్టి ఈ ప్రభావం చెక్ క్లియరెన్స్, డీడీ/పీవో, క్యాష్ డిపాజిట్స్/విత్ డ్రాలు వంటి తదితర సేవలపై ప్రభావం పడుతుంది. ఏటీఎం సేవలపై ప్రభావం ఉండే అవకాశాలు ఉంటాయి. బ్యాంకింగ్ వినియోగదారులు తమకు అవసరమైన నగదును ముందుగానే సిద్ధం చేసుకోవాలి. బ్యాంకు సమ్మెకు ముందు తగిన నగదు డిపాజిట్ లేదా ఉపసంహరణలు అవసరమైతే చేసుకోవాలి' అని పైసాబజార్ డాట్ కామ్ సీఈవో, కోఫౌండర్ నవీన్ కుక్రేజా అన్నారు.

వీటికి ఇబ్బంది లేదు...

వీటికి ఇబ్బంది లేదు...

సమ్మె నేపథ్యంలో కస్టమర్లు సిద్ధంగా ఉండాలని, అయితే నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం సజావుగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇంట్రా బ్యాంకింగ్ ట్రాన్సుఫర్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్లు వంటి డిజిటల్ లావాదేవీలకు వచ్చిన ఇబ్బంది లేదని, కాబట్టి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని, వీక్ ఆఫ్ సమయాల్లో ఆర్టీజీఎస్, నెఫ్ట్ ట్రాన్సాక్షన్లు అందుబాటులోనే ఉంటాయని కుక్రేజా చెప్పారు.

English summary

వరుసగా 4 రోజులు బ్యాంకులు పని చేయవు: మీరేం చేయాలి!? | Bank unions declare two day strike in September, What to expect?

Bank unions have announced a 2-day strike, starting at midnight on 25 Sept and continuing till 27 Sept, to protest the merger of 10 major PSBs announced by FM Sitharaman last month.
Story first published: Tuesday, September 17, 2019, 10:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X