ముంబై: ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు పండుగల సమయంలో భారీ డిస్కౌంట్లు ఇస్తుంటాయి. ఈ ప్రభావం ట్రేడర్స్ పైన భారీగా పడుతోంది. ఈ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్డ్ ఫెస్టివల్ సేల్‌ను నిషేధించాలని ఇండియన్ ట్రేడర్ బాడీ శుక్రవారం నాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ-కామర్స్ సంస్థల భారీ డిస్కౌంట్ల ద్వారా ఫారన్ ఇన్వెస్ట్‌మెంట్ రూల్స్‌ను అతిక్రమిస్తున్నాయని తెలిపాయి.

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ భారీ ఆఫర్లు
అక్టోబర్, నవంబర్ నెలల్లో వచ్చే అతిపెద్ద పండుగలు దసరా, దీపావళి. ఈ సమయంలో వ్యాపారం భారీగా జరుగుతుంది. కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు భారీ ఆఫర్ల ద్వారా సాధారణ ట్రేడర్లను దెబ్బతీస్తున్నారు. ఈ పండుగ సీజన్‌లో వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్ సెప్టెంబర్ 29వ తేదీ నుంచి వరుసగా ఆరు రోజుల పాటు డిస్కౌంట్ సేల్ అందిస్తోంది. అమెజాన్ కూడా తేదీలు ప్రకటించాల్సి ఉంది. ఈ రెండు ఈ-కామర్స్ దిగ్గజాలు కూడా ఫ్యాషన్ నుంచి స్మార్ట్ ఫోన్స్, హోమ్ అప్లియన్సెస్ వరకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

ధరలను ప్రభావితం చేస్తున్న ఈ-కామర్స్ సంస్థలు
ఈ-కామర్స్ సంస్థలు వివిధ ఉత్పత్తులపై 10 శాతం నుంచి 80 శాతం వరకు భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయని, తద్వారా ధరలను ప్రభావితం చేస్తున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఫెడరల్ ట్రేడ్ మినిస్టర్‌కు లేఖ రాసింది.

ఇప్పుడు ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోవచ్చు కానీ...
CAIT 5,00,000 మర్చంట్స్, ట్రేడర్స్‌ను కలిగి ఉంది. ఈ-కామర్స్ భారీ సేల్ అమ్మకాలపై నిషేధం విధఇంచాలని ఇది ఎఫ్‌డీఐ నిబంధనలను ఉల్లంఘించడమేనని CAIT పేర్కొంది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఈ-కామర్స్ దిగ్గజాల సేల్స్‌ను ఆపలేకపోవచ్చు. కానీ ప్రభుత్వం కొన్ని నిబంధనలు సిద్ధం చేసేందుకు ఈ ఫిర్యాదు ఉపయోగపడుతుంది. తద్వారా ఇప్పుడు కాకపోయినా రేపైనా ట్రేడర్స్ డిమాండుకు ఫలితం ఉండవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ సేల్‌తో పాటు బీమా కొనుగోలు
కాగా, ఫ్లిప్‌కార్ట్ అతిపెద్ద సేల్ ఆఫర్ బిగ్ బిలియన్ డే తేదీల్ని ఇటీవల ప్రకటించింది. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 4 వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ఆరు రోజుల పాటు కొనసాగనున్న ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు 4 గంటలు ముందుగానే అందుబాటులోకి వస్తుంది. కార్డుపై కొనుగోళ్లు చేసేవారికి ప్రత్యేక ఆఫర్లు అందిస్తారు. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులతో జతకట్టింది ఫ్లిప్‌కార్ట్. తొలిసారిగా బిగ్ బిలియన్ డే ఆఫర్‌లో ఉపకరణాలకు బీమా కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications