For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇప్పటికైనా ఇలా చేయండి: నరేంద్రమోడీకి మన్మోహన్ సింగ్ 5 చిట్కాలు ఇవే...

|

న్యూఢిల్లీ: దేశంలో నెలకొన్ని ఆర్థిక మందగమనానికి నరేంద్ర మోడీ సర్కార్ విధానాలు కారణమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం పరిస్థితులు ఉన్నాయి. భారత్‌లోను అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత మన్మోహన్ స్లోడౌన్ నుంచి బయటపడేందుకు పలు మార్గాలు ఉన్నాయని ప్రభుత్వానికి సూచించారు. ఆర్థిక సంక్షోభాన్ని గుర్తించి, జీడీపీ వృద్ధి పతనానికి దారి తీస్తున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆర్థిక మందగమన పర్యావసనాలను ప్రభుత్వం పూర్తిగా గ్రహించలేదన్నారు. మన్మోహన్ ఐదు రెమెడీలు సూచించారు.

రూ.1,700 తగ్గిన బంగారం ధర: హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో...రూ.1,700 తగ్గిన బంగారం ధర: హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో...

జీఎస్టీని హేతుబద్దీకరించాలి

జీఎస్టీని హేతుబద్దీకరించాలి

నోట్ల రద్దు, లోపభూయిష్ట జీఎస్టీ విధానాల అమలు మందగమనానికి దారి తీశాయని మన్మోహన్ సింగ్ చెప్పారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ రేట్లను హేతుబద్దీకరించాలని సూచించారు. ఇది స్వల్పకాల ఆదాయ నష్టానికి దారి తీయవచ్చునని, కానీ దీర్ఘకాలంలో బాగుంటుందని చెప్పారు. జీఎస్టీ రేట్లు తగ్గించాలని మన్మోహన్ సింగ్ మాత్రమే చెప్పడం లేదు... ఆటో పరిశ్రమ సహా వివిధ వర్గాలు కోరుతున్నాయి.

రూ.5 బిస్కట్ పాకెట్ కొనడం లేదు..

రూ.5 బిస్కట్ పాకెట్ కొనడం లేదు..

కన్స్యూమర్ డిమాండ్ పెంచడానికి వినూత్న మార్గాలు అవసరమని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక మందగమనానికి కన్స్యూమర్ డిమాండ్ తగ్గడం అతిపెద్ద కారణమని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వృద్ధికి ముఖ్య సూచీకలలో ఒకటైన వినియోగాన్ని పెంచడంలో ప్రభుత్వం విఫలమైతే మందగమనం దీర్ఘకాలిక వ్యవహారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.5 బిస్సట్ సేల్స్ కూడా భారీగా పడిపోయాయని, ఈ కంపెనీలే తమ గోడును వెల్లబోసుకుంటున్నాయని మన్మోహన్ అభిప్రాయపడ్డారు. కన్సంప్షన్ తగ్గడం వల్ల ఇప్పటికే భారత్ స్వల్పకాలిక ప్రభావాలను ఎదుర్కొంటుందన్నారు.

లేబర్ ఇన్సెంటివ్ సెక్టార్‌కు పరిష్కారం

లేబర్ ఇన్సెంటివ్ సెక్టార్‌కు పరిష్కారం

ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనం ముందస్తు హెచ్చరిక అని, ఈ నేపథ్యంలో లేబర్ ఇన్సెంటివ్ సెక్టార్స్ సమస్యల పరిష్కారాలను గుర్తించేందుకు ఏ మాత్రం సమయం వృథా చేయరాదని మన్మోహన్ సూచించారు. ఉదాహఱణకు ఆటో పరిశ్రమ 3 మిలియన్లకు పైగా ఉద్యోగాలను కలిగి ఉందని, ఇందులో 3 లక్షల మంది ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రంగం పరిస్థితి ఇలాగే ఉంటే ఇది 10 లక్షల వరకు ఉంటుందని హెచ్చరించారు. రోజువారీ లక్షలాది మంది వేతన కార్మికులకు ఉపాధి కల్పించే రియల్ ఎస్టేట్ రంగం కూడా మందగమనానికి లోనవుతోందని, దీనిని పరిష్కరించాలన్నారు.

లిక్విడిటీ బూస్ట్

లిక్విడిటీ బూస్ట్

ఆర్థిక మందగమనానికి లిక్విడిటీ సమస్య కూడా ఓ కారణమని మన్మోహన్ సింగ్ అన్నారు. 2018 నుంచి ద్రవ్య లభ్యత భారతీయ బ్యాంకులను, ఎన్‌బీఎఫ్‌సీలను కుదేలు చేసిందన్నారు. మీడియం, ఎంఎస్ఎంఈలకు బలవంతంగా రుణాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. 2016లో నోట్ల రద్దు అనంతరం ఎంఎస్ఎంఈలపై దీర్ఘకాలిక ప్రభావం పడిందన్నారు. ఈ సందర్భంగా ఆయన జీఎస్టీ లోపాలను ఎత్తి చూపారు. ఇది ఎంఎస్ఎంఈలను మరింత దివాలా తీసిందన్నారు.

ఎగుమతి అవకాశాలు

ఎగుమతి అవకాశాలు

అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భారత్ కొత్త ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకోవాలని మన్మోహన్ సింగ్ సూచించారు. కొత్త ఎగుమతి రోడ్డు మ్యాప్ భారత్‌కు ప్రయోజనం అన్నారు. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం అవకాశాలను కొనుగొనవలసి ఉందని చెప్పారు.

మన్మోహన్ ఇంకా ఏం చెప్పారంటే...

మన్మోహన్ ఇంకా ఏం చెప్పారంటే...

జీఎస్టీతో కొంత కాలం నష్టాలు వచ్చినప్పటికీ దీనిని ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా వివరించాలని మన్మోహన్ సూచించారు. వ్యవసాయ రంగంలో కొత్త విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగంను పెంచాలన్నారు. వ్యవసాయ ఆధారిత మార్కెట్లకు ఉన్న అన్ని సంకెళ్లను తీసివేసి స్వేచ్ఛగా పనిచేసే విధానం తీసుకువచ్చి నేరుగా ప్రజల చేతికే డబ్బులు అందేలా చూడాలన్నారు. మూలధనం ఏర్పాటుకు నగదును వ్యవస్థలోకి పంప్ చేయాలన్నారు. ప్రాధాన్యత కలిగిన రంగాల్లో సంస్కరణలు తీసుకురావాలన్నారు. అంటే టెక్స్‌టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ మరియు తక్కువ ధరకే గృహాలు వంటి అంశాలపై దృష్టిసారించాలన్నారు. ఇందుకోసం రుణాలు ఇవ్వాలని అదికూడా సరళమైన పద్ధతిలో జరగాలన్నారు.

English summary

ఇప్పటికైనా ఇలా చేయండి: నరేంద్రమోడీకి మన్మోహన్ సింగ్ 5 చిట్కాలు ఇవే... | Manmohan Singh slams govt, shares 5 point remedy plan for revival

Cutting to the chase yet again, former prime minister Manmohan Singh advised the government to acknowledge the economic crisis and solve the problems that have led to a sharp drop in GDP growth.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X