For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్ వృద్ధి నెమ్మదించింది, కానీ చైనా-అమెరికా కంటే సూపర్: IMF

|

భారత ఆర్థిక వ్యవస్థ అంచనా కంటే బాగా నెమ్మదించిందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) గురువారం వెల్లడించింది. ఆర్థిక వృద్ధి మందగించడానికి గల కారణాలను కూడా వెల్లడించింది. కార్పోరేట్, పర్యావరణ రంగానికి సంబంధించి రెగ్యులేటరీలో నెలకొన్ని అనిశ్చితి కారణమని IMF అధికార ప్రతినిధి గేరీ రైస్ వెల్లడించారు. ఎన్‌బీఎఫ్‌సీ బలహీనపడటం కూడా ఆర్థిక వ్యవస్థ నెమ్మదికి కారణమన్నారు.

జగన్ ప్రభుత్వం టార్గెట్ మిస్! రూ.500 కోట్ల ఆదాయం కట్జగన్ ప్రభుత్వం టార్గెట్ మిస్! రూ.500 కోట్ల ఆదాయం కట్

IMF జూలైలో విడుదల చేసిన నివేదికలో భారత వృద్ధి రేటు అంచనాల్లో 0.3 శాతం తగ్గించి 2019లో ఏడు శాతంగా, 2020లో 7.2 శాతంగా ఉండవచ్చునని విశ్లేషించింది. అయితే అంచనాల కంటే భారీగా తగ్గింది. అయినప్పటికీ అమెరికా, చైనా కంటే వేగవంతమైన వృద్ధి రేటు నమోదు చేస్తోందని కూడా IMF తెలిపింది.

IMF says recent economic growth of India much weaker than expected

ఇటీవలి త్రైమాసికంలో జీడీపీ రేటు తగ్గడంపై స్పందిస్తూ భారత ఆర్థిక పరిస్థితులను IMF పర్యవేక్షిస్తోందని చెప్పారు. కాగా, క్రిసిల్ కూడా 2019-20 ఆర్థిక వృద్ధి రేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.9 శాతానికి పరిమితం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్టానికి పడిపోయిన విషయం తెలిసిందే.

English summary

భారత్ వృద్ధి నెమ్మదించింది, కానీ చైనా-అమెరికా కంటే సూపర్: IMF | IMF says recent economic growth of India much weaker than expected

India's economic growth is much weaker than expected, the IMF said on Thursday, attributing the reasons for corporate and environmental regulatory uncertainty and lingering weaknesses in some non bank financial companies.
Story first published: Friday, September 13, 2019, 14:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X