For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్తతరం ఆయిల్ కాదు: ముఖేష్ అంబానీకి ఫేస్‌బుక్ గట్టి కౌంటర్

|

ఢిల్లీ: డేటా కొత్త తరం ఇంధనం ఏమీ కాదని ఫేస్‌బుక్ ఉపాధ్యక్షులు నిక్ క్లెగ్ అన్నారు. భారత్ వంటి దేశాలుడేటాను అదుపు చేయకూడదని, సరిహద్దులు చెరిపేయాలని హితవు పలికారు. జాతీయ భద్రతకు డేటాను పంచుకోవడం కీలకమని చెప్పారు. తీవ్ర నేరాలు, ఉగ్రవాదం వంటి వాటిని అదుపు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. వ్యక్తిగత డేటా గోప్యతను అందరు గౌరవించాలని, అయితే పోటీతత్వం, వినూత్నతను ప్రోత్సహించడం మాత్రం తప్పనిసరి అన్నారు.

పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు తగ్గుతాయా?పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు తగ్గుతాయా?

ముఖేష్ అంబానీకి ఫేస్‌బుక్ కౌంటర్

ముఖేష్ అంబానీకి ఫేస్‌బుక్ కౌంటర్

డేటా విషయంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చేసిన ప్రకటనకు విరుద్ధంగా ఫేస్‌బుక్ స్పందించడం గమనార్హం. డేటా కొత్త తరం చమురుకాదని, దీనిని ఓ దేశం పరిధిలో నిల్వ చేయరాదని నిక్ క్లెగ్ అన్నారు. భారత్ వంటి దేశాలు డేటాను ఓ పరిమిత వస్తువుగా చూడకుండా, సాఫీగా దేశ సరిహద్దులు దాటేందుకు అనుమతించాలన్నారు.

ముఖేష్ అంబానీ ఏం చెప్పారంటే

ముఖేష్ అంబానీ ఏం చెప్పారంటే

డేటాను దేశీయంగా నిల్వ చేయాలని, ఇందుకు అన్ని కంపెనీలు చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. డేటా కొత్త ఇంధనం అని, సామాజిక మాధ్యమ వేదికలు, భారత యూజర్లు డేటాను కాపాడాల్సి ఉందని ముఖేష్ అంబానీ కూడా చెప్పారు. దేశానికి చెందిన డేటాను భారత వ్యక్తులో కలిగి ఉండటం, నియంత్రించడం చేయాలని, అంతేకానీ అది దేశీయ, అంతర్జాతీయ కార్పోరేట్లు కాదన్నారు.

కొత్త తరం ఆయిల్‌గా భావిస్తున్నారు... కానీ

కొత్త తరం ఆయిల్‌గా భావిస్తున్నారు... కానీ

ఈ నేపథ్యంలో నిక్ క్లెగ్ పరోక్షంగా డేటా కొత్త తరం ఆయిల్ కాదని ఆయనకు కౌంటర్ ఇచ్చారు. భారత్‌లో చాలామంది, ప్రపంచవ్యాప్తంగా కూడా డేటాను కొందరు కొత్త ఆయిల్‌గా భావిస్తున్నారని, దేశం పరిధిలోనే భారీ చమురు నిల్వలను కలిగి ఉండవచ్చునని, ఇది కచ్చితంగా సంపదను పెంచుతుందని, కానీ, ఈ విధమైన పోలిక పొరపాటు అని నిక్ క్లెగ్ అన్నారు.

భారత్ కొత్త నిర్వచనం చెప్పాలి

భారత్ కొత్త నిర్వచనం చెప్పాలి

నిలిపి ఉంచడం వల్ల డేటాకు విలువ రాదని, స్వేచ్ఛగా ప్రయాణించేందుకు అనుమతించడం ద్వారా ఆవిష్కరణల్ని ప్రోత్సహించాలని నిక్ క్లెగ్ సూచించారు. డేటాకు ఏం జరుగుతుందో తెలుసుకునే వ్యక్తుల హక్కులను గౌరవించాలని, పోటీని, ఆవిష్కరణను ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరు డేటాను పొందే దిశగా దానిని అందుబాటులో ఉంచాలని ఈ దిశగా ఇంటర్నెట్‌కు భారత్ కొత్త నిర్వచనం చెప్పాల అన్నారు.

English summary

కొత్తతరం ఆయిల్ కాదు: ముఖేష్ అంబానీకి ఫేస్‌బుక్ గట్టి కౌంటర్ | Facebook's Nicholas Clegg counters Mukesh Ambani, says data isn't oil

Countering Reliance Industries Chairman Mukesh Ambani, Facebook Inc on Thursday said data was not the new oil, and countries like India should allow its free flow across borders instead of attempting to hoard it as a finite commodity within national boundaries.
Story first published: Friday, September 13, 2019, 8:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X