For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీ కేర్‌ఫుల్: ప్రీమియం మోత, ట్రాఫిక్ ఉల్లంఘనలతో మోటార్ ఇన్సురెన్స్ లింక్!

|

ఇప్పటికే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వేలాది రూపాయల జరిమానా కట్టవలసిన పరిస్థితులు వచ్చాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మోటార్ వాహన చట్ట నిబంధనలు అమలవుతున్నాయి. దీంతో నిబంధనలు ఉల్లంఘిస్తే గతంలో కంటే భారీ మొత్తంలో ఫైన్స్ చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మరో భారం కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు, మోటార్ వాహన ప్రీమియాన్ని అనుసంధానించే వ్యవస్థను పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఓ వర్కింగ్ గ్రూప్‌ను నియమించినట్లు తెలిపింది.

నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ లాక్-అన్‌లాక్ ఎలాగో తెలుసుకోండి?నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ లాక్-అన్‌లాక్ ఎలాగో తెలుసుకోండి?

ఢిల్లీలో పైలట్ ప్రాజెక్టు...

ఢిల్లీలో పైలట్ ప్రాజెక్టు...

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇన్సురెన్స్ ప్రీమియాన్ని అధికం చేసే ఉద్దేశ్యంలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఫార్ములాను అమలు చేస్తున్నారు. ఈ వర్కింగ్ గ్రూప్‌లో మొత్తం 9 మంది ఉన్నారు. ఇందులో IRDAI, ఇన్సురెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (IIBI), ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు, ఇన్సురెన్స్ కంపెనీల నుంచి మెంబర్స్ ఉన్నారు.

ప్రస్తుత బీమా పద్ధతి....

ప్రస్తుత బీమా పద్ధతి....

ప్రస్తుతం ఇన్సురెన్స్ ప్రీమియం వాహనం మరియు ఇంజిన్ సామర్థ్యంతో ముడివడి ఉంది. గత ఏడాదిలోని ప్రతి క్లెయిమ్ హిస్టరీని బట్టి ప్రీమియం లెక్కిస్తారు. భారతీయ రోడ్లపై నడుస్తున్న అన్ని వాహనాలకు థర్డ్ పార్టీ మోటార్ ఇన్సురెన్స్ తప్పనిసరి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి జరిమానాలు ఎదుర్కొనే వారికి ఈ ఇన్సురెన్స్ ప్రీమియాన్ని పెంచేందుకు ప్లాన్ చేస్తోంది IRDAI.

రెండు నెలల్లో నిర్ణయం...

రెండు నెలల్లో నిర్ణయం...

ట్రాఫిక్ ఉల్లంఘనలతో మోటార్ ఇన్సురెన్స్ ప్రీమియంను త్వరలో IRDAI అనుసంధానం చేయనుందని తెలుస్తోంది. ఆయా ఇన్సురెన్స్ సంస్థలకు కూడా పంపించనుంది. ప్రభుత్వం విజ్ఞప్తితో ఈ మొత్తం అంశం పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు సిఫార్సుల ఆధారంగా రెండు నెలల్లో ఓ నిర్ణయానికి రానుంది.

కమిటీ సిఫార్సుల తర్వాత...

కమిటీ సిఫార్సుల తర్వాత...

శుక్రవారం IRDAI జారీ చేసిన ఆదేశాలతో దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రయోగాత్మకంగా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. కమిటీ సిఫార్సులు వచ్చాక దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశముంది. ఇన్సురెన్స్ ధర పెరిగితే రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశముందని, వాహనాన్ని నడిపేవారి ప్రవర్తన మారే అవకాశముందని IRDAI అభిప్రాయపడుతోంది.

అధ్యయనం తర్వాత అనువైన విధానం..

అధ్యయనం తర్వాత అనువైన విధానం..

అంతర్జాతీయంగా అమలవుతున్న విధానాల్ని అధ్యయనం చేసి భారత్‌కు అనువైన విధానాన్ని కమిటీ సూచించాల్సి ఉంది. రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న విధానాన్నీ పరిశీలించాలి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే ఆ వివరాలు ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీల నుంచి ఐఐబీఐ డేటాబేస్‌కు బదిలీ అయ్యేలా ఓ వ్యవస్థను సిఫార్సు చేయాలి. వర్కింగ్ గ్రూప్ ఎనిమిది వారాల్లో నివేదికను సమర్పించనుంది.

English summary

బీ కేర్‌ఫుల్: ప్రీమియం మోత, ట్రాఫిక్ ఉల్లంఘనలతో మోటార్ ఇన్సురెన్స్ లింక్! | IRDAI may soon link motor insurance premium with traffic violations

Soon, you may need to pay higher motor insurance premium if you break traffic rules. The insurance regulator and the government have set up a working group to look at linking insurance premium with traffic violations.
Story first published: Sunday, September 8, 2019, 10:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X