For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంక్ లాకర్ భద్రం... మరి ఈ విషయాలు తెలుసుకోవాలి...

|

ప్రతి ఇంట్లోనూ విలువైన కాగితాలు, డబ్బు, బంగారు ఆభరణాలు ఉంటాయికదా. వీటిని చాలా మంది తమ ఇంట్లోని బీరువాళ్లో దాచుచుకుంటారు. అయితే పరిస్థితులు ఎప్పుడు ఒకే మాదిరిగా ఉండక పోవచ్చు. దొంగతనాలు జరగవచ్చు. లేదా ప్రకృతి విపత్తులు సంభవించవచ్చు. ఇలాంటి సందర్భంలో విలువైన కాగితాలు లేదా ఆభరణాలకు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి నష్టం జరగకూడదని భావించే చాలా మంది బ్యాంకు లాకర్లను ఆశ్రయిస్తుంటారు. దాదాపు అన్ని బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు లాకర్ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. ఈ సదుపాయాన్ని పొందటానికి ఏం చేయాలి, బ్యాంకులు ఎలాంటి షరతులను విధిస్తాయో తెలుసుకుందాం ...

 ఎవరు పొందవచ్చు..

ఎవరు పొందవచ్చు..

* ఒక బ్యాంకులో లాకర్ సదుపాయాన్ని పొందాలనుకుంటే ముందు ఆ బ్యాంకులో ఒక సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అప్పటికే ఖాతా ఉంటే ఈ అవసరం ఉండదు.

* బ్యాంకుల్లో లాకర్ ఖాళీగా ఉంటేనే పొందడానికి అవకాశం ఉంటుంది. ఎంత మంది కస్టమర్లు ఉంటే అంత అందికీ లాకర్ అవసరం ఉండదు కాబట్టి బ్యాంకు శాఖల్లో తక్కువగానే లాకర్లు ఉంటాయి. వీటిలో ఎవరు ముందు అడిగితే వారికి లాకర్ ను బ్యాంకులు కేటాయిస్తాయి. లాకర్ ఖాళీగా లేకపోతే ఈ సదుపాయాన్ని పొందడానికి అవకాశం ఉండదు. అప్పుడు మరో బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది.

* బ్యాంకు లాకర్ సదుపాయాన్ని వ్యక్తులు వ్యక్తిగతంగానే కాకుండా ఉమ్మడిగా తీసుకోవచ్చు. సంస్థలు, హిందూ అవిభాజ్య కుటుంబాలు కూడా లాకర్ ను పొందడానికి అవకాశం ఉంటుంది.

లాకర్ సదుపాయం పొందాలంటే...

లాకర్ సదుపాయం పొందాలంటే...

* లాకర్ సదుపాయాన్ని పొందాలంటే బ్యాంకులో తగిన దరఖాస్తు ఫారం నింపి సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకు విధించే నిబంధనలు పాటించాడనికి సిద్ధమేనని అంగీకరిస్తూ సంతకం చేయాల్సి ఉంటుంది.

* కస్టమర్ కు సంబంధించిన నో యువర్ కస్టమర్ డాక్యుమెంట్లను, ఫోటోలను సమర్పించాల్సి ఉంటుంది.

* లాకర్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నందుకు బ్యాంకుకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే అద్దె చెల్లించాల్సి రావచ్చు. అంతే కాకుండా బ్యాంకులు కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని కోరతాయి. దీనిపై వడ్డీ చెల్లిస్తాయి.

* ఇంతకు ముందు బ్యాంకులు ఎక్కువ మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని కస్టమర్లపై ఒత్తిడి తెచ్చేవి. అంతే కాకుండా బీమా పాలసీలు తీసుకోమని అడిగేవి. అయితే వీటి విషయంలో ఆర్బీఐ కొన్ని ఆంక్షలను విధించిందని. కాబట్టి కస్టమర్లపై భారం తగ్గింది.

నిబంధనలు పాటించాలి...

నిబంధనలు పాటించాలి...

* లాకర్ కేటాయింపుతో పాటు దాని వినియోగానికి సంభందించి బ్యాంకులు విధించే నిబంధనలు కస్టమర్లు పాటించాల్సి ఉంటుంది.

* ఏడాదిలో కనీసం ఒక సారైనా లాకర్ ను తెరవాల్సి ఉంటుంది. ఒక వేళా ఇలా చేయని సందర్భంలో బ్యాంకులు కస్టమర్లకు సమాచారం అందిస్తాయి. అయినా స్పందించకపోతే లాకర్ కేటాయింపును రద్దు చేసే అవకాశం ఉండవచ్చు. లాకర్ కు సక్రమంగా అద్దె చెల్లించినప్పటికీ దాని నిర్వహణ చూసుకోవడం కస్టమర్ భాద్యత. ఏడాదిలో 12 సార్లు లాకర్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.పరిమితి పరిమితి దాటితే అదనంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

* బ్యాంకు లాకర్ తీసుకునే కస్టమర్ నామినీని లేదా జాయింట్ హోల్డర్ ను అనుమతిస్తారు. దీని వల్ల కస్టమర్ ఒకవేళ మృతి చెందితే నామినీ లాకర్ ను తెరిచే అవకాశం కల్పిస్తారు.

చార్జీలు

చార్జీలు

* లాకర్ చార్జీలు బ్యాంకును బట్టి మారుతుంటాయి. బ్యాంకు శాఖ ఉన్న ప్రాంతాన్ని బట్టి కూడా చార్జీల్లో తేడా ఉంటుంది. ప్రభుత్వ, ప్రయివేట్ బ్యాంకులు విభిన్నమైన చార్జీలను విధిస్తున్నాయి.

* లాకర్ చార్జీలు ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే రూ. 1,000 నుంచి రూ.8,000 వరకు, ప్రయివేట్ బ్యాంకులయితే రూ. 1,500 నుంచి రూ. 20,000 లకు పైగా ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని బ్యాంకులు ఇచ్చే సదుపాయాన్ని బట్టి ఈ చార్జీలు పెరుగుతాయి.

* లాకర్ కు సంభందించి తాళం చెవి బ్యాంకు వద్ద ఒకటి కష్టమర్ వద్ద ఒకటి ఉంటుంది. ఒకవేళ కస్టమర్ తన కీని కోల్పోతే మరో కీని పొందడానికి బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తాయి.

English summary

బ్యాంక్ లాకర్ భద్రం... మరి ఈ విషయాలు తెలుసుకోవాలి... | Bank Locker Rules and Regulations

To ensure prompt payment of locker rent, banks may at the time of allotment, obtain a Fixed Deposit which would cover 3 years rent and the charges for breaking open the locker in case of an eventuality.
Story first published: Saturday, September 7, 2019, 18:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X