For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: ఆధార్ అప్‌డేట్ కోసం ఆన్‌లైన్‌లో అపాయింటుమెంట్

|

ఆధార్ కార్డులో అడ్రస్, మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవడం మరింత సులభం కానుంది. UIDAI చెన్నై నగరంలో కొత్త ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఏవైనా మార్పులు చేర్పులు కోరుకునేవారు తమకు అనుకూల సమయంలో వెళ్లేలా అపాయింటుమెంట్‌ను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. దీనిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోన్న పాస్ పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో UIDAI ఈ ఆధార్ సేవా కేంద్రాల్ని నడుపుతుంది.

యవ్వనంగా కనిపిస్తారు..: 'మహేష్‌బాబు'తో మళ్లీ చెప్పించేది ఇదేయవ్వనంగా కనిపిస్తారు..: 'మహేష్‌బాబు'తో మళ్లీ చెప్పించేది ఇదే

కొత్త ఆధార్ కేంద్రం..

కొత్త ఆధార్ కేంద్రం..

చెన్నైలోని కోయంబేడు ప్రాంతంలో టెన్ స్క్వేర్ మాల్ వద్ద UIDAI ఈ ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఆధార్ కేంద్రాల్లో లభించే సేవలు అన్నీ ఇక్కడ లభిస్తాయి. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, పేరు, మొబైల్ నెంబర్, చిరునామా, ఈ-మెయిల్, బర్త్ డేట్, జెండర్, బయోమెట్రిక్ వంటి వాటిని వేటినైనా మార్చుకోవడం లేదా అప్ డేట్ చేసుకోవడం చేయవచ్చు.

అపాయింటుమెంట్ తీసుకొని...

అపాయింటుమెంట్ తీసుకొని...

UIDAI వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్‌లో అపాయింటుమెంట్ తీసుకోవచ్చు. ఇందుకు మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది. చెన్నై ఆధార్ సేవాకేంద్రం ఉదయం గం.9.30 నుంచి సాయంత్రం గం.6.00 వరకు పని చేస్తుంది. మంగళవారం మినహా అన్ని రోజులు కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆధార్ నమోదు ఉచితం. కానీ అప్ డేట్ చేసుకోవడానికి రూ.50 ఛార్జ్ ఉంటుంది.

విజయవాడ సహా ఈ నగరాల్లో కేంద్రాలు...

విజయవాడ సహా ఈ నగరాల్లో కేంద్రాలు...

UIDAI ఢిల్లీ, భోపాల్, ఆగ్రా, హిస్సార్, విజయవాడ, చండీగఢ్ నగరాలలో ఈ ఆధార్ కేంద్రాలను ప్రారంభించింది. ఈ ఏడాది చివరి వాటికి 53 నగరాల్లో మరో 114 కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా ఆధార్‌ను సులభంగా పొందడంతో పాటు ముందస్తు మీకు కావాల్సిన సయయానికి అపాయింటుమెంటుతో త్వరగా అప్ డేట్ చేసుకోవచ్చు.

సౌకర్యవంత సదుపాయాలతో....

సౌకర్యవంత సదుపాయాలతో....

ఈ ఆధార్ సేవా కేంద్రాలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని UIDAI సీఈవో డాక్టర్ అజయ్ భూషణ్ పాండే అన్నారు. 16/8 ఎన్‌రోల్‌మెంట్ కౌంటర్లు, 80/40 వెయిటింగ్ సీట్లు, ఎలక్ట్రానికి టోకెన్స్, ఎయిర్ కండిషన్డ్ వాతావరణం వంటి పలు సౌకర్యాలు ఉంటాయని తెలిపారు.

UIDAI ఇప్పటికే ఎంపిక చేసిన బ్యాంకులు, పోస్టాఫీసులు, బీఎస్ఎన్ఎల్ కస్టమర్ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి చోట్ల ఆధార్ కేంద్రాలను నిర్వహిస్తోంది. వాటికి ఈ సేవా కేంద్రాలు అదనం.

English summary

గుడ్‌న్యూస్: ఆధార్ అప్‌డేట్ కోసం ఆన్‌లైన్‌లో అపాయింటుమెంట్ | How to book online appointment to get, update Aadhaar at Aadhar Seva Kendra

Updating address and mobile number in your Aadhaar card records is now easier as the Unique Identification Authority of India (UIDAI) has opened a new Aadhaar centre in Chennai.
Story first published: Friday, September 6, 2019, 14:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X