For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2019లో అత్యధిక పారితోషికం తీసుకున్న టాప్ 10 క్రికెటర్లు వీరే

|

అంతర్జాతీయస్థాయిలో అత్యంత ఆదరణ కలిగిన క్రీడల్లో క్రికెట్ కూడా ముందుంటుంది. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్.. ఇలా పలు దేశాల్లో క్రికెట్ అంటే ఎంతో అభిమానం చూపిస్తారు. మన దేశంలో అయితే క్రికెట్‍‌ను ఓ మతంగా అభివర్ణిస్తారు. కాలం మారుతోంది. దానికి తగినట్లే మనిషిలోను మార్పులు వస్తున్నాయి. ప్రస్తుత తరం టెస్ట్ క్రికెట్ వంటి వాటి పైన ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. అందుకే మొన్న టెస్ట్‌లు, నిన్న వన్డేలు, నేడు ట్వంటీ 20లు బాగా ఆదరణ పొందుతున్నాయి. అత్యధిక పారితోషికం తీసుకునే క్రీడాకారులు ఉన్న గేమ్‌లలో క్రికెట్ ఒకటి. అంతర్జాతీయ, ఐపీఎల్ వంటి జాతీయ, లీగ్ టోర్నమెంట్లలో క్రికెటర్లకు బాగా డిమాండ్ ఉంది. ధోనీ, కోహ్లీ వంటి క్రికెటర్లు ఎండార్స్ చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రికెట్లో చురుగ్గా ఉన్న వాళ్లలో 2019లో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకున్న టాప్ 10 ఆటగాళ్లు...

పెట్రోల్, డీజిల్ వాహనాలపై నితిన్ గడ్కరీ శుభవార్తపెట్రోల్, డీజిల్ వాహనాలపై నితిన్ గడ్కరీ శుభవార్త

యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్

2019లో భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ సంపాదన 3.5 మిలియన్ డాలర్లు లేదా రూ.23.75 కోట్లు.

జట్లు: భారత్, ముంబై ఇండియన్స్

భారత క్రికెట్లో యువరాజ్ సింగ్ పాత్ర ఎంతో కీలకం. 37 ఏళ్ళ యువీ సేవలు వేనోళ్ల పొగడదగ్గవి. 2007లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ 6X6 స్కోర్ ఎవరూ మరిచిపోలేనిది. 2011 వరల్డ్ కప్, 2007 టీ20 వరల్ట్ కప్ విజయాల్లోను ఎంతో పాత్ర ఉంది. క్యాన్సర్ నుంచి బయటపడిన తర్వాత రీ-ఎంట్రీలోను ఆఖట్టుకున్నాడు. ఇటీవలే జూన్ 9వ తేదీన యువీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అత్యధికంగా సంపాదిస్తున్న వారి జాబితాలో యువీ 10వ స్థానంలో ఉన్నాడు.

మైఖేల్ క్లార్క్

మైఖేల్ క్లార్క్

2019లో ఆస్ట్రేలియా క్రికెటర్ మైఖేల్ క్లార్క్ సంపాదన 3.9 మిలియన్ డాలర్లు లేదా రూ.26.46 కోట్లు.

జట్లు: ఆస్ట్రేలియా, సిడ్నీ థండర్

మైఖేల్ క్లార్క్ ఆల్ టైమ్ మోస్ట్ సక్సెస్‌‍ఫుల్ క్రికెట్ కెప్టెన్. 2015 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా పరం కావడంలో ఇతని పాత్ర ఎంతో ఉంది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినప్పటికీ డొమెస్టిక్ టీమ్స్ తరఫున ఆడాడు. పునే వారియర్స్, సిడ్నీ థండర్స్ తరఫున ఆడాడు. క్రికెట్‌కు గుడ్ బై చెప్పాక కామెంటేటర్, అనలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. వివిధ స్పాన్సర్‍‌షిప్స్ ద్వారా అతను 2019లో 3.9 మిలియన్ డాలర్లు సంపాదించాడు. వివిధ స్పోర్ట్స్ ఛానల్స్‌ ద్వారా కూడా బాగానే సంపాదించాడు. అత్యధిక క్రికెట్ సంపాదనపరుల్లో క్లార్క్ 9వ స్థానంలో ఉన్నాడు.

గౌతమ్ గంభీర్

గౌతమ్ గంభీర్

2019లో భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంపాదన 4.79 మిలియన్ డాలర్లు లేదా రూ.32.50 కోట్లు.

జట్లు: భారత్, ఢిల్లీ కేపిటల్స్

37 ఏళ్ల గౌతమ్ గంభీర్ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆంధ్రా జట్టుతో జరిగిన మ్యాచ్ అనంతరం ఇతను క్రికెట్ అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. డిసెంబర్ 3, 2018లో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా తానేమిటో తన సామర్థ్యాన్ని మరెంతో చాటాడు.

ఢిల్లీ కేపిటల్స్ 2018లో అతనికి 0.41 మిలియన్ డాలర్లు మాత్రమే ఇచ్చింది. కానీ 2019లో అతను 4.79 మిలియన్ డాలర్లు సంపాదించాడు. ఎక్కువగా ఎండార్స్‌మెంట్ డీల్స్ ద్వారా వచ్చాయి. ఇతని భార్య నటాషా జైన్ కూడా బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది.

షేన్ వాట్సన్

షేన్ వాట్సన్

2019లో ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ సంపాదన 5.5 మిలియన్ డాలర్లు లేదా రూ.37.32 కోట్లు.

జట్లు: ఆస్ట్రేలియా, చెన్నై సూపర్ కింగ్స్, క్వెట్టా గ్లాడియేటర్స్

ఆస్ట్రేలియా బెస్ట్ ఆల్ రౌండర్. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన వాట్సన్ ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. అత్యధిక క్రికెట్ సంపాదనపరుల్లో 7వ స్థానంలో ఉన్నాడు. ఎండార్స్ ద్వారా బాగానే సంపాదిస్తున్నాడు. ఐపీఎల్లో చెన్నై తరఫున గత ఏడాది 0.59 మిలియన్ డాలర్లు అందుకున్నాడు. పీఎస్ఎల్ క్వెడ్డా గ్లాడియేటర్స్ నుంచి 0.15 మిలియన్ డాలర్లు, బిగ్ బాష్ క్లబ్ సిడ్నీ థండర్స్ నుంచి 0.5 మిలియన్ డాలర్లు అందుకున్నాడు. 4.26 మిలియన్ డాలర్లు ఎండోర్స్ ద్వారా వచ్చాయి.

షాహిద్ అఫ్రీది

షాహిద్ అఫ్రీది

2019లో పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రీది సంపాదన 5.8 మిలియన్ డాలర్లు లేదా రూ.39.32 కోట్లు.

జట్లు: పాకిస్తాన్, ధాకా డైనమైట్స్

అత్యధిక క్రికెట్ సంపాదనపరుల్లో అఫ్రీది 5వ స్థానంలో ఉన్నాడు. కొద్ది నెలల క్రితం అతను అంతర్జాకీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం పీఎస్ఎల్‌లో కరాచీ కింగ్స్ తరఫున, బీపీఎల్‌లో ఢాకా డైనమేట్స్ తరఫున ఆడుతున్నాడు. ఎండోర్స్ ద్వారా 5.42 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. అతను ఆరో హైయ్యెస్ట్ పెయిడ్ క్రికెటర్.

వీరేంద్ర సెహ్వాగ్

వీరేంద్ర సెహ్వాగ్

2019లో భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంపాదన 6.1 మిలియన్ డాలర్లు లేదా రూ.41.39 కోట్లు.

జట్లు: భారత్, డైమండ్స్ XI

క్రికెట్‌లోని బెస్ట్ హార్డ్ హిట్టర్‌లలో సెహ్వాగ్ ఒకరు. అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్లలో ఐదో స్థానంలో ఉన్నాడు. ట్విట్టర్‌లో చురుగ్గా ఉంటాడు. ప్రస్తుతం గెస్ట్ కామెంటేటర్‌గా కూడా ఉన్నాడు. కింగ్స్ XI పంజాబ్ కోచ్‌గా రూ.1 కోటి వరకు తీసుకున్నాడు. ఎక్కువగా ఎండోర్స్ ద్వారా వస్తాయి. ఆదిదాస్, జేకే సిమెంట్, బూస్ట్, హీరో, రాయల్ ఛాలెంజ్ వంటి వాటికి ఎండోర్స్ చేస్తున్నాడు. 2011 నుంచి సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహిస్తున్నాడు.

ఏబీ డివిల్లీయర్స్

ఏబీ డివిల్లీయర్స్

2019లో సౌతాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిల్లీయర్స్ సంపాదన 6.4 మిలియన్ డాలర్లు లేదా రూ.43.43 కోట్లు.

జట్లు: సౌతాఫ్రికా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

సౌతాఫ్రికా నుంచి వచ్చిన అత్యంత టాలెంటెడ్ క్రికెటర్లలో ఒకరు ఏబీ. అత్యధికంగా సంపాదించే జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు. గత ఏడాది హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కాంట్రాక్ట్ కింద 1.6 మిలియన్ డాలర్ల ఒప్పందం ఉంది. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుతో కాంట్రాక్ట్ ద్వారా 0.8 మిలియన్ డాలర్ల రాబడి వచ్చింది. 4 మిలియన్ డాలర్లు ఎండోర్స్ ద్వారా సంపాదించాడు. ఎంఆర్ఎఫ్, ప్యూమా వంటి వాటికి ఎండోర్స్ చేస్తున్నాడు.

క్రిస్ గేల్

క్రిస్ గేల్

2019లో వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గెల్ సంపాదన 7.5 మిలియన్ డాలర్లు లేదా రూ.50.89 కోట్లు.

జట్లు: వెస్టిండీస్, ముల్తాన్ సుల్తాన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్

ట్వంటీ 20 ఆల్ టైమ్ బెస్ట్ బ్యాట్సుమెన్ క్రిస్ గేల్. అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్లలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. వివిధ డొమెస్టిక్ లీగ్స్‌కు ఆడుతూ టీ 20లో 10,000 పరుగులు చేసిన ఒకే ఒక్క ప్లేయర్ గేల్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గేల్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. పీఎస్ఎల్‌లోని ముల్తాన్ సుల్తాన్స్‌కు ఆడటం ద్వారా కూడా పెద్ద మొత్తంలోనే సంపాదించాడు. ఇతర టీంలకూ ఆడుతూ సంపాదిస్తున్నాడు. అందరిలాగే ఎండోర్స్ ద్వారా ఎక్కువ వస్తున్నాయి.

ఎంఎస్ ధోనీ

ఎంఎస్ ధోనీ

2019లో భారత క్రికెటర్ ఎంఎస్ ధోనీ సంపాదన 21.7 మిలియన్ డాలర్లు లేదా రూ.147.26 కోట్లు.

జట్లు: భారత్, చెన్నై సూపర్ కింగ్స్

అత్యధికంగా సంపాదించే టాప్ 10 క్రికెటర్లలోనూ.. మొదటి రెండు స్థానాలు ఆక్రమించే వారి సంపాదనకు, మిగతా ఎనిమిది మందికి చాలా తేడా ఉంది. రెండో స్థానంలో ఉన్న ధోనీ మూడో స్థానంలోని క్రిస్ గేల్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నాడు. ఫోర్బ్స్ 25 ర్యాంకుల లోపు నిలిచిన ఉన్న ఒకే ఒక్క క్రికెటర్ ధోనీ. ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత బ్రాండ్ వ్యాల్యా కాస్త తగ్గింది.

బీసీసీఐ యాన్యువల్ కాంట్రాక్ట్ కింద ఏ కేటగిరీలోకి తీసుకుంది. దీని ద్వారా రూ.5 కోట్లు వస్తాయి. చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా 15 కోట్ల సంపాదన. ధోనీ బెస్ట్ ఫినిషర్, కూల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎండోర్స్ ద్వారా సంపాదన ఎక్కువగానే ఉంది. పెప్సికో, రీబాక్, ఎక్సైడ్, టీవీఎస్, జీఈ మనీ, దాబూర్, లావా, డ్రీమ్ 11‌కు ఎండోర్స్ చేస్తున్నాడు.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

2019లో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ సంపాదన 24 మిలియన్ డాలర్లు లేదా రూ.162.87 కోట్లు.

జట్లు: ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

విరాట్ కోహ్లీ ఇండియన్ కెప్టెన్. ఈ సంవత్సరం హయ్యెస్ట్ పేయిడ్ అథ్లెట్స్ ఫోర్బ్స్ లిస్ట్‌లోకి చేరాడు. అత్యధికంగా సంపాదించే వారి జాబితాలో ధోనీ కంటే కాస్త ముందున్నాడు. ట్విట్టర్‌లో 25 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నాడు.

సంపాదన... బీసీసీఐ ఏ కేటగిరీ కాంట్రాక్టు ద్వారా 1 మిలియన్ డాలర్లు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ నుంచి 2.6 మిలియన్ డాలర్లు.

ఎండోర్స్ ద్వారా కూడా ఎక్కువే సంపాదిస్తున్నాడు.

పెప్సికో, ప్యూమా, ఆడి, టిస్సాట్, ఉబెర్, కోల్గేట్-పామోలివ్, న్యూ ఎరా వంటి వాటికి ఎండోర్స్ చేస్తున్నాడు.

English summary

2019లో అత్యధిక పారితోషికం తీసుకున్న టాప్ 10 క్రికెటర్లు వీరే | Top 10 Highest Paid Cricketers in the World for 2019

The cricketers have enormous opportunities to earn well from the international and league tournaments, as well as from their sponsors. Let’s take a look at the top 10 highest paid cricketers of 2019!
Story first published: Thursday, September 5, 2019, 17:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X