For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈసారి ఫ్లిప్ కార్ట్ లక్ష్యం ఏమిటో తెలుసా?

|

పండగల సీజన్ వచ్చేస్తోంది. దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి... వంటి పండగల సందర్భంగా కస్టమర్లు అనేక రకాల కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. తాము కొనుగోలు చేయాల్సిన ఉత్పత్తుల కోసం పలు రకాల ఈ-కామర్స్ వెబ్ సైట్లను వెతుకుతుంటారు. ఎక్కడ ఆఫర్లు ఉంటే అందులో కొనుగోలు చేస్తారు. వీరిని లక్ష్యంగా చేసుకునే ఈ - కామర్స్ కంపెనీలు బంపర్ ఆఫర్లు ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాయి.

ఫ్లిప్ కార్ట్

ఫ్లిప్ కార్ట్

* వాల్ మార్ట్ కు చెందిన ఫ్లిప్ కార్ట్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2019-20)లో రూ. లక్ష్య కోట్ల స్థూల మార్చంటైజ్ విలువను సాధించాలన్న లక్ష్యం తో ఉంది.

* 2018-19 సంవత్సరం తో పోల్చితే ఈ మొత్తం 45 శాతం ఎక్కువ

* త్వరలో నిర్వహించనున్న బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా అమ్మకాలను ఈ కంపెనీ రెండింతలు పెంచుకోవాలని అనుకుంటోందట. బిగ్ బిలియన్ డేస్ పేరుతో ప్రతి సంవత్సరం కంపెనీ అమ్మకాలు చేపడుతోంది. ఈ సందర్భంగా భారీ స్థాయిలో డిస్కౌంట్స్ ఇస్తోంది.

* గత ఏడాది ఐదు రోజుల పాటు జరిగిన అమ్మకాల సందర్భంగా ఈ- కామర్స్ కంపెనీలు నమోదు చేసుకున్న మొత్తం అమ్మకాల్లో ఫ్లిప్ కార్ట్ వాటా 60 శాతంగా ఉందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఫ్లిప్ కార్ట్ గ్రూప్ నకు చెందిన జబాంగ్ , మింత్రా వంటి ఈ- కామర్స్ ప్లాట్ ఫార్మ్స్ కూడా అమ్మకాలను బాగానే పెంచుకుంటున్నాయి.

పోరుకు ఇతర కంపెనీలు సిద్ధం...

పోరుకు ఇతర కంపెనీలు సిద్ధం...

* ఈ - కామర్స్ రంగంలో పోటీ పడే కంపెనీల సంఖ్య తగ్గిపోయింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, పేటీఎం, స్నాప్ డీల్ వంటి కంపెనీలే ఈ- రంగంలో నిలదొక్కుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాయి.

* భారీ డిస్కౌంట్లతో పాటు క్యాష్ బ్యాక్ లు, నెలవారీ ఈఎంఐ సదుపాయాలు కల్పిస్తున్నాయి.

* ఈ కంపెనీలు కొనుగోలు దారులతో పాటు అమ్మకందారులను కూడా పెంచుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా పండగల సీజన్లో నిర్వహించే అమ్మకాల్లో ఎక్కువ మంది అమ్మకం దారులు పాల్గొనేలా కంపెనీలు ద్రుష్టి సారిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

* ఫ్లిప్ కార్ట్ విషయానికి వస్తే ఫ్లిప్ కార్ట్ పే లేటర్, కార్డు లెస్ క్రెడిట్, డెబిట్ కార్డు ఈఎంఐ వంటి సదుపాయాలను కస్టమర్లకు అఫర్ చేస్తోంది.

ఉద్యోగాల కల్పనా

ఉద్యోగాల కల్పనా

* ఈ-కామర్స్ కంపెనీలు పండగ సీజన్ లో ఉంటే అమ్మకాలను దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక ప్రాతిపదికన వేలాది మందిని నియమించుకునే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

* చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలను పెంచుకోవాలని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్డర్ చేసిన ఉత్పత్తులను నిర్దేశిత కాలంలో డెలివరీ చేయడానికి ఎక్కువ మంది అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండే వారికి ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఆ కస్టమర్లపై దిగ్గజ టెలీకాం కంపెనీ కన్నుఆ కస్టమర్లపై దిగ్గజ టెలీకాం కంపెనీ కన్ను

English summary

ఈసారి ఫ్లిప్ కార్ట్ లక్ష్యం ఏమిటో తెలుసా? | Flipkart Offers & Discount

E-Commerce companies Flipkart and Amazon will give more and more offers on this festival season.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X