For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అవే కావాంట... త్వరలో SBI కార్డ్ రూపే క్రెడిట్ కార్డ్

|

ముంబై: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు చెందిన ఎస్బీఐ కార్డు రూపే క్రెడిట్ కార్డును తీసుకురానుంది. ప్రస్తుతం మార్కెట్లో యూఎస్ పేమెంట్స్ గేట్‌వేలు వీసా, మాస్టర్ కార్డులదే హవా. ఈ నేపథ్యంలో ఎస్బీఐ రూపే క్రెడిట్ కార్డు దిశగా అడుగులు వేస్తోంది. రూపేను నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది. దీంతో రిటైల్‌గా చెల్లింపులు, ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తున్నారు.

వేతనం తక్కువుందా... ఐతే సూపర్ లోన్ ఆఫర్, తక్కువ వడ్డీ!వేతనం తక్కువుందా... ఐతే సూపర్ లోన్ ఆఫర్, తక్కువ వడ్డీ!

రూపే బేస్ట్ క్రెడిట్ కార్డులు..

రూపే బేస్ట్ క్రెడిట్ కార్డులు..

త్వరలో రూపే బేస్డ్ క్రెడిట్ కార్డ్స్ తీసుకు వస్తామని, ఈ అనుమతులకు సంబంధించి ఎన్పీసీఐ వద్ద చివరి దశలో ఉన్నాయని, ఓసారి ఎన్పీసీఐ నుంచి తుది అనుమతులు వస్తే క్రెడిట్ కార్డ్స్ ప్రారంభిస్తామని ఎస్బీఐ కార్డు ఎండీ, సీఈవో హర్దయాల్ ప్రసాద్ చెప్పారు. రూపే క్రెడిట్ కార్డును తీసుకు రావడం ద్వారా ఈ సెక్టార్‌లో హోమ్ గ్రోన్ పేమెంట్ నెట్ వర్క్‌కు సరికొత్త ఉత్సాహం తీసుకు రానుంది.

ఈ ఆర్థిక సంవత్సరంలోనే...

ఈ ఆర్థిక సంవత్సరంలోనే...

రూపే క్రెడిట్ కార్డును ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రూపే క్రెడిట్ కార్డు తేవడానికి ఇది మంచి సమయమని, ఇది బాగా ప్రాచుర్యం పొందిందని, ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారని, దీనికి ఆదరణ లభిస్తుందనే అంశంలో తనకు ఎలాంటి సందేహం లేదని ఆయన చెప్పారు.

మూడింట ఒక వంతు రూపే కార్డులు..

మూడింట ఒక వంతు రూపే కార్డులు..

ఎస్బీఐ దేశంలోని అతిపెద్ద బ్యాంకు. ఇది జారీ చేస్తున్న కార్డుల్లో ప్రస్తుతం రూపే కార్డులు మూడింట ఒక వంతు ఉన్నాయి. రూపే కార్డులు కోరుకునే కస్టమర్లు ఉన్నారని, మాకు రూపే కార్డులు మాత్రమే కావాలని అడిగేవారు ఉన్నారని, కాబట్టి సంతోషించదగ్గ పరిణామమే అన్నారు.

ఈ దేశాల్లో యాక్సెప్ట్ చేస్తున్నారు..

ఈ దేశాల్లో యాక్సెప్ట్ చేస్తున్నారు..

విదేశాలకు ప్రయాణించే తమ కస్టమర్లకు రూపే కార్డుతో పాటు వీసా/మాస్టర్ కార్డు ఈ రెండింటిని కూడా జారీ చేయవచ్చునని ఆయన చెప్పారు. ప్రస్తుతం సింగపూర్, భూటాన్ దేశాల్లో మాత్రమే రూపే కార్డులు యాక్సెప్ట్ చేస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే యూఏఈలో ఈ కార్డును విడుదల చేశారన్నారు. ఇంటర్నేషనల్ ప్లేయర్ డిస్కవర్, జపాన్ క్రెడిట్ బ్యూరో, చైనా యూనియన్ పే వంటి వాటితో రూపేకు అంగీకారం ఉంది.

వినియోగదారులకు చేరువయ్యేందుకు చాట్‌బాట్ ILA

వినియోగదారులకు చేరువయ్యేందుకు చాట్‌బాట్ ILA

వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ఎస్బీఐ కార్డు తన మొబైల్ యాప్‌లో చాట్‌బాట్ ILA (ఇంటరాక్టివ్ లైవ్ అసిస్టెంట్)ను విడుదల చేసినట్లు తెలిపారు. ILA 40 రకాల వినూత్న ఫీయర్స్ కలిగి ఉన్నట్లు తెలిపారు. ఎస్బీఐ చాట్‌బాట్ విడుదలైనప్పటి నుంచి 14 మిలియన్ల సమస్యలను పరిష్కరించామని, 97 శాతం అక్యూరసీ ఉందన్నారు. జూలై ముగిసే నాటికి ఎస్బీఐ కార్డు 90 లక్షలమంది కస్టమర్లను కలిగి ఉన్నట్లు చెప్పారు. మార్కెట్లో ఇది 17.9 శాతం. డిసెంబర్ 2019 నుంచి ప్రతి నెల 3 లక్షల కార్డ్స్ కొత్తగా యాడ్ అవుతున్నట్లు ఆయన తెలిపారు.

English summary

అవే కావాంట... త్వరలో SBI కార్డ్ రూపే క్రెడిట్ కార్డ్ | SBI Card to soon issue Rupay credit cards

SBI Card will soon launch RuPay credit cards, a development which will give a boost to the homegrown payment network in the fast growing segment. Presently, the credit card segment is dominated by the US-based payment gateways like Visa and Mastercard.
Story first published: Sunday, September 1, 2019, 17:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X