న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వివిధ బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటన చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే బ్యాంకుల విలీన ప్రక్రియ వేగవంతం చేసినట్లు చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకును విలీనం చేసి దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఏర్పడనున్నట్లు తెలిపారు.
కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌ను కలిపి నాలుగో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకును కలిపి అయిదే అతిపెద్ద బ్యాంకుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇండియన్ బ్యాంకును అలహాబాద్ బ్యాంకులో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు తగ్గుతుంది.

కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు రూ.70,000 కోట్ల మూలధన వ్యయం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత విలీనం ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంకు (విలీనమైన బ్యాంకులతో కలిపి) రూ.16,000 కోట్లు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు (విలీనమైన బ్యాంకులతో కలిపి) రూ.11,700 కోట్లు, కెనరా బ్యాంకుకు (విలీనమైన బ్యాంకులతో కలిపి) రూ.6,500 కోట్లు, ఇండియన్ బ్యాంకుకు (విలీనమైన బ్యాంకులతో కలిపి) రానున్నాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications