For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోడీ ప్రభుత్వం FDI ఎఫెక్ట్, భారత్‌లో యాపిల్ సొంత ఆన్‌లైన్ స్టోర్

|

భారత్‌లో వివిధ ఆన్ లైన్‌స్టోర్స్ ద్వారా ఐఫోన్లు, మాక్ బుక్స్, ఐపోడ్స్ విక్రయిస్తున్న యాపిల్ త్వరలో సొంత ఆన్‌లైన్ స్టోర్ ద్వారా వీటిని అందుబాటులోకి తీసుకు రానుంది. భారత మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉంది. ఇప్పటికే వీటిని అమెజాన్, ప్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్ సైట్స్ ద్వారా విక్రయిస్తున్నారు. కొద్ది నెలల్లో సొంత స్టోర్ (ఆన్‌లైన్)ను తీసుకురానుంది. సింగిల్ బ్రాండ్ రిటైల్ వాణిజ్యంలో ప్రభుత్వం ఇటీవల FDI నిబంధనల్ని సరళతరం చేసింది. ఈ నేపథ్యంలో యాపిల్ భారత మార్కెట్లోకి (ఆన్ లైన్ స్టోర్) వచ్చేందుకు సిద్ధమైందట.

నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ లాక్-అన్‌లాక్ ఎలాగో తెలుసుకోండి?

3-5 నెలల్లో ఆన్ లైన్ స్టోర్

3-5 నెలల్లో ఆన్ లైన్ స్టోర్

యాపిల్ ఆన్‌లైన్ వెబ్ స్టోర్ రానున్న 3 నుంచి 5 నెలల్లో రావొచ్చునని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న FDI నిబంధనల మేరకు భారత్‌లో స్టోర్స్ ప్రారంభించాలంటే 30% స్థానిక సోర్సింగ్ తప్పనిసరి. అంటే 51% వరకు FDIలు ఉన్న సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ సంస్థ ఏటా 30% వస్తువుల్ని దేశీయంగా సేకరించాలి. దీంతో విదేశీ కంపెనీలు సొంత బ్రాండ్స్ తెరిచేందుకు ముందుకు రాలేదు. చాలా కంపెనీలు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ కంపెనీలు తమ పరికరాలు, విడి భాగాలను చైనాలో సిద్ధం చేస్తున్నాయి. 30 శాతం నిబంధన కారణంగా భారత్‌లో తయారు చేయడం ఖర్చు ఎక్కువ చేయాలి. అందుకే అవి స్టోర్స్ పెట్టలేదు.

కేబినెట్ పచ్చజెండా....

కేబినెట్ పచ్చజెండా....

ఇప్పుడు సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ సంస్థలకు వెసులుబాటు ఇవ్వడంతో యాపిల్ భారత్‌లో ఆన్‌లైన్ స్టోర్ తెరవనుంది. ఇక నుంచి అయిదేళ్లకు సగటున 30 శాతం సమీకరించినా సరిపోతుంది. సంప్రదాయ స్టోర్స్ ప్రారంభించకముందే ఆన్ లైన్ విక్రయాల్ని ప్రారంభించేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఇది యాపిల్‌కు మార్గం సుగమం చేసింది.

25 శాతం యాన్యువల్ సేల్స్

25 శాతం యాన్యువల్ సేల్స్

అమెరికాకు చెందిన ఈ సంస్థ రానున్న 12-18 నెలల్లో ఐకానిక్ బ్రిక్ అండ్ మోర్టార్ యాపిల్ స్టోర్‌ను సెటప్ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఐ ఫోన్లలో 35 నుంచి 40 శాతం వరకు ఆన్ లైన్ ద్వారానే సేల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ దీనిని వినియోగించుకోవాలని చూస్తోంది.

ఐపోడ్ ట్యాబ్స్, మాక్ బుక్ లాప్‌ట్యాప్స్ ఆన్ లైన్ ద్వారా బాగా సేల్ అవుతున్నాయని, భారత్‌లో 25 శాతం యాన్యువల్ సేల్స్ ఉంటున్నాయని చెబుతున్నారు.

నకిలీలకు చెక్

నకిలీలకు చెక్

కొన్ని ఆన్ లైన్ ప్లాట్ ఫామ్‌లలో దొరికే యాపిల్ ఉత్పత్తుల్లో నకిలీవి ఉంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు యాపిల్ స్వయంగా ఆన్ లైన్ స్టోర్ ఏర్పాటు చేస్తే కస్టమర్లకు సంతోషకరమే. కస్టమర్లు ఎలాంటి అనుమానాలు లేకుండా కొనుగోలు చేయవచ్చు. సొంత ఆన్ లైన్ బ్రాండ్ ద్వారా సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నారు.

యాపిల్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది...

యాపిల్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది...

యాపిల్ ప్రస్తుతం 25 దేశాలలో సొంత స్టోర్స్ నిర్వహిస్తోంది. ఆయా దేశాల్లో తన సొంత వెబ్ స్టోర్స్ కూడా నిర్వహిస్తోంది. భవిష్యత్తులో ఐఫోన్, ఐపోడ్స్, యాపిల్ మాక్ కంప్యూటర్స్ తదితర ఉత్పత్తుల్ని తమ సొంత ఆన్‌లైన్ స్టోర్ ద్వారా సేల్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. దీనిపై యాపిల్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పెట్టుబడులకు అవకాశం

పెట్టుబడులకు అవకాశం

సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించిన నేపథ్యంలో ఇది దేశంలో పెట్టుబడులను పెంచుతుందని, సింగిల్ బ్రాండ్ రిటైలర్లకు వ్యాపారం చేసే సౌలభ్యాన్ని పెంచుతుందని స్వీడిష్ రిటైలర్స్ ఐకియా మరియు హెచ్&ఎం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అడుగులు గ్లోబల్ కంపెనీల నుంచి పెట్టుబడులు వచ్చేందుకు ఉపయోగపడుతుందని H&M ఇండియా మేనేజర్ జాన్నీ ఈనోలా అన్నారు.

English summary

Apple to open its online store in India soon

Apple will start selling iPhones directly to Indian consumers first through its own online store as the government on Wednesday allowed foreign single brand companies to sell directly via webstores, irrespective of a brick-and-mortar store presence, two senior industry executives said.
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more