For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైతులకు శుభవార్త: పాత లోన్ తీర్చకపోయినా కొత్త రుణాలు!

|

కోల్‌కతా: రైతులకు మరింత సులభంగా రుణాలు మంజూరు చేసే విధంగా నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వరంగ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నాయి. గతంలో తీసుకున్న రుణాలు చెల్లించడానికి ముందే కొత్త రుణాలు ఇచ్చేలా మార్పులు చేయాలని కోరనున్నాయి. ఇది రైతులకు ఎంతో ఊరట కలిగించే అంశం. ఈ అంశానికి సంబంధించి బ్యాంకులు క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్నాయి. దీనిని సెప్టెంబర్‌లో ప్రభుత్వానికి అందించనున్నాయి. మొదటి వారంలో ప్రధాని మోడీతో భేటీ కానున్న సమయంలో ఈ అంశంపై చర్చించనున్నాయి.

<strong>బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయాలా: ఎలా చేయాలి, ఎంత ఛార్జ్?</strong>బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయాలా: ఎలా చేయాలి, ఎంత ఛార్జ్?

ముద్రా లోన్...

ముద్రా లోన్...

అలాగే, ముద్రా లోన్ రుణాలకు మరింత గ్యారెంటీలను కోరే అంశాన్ని కూడా ప్రధాని ముందు ఉంచనున్నారని తెలుస్తోంది. సైబర్ సెక్యూరిటీ కిందకు తీసుకు వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఈ అంశంపై చర్చించనున్నారని తెలుస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వం వాటా తగ్గడం ఆందోళన కలిగించే అంశమని, ఈ ప్రతిపాదనలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్లస్ అవుతాయని చెబుతున్నారు.

అలాంటి రైతులకు ప్రయోజనం

అలాంటి రైతులకు ప్రయోజనం

గతంలోని రుణాలు చెల్లించనప్పటికీ రైతులకు రుణాలు ఇవ్వాలనే ప్రతిపాదన ద్వారా... ప్రకృతి వైపరీత్యాల కారణంగా, పంట బాగా పండకపోవడం వల్ల ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ప్రయోజనకారి అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం గత బకాయిలు చెల్లించని రైతులకు తిరిగి రుణాలు పొందేందుకు అర్హత లేదు. వ్యవసాయ రుణ ఒత్తిడి డబుల్ డిజిట్‌కు చేరుకుంది. ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా లోన్ ఓ మార్గంగా భావిస్తున్నారు.

ఈ ప్రతిపాదనలకు ఉపయోగం

ఈ ప్రతిపాదనలకు ఉపయోగం

ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రజల్లోకి ఎంతగా వెళ్లాయనే అంశమే వాటి పనితీరును తెలియజేస్తుందని యనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈవో అశోక్ కుమార్‌ అన్నారు. ఈ సరికొత్త ప్రతిపాదనలు ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

English summary

రైతులకు శుభవార్త: పాత లోన్ తీర్చకపోయినా కొత్త రుణాలు! | Banks suggest easier loan rules for farmers

Public sector banks may ask the government to allow farmers to borrow afresh even before clearing previous loans.
Story first published: Sunday, August 25, 2019, 12:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X