For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంచలన నిర్ణయం దిశగా ట్రంప్.. లక్షలాది భారతీయుల ఆందోళన

|

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తీసుకునే నిర్ణయం ఏదైనా సంచలనంగా మారుతోంది. చైనాతో ట్రేడ్ వార్ కావొచ్చు, మెక్సికో నుంచి మైగ్రేషన్స్ లేకుండా వాల్, హెచ్1బీ వీసా, అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే నినాదం... ఏ నిర్ణయం తీసుకున్నా ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజాగా మరో సంచలనం దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అమెరికన్లకే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే దిశగా కఠిన నిర్ణయాలు అమలు చేసిన ట్రంప్ ఇప్పుడు మరో పావు కదుపుతున్నారు. జన్మతః పౌరసత్వం రద్దు చేసే యోచన చేస్తున్నారు.

<strong>జియో గిగాఫైబర్ ఎఫెక్ట్, ఎయిర్‌టెల్ V-ఫైబర్ భారీ ఆఫర్లు ఇవే..</strong>జియో గిగాఫైబర్ ఎఫెక్ట్, ఎయిర్‌టెల్ V-ఫైబర్ భారీ ఆఫర్లు ఇవే..

ట్రంప్ వ్యాఖ్యల కలకలం

ట్రంప్ వ్యాఖ్యల కలకలం

అమెరికాకు ఎంతోమంది సరిహద్దులు దాటి వస్తున్నారని, బిడ్డలకు జన్మనిస్తున్నారని, ఆ పిల్లలకు ఇక్కడ పౌరసత్వం వస్తోందని, జన్మతః పౌరసత్వం రద్దు చేసే అంశంపై యోచిస్తున్నామని ట్రంప్ చెప్పారు. దీనిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఇండియన్ ఆరిజిన్ ప్రెసిడెన్షియల్ కాండిడేట్, డెమోక్రటిక్ సెనేటర్ (కాలిఫోర్నియా) కమలా హారిస్ ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయన రాజ్యాంగాన్ని చదవాలని ఎద్దేవా చేశారు.

అమెరికాలో జన్మిస్తే పౌరసత్వం..

అమెరికాలో జన్మిస్తే పౌరసత్వం..

రాజ్యాంగం 14వ సవరణ.. అమెరికాలో జన్మించిన వారికి పౌరసత్వం లభిస్తుంది. ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. ఈ సవరణ ఆసరాగా చేసుకొని వలసదారులు అమెరికాకు అక్రమ మార్గంలో వచ్చి తమ పిల్లలకు వారసత్వాన్ని పొందుతున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకుంటే ఎక్కువ ప్రభావం పడే దేశాల్లో భారత్ ఉంటుంది.

భారతవాసుల్లో ఆందోళన

భారతవాసుల్లో ఆందోళన

గత ఒకటి రెండు దశాబ్దాలుగా అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల ట్రంప్ నిర్ణయాల కారణంగా కాస్త తగ్గినప్పటికీ.. 2010 తర్వాత ఎనిమిది లక్షల మందికి పైగా వెళ్లారు. ఇప్పటికే నిబంధనలు కఠినతరం చేయడంతో ఇందులో చాలాందికి గ్రీన్ కార్డు రాలేదు. ఇప్పుడు మరో బాంబు పేల్చారు. ఇది వారికి ఆందోళన కలిగించే అంశం.

14వ రాజ్యాంగ సవరణ దుర్వినియోగం కాకుండా...

14వ రాజ్యాంగ సవరణ దుర్వినియోగం కాకుండా...

జన్మతః పౌరసత్వ హక్కు ఆసరాతో అక్రమ వలసదారులు పెరిగిపోతున్నారని ట్రంప్ చెబుతున్నారు. అందుకే 14వ రాజ్యంగ సవరణ దుర్వినియోగం కాకుండా కొన్ని వివరణలతో ఉత్తర్వు ఇవ్వవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకప్పటి సుప్రీం కోర్టు తీర్పులో కూడా చట్ట ప్రకారం వలస వచ్చిన వారి పిల్లల గురించి ఉందనే వాదనను తీసుకు వస్తున్నారు. చట్టసభల్లోను ఈ అంశం చర్చకు వచ్చింది.

అక్రమ వలసదారుల పిల్లల నిర్బంధంపై...

అక్రమ వలసదారుల పిల్లల నిర్బంధంపై...

జన్మతః పౌరసత్వం అంశం అప్పుడప్పుడు చర్చకు వస్తోంది. ఇప్పుడు స్వయంగా ట్రంప్ దీనికి ప్రాధాన్యత ఇచ్చారు. అక్రమంగా వలస వచ్చిన వారి పిల్లలను ఎంతకాలం నిర్బంధంలో ఉంచాలన్న ఆంక్షలను కూడా అమెరికా ఎత్తివేయనుందట. 1997లో జరిగిన ఫ్లోర్స్ సెటిల్మెంట్ ఒప్పందం ప్రకారం ఇరవై రోజులకు మించి పిల్లల్ని నిర్బంధించరాదు.

English summary

సంచలన నిర్ణయం దిశగా ట్రంప్.. లక్షలాది భారతీయుల ఆందోళన | Trump again claims he can abolish birthright citizenship

President Donald Trump has threatened to end what he called the "ridiculous" US policy of birthright citizenship, which gives citizenship automatically to those born in America, as he sought ways to check illegal immigration.
Story first published: Friday, August 23, 2019, 12:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X