For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్థిక వ్యవస్థ, పాజిటివ్ ఆటిట్యూడ్‌పై ఆర్బీఐ గవర్నర్

|

ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం నాడు సెంటిమెంట్ మరియు మూడ్ యొక్క ప్రాధాన్యతను వెల్లడించారు. ఇవి తగినంత పాజిటివ్, ఆశావాదం కావన్నారు. మూడ్, సెంటిమెంట్ ఎవరికి సహకరించవన్నారు. సోమవారం FICCI ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పాజిటివ్ ఆటిట్యూట్ ఆర్థిక వ్యవస్థకు సరైన మాత్ర అని అభిప్రాయపడ్డారు.

తాను వార్తా పత్రికలు చదివినప్పుడు లేదా బిజినెస్ న్యూస్ ఛానల్స్ చూసినప్పుడు ప్రస్తుత మూడ్ ఆశాజనకంగా లేదా పాజిటివ్‌గా లేదనేవి చూస్తుంటానని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ సవాళ్ల ఎదుర్కొంటుందని ఒకరు గ్రహిస్తే, రంగాల వారీగా సమస్య ఉందని మరొకరు చెబుతారని, అంతర్జాతీయంగా మార్కెట్ ఒత్తిడి కలిగి ఉందని మరొకరు రియలైజ్ అవుతారని, ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒంటరిగా జీవించడం లేదు కదా అన్నారు. పరిస్థితులకు భిన్నంగా ఉంటామని తాను చెప్పలేనన్నారు.

 RBI governors pill for the economy: Positive attitude

ఈ సందర్భంగా ఆయన పాంగ్లోషియన్ అనే పదం ఉపయోగించారు. పరిస్థితులతో సంబంధం లేకుండా ఆశాజనకంగా ఉండేవారిని ఇలా సంబోధిస్తారు. ఎక్సెసివ్‌లీ ఆప్టిమిస్టిక్.

ఈ రోజు మన దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని, వాటికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆర్థిక రంగం, బిజినెస్ కమ్యూనిటీ, పాలసీ మేరక్స్, రెగ్యులటేర్స్ కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. మరింత దృఢవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు.

సెంటిమెంట్ చాలా ముఖ్యమైనదని తాను అనుకుంటున్నానని, మన ముందు ఉన్న అవకాశాలను చూడాలన్నారు. ఆర్థిక వ్యవస్థలో ఇంటా, బయట సవాళ్లు, ఇబ్బందులను తాము గుర్తించామన్నారు. కానీ అవకాశాలు ఏమున్నాయో చూసి వాటిని ఉపయోగించుకోవాలన్నారు. ఆర్బీఐ గవర్నర్ ఆర్థిక స్థిరత్వం ప్రాముఖ్యతను కూడా వివరించారు.

అదేవిధంగా ప్రధాన ఆర్థిక వ్యవస్థల మందగమనంపై అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి సంస్థలు అంచనా వేసిన దాని కంటే వృద్ధి రేటు బలహీనంగా ఉండటంపై మాట్లాడారు. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం వంటి ట్రేడ్ వార్, భౌగోళిక-రాజకీయ ఇబ్బందులు వంటి అంశాలు ట్రేడ్ టెన్షన్స్‌కు కారణమవుతున్నాయన్నారు.

English summary

ఆర్థిక వ్యవస్థ, పాజిటివ్ ఆటిట్యూడ్‌పై ఆర్బీఐ గవర్నర్ | RBI governor's pill for the economy: Positive attitude

Amid challenges facing the Indian economy, Reserve Bank of India (RBI) governor Shaktikanta Das on Monday stressed on the importance of ‘sentiment’ and ‘mood’, which he said were not sufficiently ‘positive’ and ‘optimistic’.
Story first published: Monday, August 19, 2019, 19:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X