For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉక్కు రంగం ఉక్కిరిబిక్కిరి... కారణాలు ఇవే..

|

మన దేశంలోని ఉక్కు రంగం ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అమ్మకాలు తగ్గిపోయి అవస్థలు పడుతోంది. ఆటోమొబైల్ రంగం నుంచి హౌసింగ్, ఇన్ఫ్రా స్ట్రక్చరు వరకు గిరాకీ తగ్గడం వల్ల ఉక్కు అమ్మకాలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా ఉక్కు ధరలు దిగివస్తున్నాయి. దీంతో పరిశ్రమపై భారంపడుతోంది.

<strong>కోల్ ఇండియాలో 88,585 ఉద్యోగాలు, అదో ఫేక్ నోటిఫికేషన్</strong>కోల్ ఇండియాలో 88,585 ఉద్యోగాలు, అదో ఫేక్ నోటిఫికేషన్

ఉక్కు ధరలు

ఉక్కు ధరలు

* ఆటో మొబైల్ , హౌసింగ్, మౌలిక రంగాల్లో మందగమనం మూలంగా గత జులైలో ఉక్కు ధరలు టన్నుకు దాదాపు రూ. 3,000 వరకు తగ్గిపోయింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కూడా ఉక్కు ధరలు పడిపోవడానికి కారణం అవుతున్నాయి.

* గత ఆర్థిక సంవత్సరం (2018-19) లో అంతర్జాతీయ మార్కెట్లో హాట్ రోల్డ్, కోల్డ్ రోల్డ్ ఉక్కు ధరలు అంతకు ముందు సంవత్సరం తో పోల్చితే వరుసగా 11.5 శాతం, 11.9 శాతం మేర తగ్గిపోతాయి.

* ప్రస్తుతం దేశీయ మార్కెట్లో టన్ను ఉక్కు ధరలు రూ.40,000 కన్నా తక్కువగా ఉన్నాయి. 2017 డిసెంబర్ తర్వాత ఈ స్థాయిలో ఉక్కు ధరలు తగ్గలేదు. డిమాండ్ లేక పోవడం వల్ల నిల్వలు పేరుకు పోతున్నాయి. ఫలితంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

* వాహనాల అమ్మకాలు తగ్గిపోవడం వల్ల ఆటో మొబైల్ కంపెనీలు ఉత్పత్తిని తగ్గించి వేస్తున్నాయి. దీంతో ఆటో మొబైల్ రంగం నుంచి ఉక్కుకు గిరాకి తగ్గిపోయింది.

* మౌలిక రంగంలో పెట్టుబడులు తగ్గిపోయాయి.

దిగుమతులు పెరిగాయి...

దిగుమతులు పెరిగాయి...

* దేశీయ ఉక్కు రంగంలో సంక్షోభానికి మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఉక్కు దిగుమతులపై అమెరికా, యూరోప్, కెనడా వంటి దేశాలు సుంకాలను పెంచాయి. ఫలితంగా ప్రపంచ మార్కెట్లో ఉక్కు ఎగుమతులు తగ్గాయి. దాని ప్రరభావమే ఉక్కు ధరలపై పడింది. కొన్ని దేశాలు తమ ఉక్కు ను భారత్ మార్కెట్కు మళ్లించాయి. దీనితో మన దేశంలో సరఫరా పెరిగిపోయింది.

* గత ఆర్థిక సంవత్సరంలో మన దేశ ఎగుమతులు అంతకు ముందు ఏడాదితో పోల్చితే 30 శాతం మేరకు తగ్గాయి. దేశ ఎగుమతుల్లో ఉక్కు రంగం వాటా 3 శాతం వరకు ఉంటుంది. అయితే ఎగుమతులు తగ్గడం వల్ల దేశీయ మార్కెట్లో నిల్వలు పెరిగిపోయి ధరలు తగ్గడానికి దారితీసింది.

ఈ ఏడాది కష్టమే..

ఈ ఏడాది కష్టమే..

* అటు ఉక్కు డిమాండ్ తగ్గడం, ఇటు ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల పరిశ్రమకు మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

* ప్రభుత్వం అందుబాటు ధరల్లో గృహాల నిర్మాణాన్ని ప్రోత్సహించడం, ఇన్ఫ్రా ప్రాజెక్టులను చేపట్టడం వల్ల డిమాండ్ కాస్త పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉండక పోవచ్చని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ భావిస్తోంది.

* ఎస్సార్ స్టీల్ ను కొనుగోలు చేయడానికి ఆర్సెలర్ మిట్టల్ భారీ మొత్తం చెల్లించింది. అయితే ఇప్పుడు ఉక్కు ధరలు తగ్గు తున్న నేపథ్యంలో ఈ కంపెనీ పునరుజ్జీవం చాలా సవాలుగా మారవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

* ఉక్కును వినియోగించుకునే రంగాలు కోలుకుంటేనే ఉక్కు రంగానికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని లేకపోతే కష్టాలు తప్పవని అంటున్నారు.

English summary

ఉక్కు రంగం ఉక్కిరిబిక్కిరి... కారణాలు ఇవే.. | India may remain net importer of steel for second consecutive year

India is likely to close FY20 as a net importer of steel if trends during the first four months of the fiscal year are anything to go by.
Story first published: Monday, August 19, 2019, 18:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X