For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిపాజిట్ రేట్లు తగ్గుతున్నాయి... ఇప్పుడేం చేయాలి మరి!

|

భారత ఆర్ధిక వ్యవస్థలో వృద్ధి రేటు ను పెంచడానికి భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వరుసగా నాలుగు సార్లు రేపో రేటును తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకులు తామిచ్చే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. అదేవిధంగా బ్యాంకులు తమవద్ద కస్టమర్లు డిపాజిట్ చేసే మొత్తాలపై కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. రుణాలపై వడ్డీ రేట్లు తగ్గితే రుణం తీసుకున్న వారికీ ఊరట లభిస్తుంది. కానీ డిపాజిట్లపై వడ్డీ రేటు తగ్గితే డిపాజిట్ దారులకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. రిస్క్ లేకుండా తమ పెట్టుబడులకు రక్షణ ఉంటూ హామీ పూర్వకంగా రాబడులను ఇచ్చేవి బ్యాంకు డిపాజిట్లు. అయితే వీటిపై వడ్డీ రేటు తగ్గిన సమయంలో ఆదాయం తగ్గుతుంది. సాధారణంగా సీనియర్ సిటిజన్లు డిఫాజిట్ రేట్లు తగ్గడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఫలితంగా వారి ఖర్చులకు కష్టం అవుతుంది.

* ఇటీవలి కాలంలో చాలా బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. ఈ వడ్డీ రేట్ల తగ్గింపు 0.3-0.5 శాతం వరకు ఉంది. కొన్ని డిపాజిట్లపై తగ్గిన వడ్డీ రేటు 0. 75 శాతం కూడా ఉంది.
* స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన డిపాజిట్ రేట్లను ఆర్బీఐ రేపో రేటుతో అనుసంధానం చేసింది. ఇదే బాటలో మరిన్ని బ్యాంకులు నడుస్తున్నాయి. దీని వల్ల రానున్న కాలంలో వడ్డీ రేట్లు మరింతగా తగ్గ వచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

<strong>జమ్ము కాశ్మీర్‌లో ఆస్తులు కొనాలనుకుంటే ఇది చదవండి?</strong>జమ్ము కాశ్మీర్‌లో ఆస్తులు కొనాలనుకుంటే ఇది చదవండి?

వడ్డీ రేట్లు తగ్గుతున్న తరుణంలో ఏం చేయాలంటే?

వడ్డీ రేట్లు తగ్గుతున్న తరుణంలో ఏం చేయాలంటే?

* డబ్బు అవసరాలకు మించి ఉన్న వారు మిగతా సొమ్మును బ్యాంకు ఖాతాల్లో పెట్టుకోవడం వల్ల ఏమంత ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉండదు.

* సేవింగ్స్ ఖాతాలో సొమ్ముపై 3.5 శాతమే వడ్డీ వస్తుంది.

* బ్యాంకులు తమ వడ్డీ రేట్లను రేపో రేటుతో అనుసంధానం చేయడం వల్ల ఈ వడ్డీ రేట్లు మరింతగా తగ్గడానికి అవకాశం ఉంటుంది.

* ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచేదాకా వేచి చూడాలంటే కష్టమే కాబట్టి ఏడాది లోపు కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం మంచిది. ఇలాంటి వాటిపై వడ్డీ రేటు 6.5-7 శాతం వరకు లభిస్తుంది. స్వల్పకాలానికి డిపాజిట్ చేయడం వల్ల వడ్డీ రేట్ల అనిచ్చితి ఎదుర్కోవచ్చు.

అధిక వడ్డీ రేట్ల కోసం అన్వేషణ

అధిక వడ్డీ రేట్ల కోసం అన్వేషణ

* కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లు ఇస్తుంటే మరి కొన్ని బ్యాంకులు మాత్రం కాస్త ఎక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేస్తుంటాయి. మీరు డిపాజిట్ చేసే ముందు ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేటు ఇస్తుందో ఒక్కసారి ఆన్ లైన్ ద్వారా వెతకండి.

* ప్రభుత్వ రంగంలోని బ్యాంకులకన్నా ప్రయివేట్ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కవుగా వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి.

* ఇప్పటికి ఒక బ్యాంకులో డిపాజిట్ చేసి ఉంటె ఎక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకుకు మారిపోవచ్చు.

చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు

చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు

* చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నాయి. ఇవి తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కాస్త ఎక్కవగా వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంటాయి.

* ఉదాహరణకు ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 21 నెలల నుంచి 24 నెలల డిపాజిట్లపై 8.75 శాతం వడ్డీని అఫర్ చేస్తోంది.

* రెండేళ్ల డిపాజిట్లపై జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 8.6 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. అయితే ఇలాంటి బ్యాంకులు మీరున్న చోట కార్యకలాపాలు సాగిస్తున్నాయి లేదో చూసుకోండి.

* పే మెంట్స్ బ్యాంకులు కూడా మంచి వడ్డీ రేట్లు ఇస్తున్నాయి. పేటీఎంఫిక్స్డ్ డిపాజిట్లపై 7.5 శాతం వరకు వడ్డీ రేటును చెల్లిస్తోంది.

* డిపాజిట్ రేట్లు తగ్గుతున్నందు వల్ల ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ ఇస్తే ఆ బ్యాంకుకు మారిపోవడం మంచిదే. లేదా ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఇతర ఆర్ధిక సాధనాల్లో పెట్టుబడి పెట్టడం మేలు.

English summary

డిపాజిట్ రేట్లు తగ్గుతున్నాయి... ఇప్పుడేం చేయాలి మరి! | Deposit rate cut: What will you do now?

Following the rate cuts, deposits between 7 days to 45 days will give a return of 5 per cent, from 5.75 per cent earlier.
Story first published: Sunday, August 18, 2019, 9:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X