For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆటోమొబైల్ రంగంపై మందగమన ప్రభావం .. ఉద్యోగులకు ఉద్వాసన పలికే దిశగా అశోక్ లేలాండ్

|

ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా భారతీయ ఆటోమొబైల్ రంగం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఊహించని విధంగా ఆటోమొబైల్ రంగం ఇప్పుడు చతికిలపడింది. ఈ ఏడాది జాతీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్రంగా నష్టపోయాయి. 2017 డిసెంబరులో కొత్త రికార్డులు నమోదైన తర్వాత కంపెనీల అంచనాలు భారీగా తప్పాయి. ఊహించని విధంగా దాదాపు 30 శాతం నష్టాలను చవిచూశాయి. ఈ ఏడాది జాతీయ ఈక్విటీ మార్కెట్‌ ఇండెక్స్‌ల వద్ద అన్నీ రంగాలకంటే ఆటోమొబైల్‌ రంగం అత్యుల్ప ప్రదర్శనను కనపరిచిందంటేనే ఈ రంగం ఏ స్థాయిలో పతనం అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక తాజాగా నష్టాల నుండి బయటపడటానికి తాజాగా కాస్ట్ కటింగ్ చేసిన అశోక్ లేలాండ్ ఇప్పుడు వాలంటరీ రిటైర్ మెంట్ స్కీములను ప్రకటించింది.

 భారీ నష్టాలతో గత త్రైమాసిక ఫలితాలు ..అశోక్ లేలాండ్ కుదేలు

భారీ నష్టాలతో గత త్రైమాసిక ఫలితాలు ..అశోక్ లేలాండ్ కుదేలు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌ లో అశోక్ లేలాండ్ విషయానికి వస్తే.. జూలైలో దారుణ పరిస్థితి ఎదుర్కొన్నది. కంపెనీ వాహనాల అమ్మకాల్లో 52 వారాల్లో అత్యల్ప అమ్మకాలు నమోదు చేసిన నెలగా జూలైలో రికార్డు స్థాయిలో పతనాన్ని చూసింది. దీని ప్రభావం షేర్లపై బాగా పడింది. గత ఏడాది జూలై నెలలో 15,199 యూనిట్లు అమ్మగా.. ఈ సారి 10,927 యూనిట్లు మాత్రమే అమ్మింది. అంటే గత ఏడాది జులై నెలలో 28 శాతం ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది.

అశోక్ లేలాండ్ ఉద్యోగులకు ఉద్వాసన పలికే నిర్ణయం .. వీఆర్ఎస్ , ఉద్యోగుల విభజన స్కీమ్ లను ప్రకటించిన సంస్థ

అశోక్ లేలాండ్ ఉద్యోగులకు ఉద్వాసన పలికే నిర్ణయం .. వీఆర్ఎస్ , ఉద్యోగుల విభజన స్కీమ్ లను ప్రకటించిన సంస్థ

ఆటోమొబైల్ విభాగంలో మందగమనంతో నష్టాల బాట పట్టిన అశోక్ లేలాండ్ తమ ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని సూచించింది. వద్దనే వారు ఉద్యోగుల విభజన స్కీమ్ కు సంబంధించిన రెండు పథకాలను ఆఫర్ చేసింది. 30 లక్షల రూపాయలు 60 లక్షలతో అనుభవం ఆధారంగా ఉద్యోగుల విభజన పథకాన్ని అందిస్తుంది. వి ఆర్ ఎస్ ను ఎంచుకోవాలని ఉద్యోగులకు సూచించింది. లేనివారు ఈ రెండు స్కీం లలో ఏదో ఒకదానికి అనుభవం ఆధారంగా తీసుకోవాలని చెప్పింది. ఇక స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకో దలచినవారు, తీసుకోవటం ఇష్టం లేనివారు ఆగస్టు చివరి లోపు సంస్థకు తెలియజేయాలని ఉద్యోగులకు తెలియజేసింది. ప్రస్తుతం అశోక్ లేలాండ్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు, కాంపోనెంట్ మేకర్స్, మరియు డీలర్ల ఖర్చులు తగ్గించుకోవాలని, ఉద్యోగులను తగ్గించి మార్జిన్లు పెంచాలని భావిస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ కు సంబంధించి సంస్థ అందిస్తున్న పథకాలకు సంబంధించిన ప్రతిని ఉద్యోగులకు అందించింది.

ఇప్పటికే కాస్ట్ కటింగ్ .. జీత భత్యాలను తగ్గించేందుకు ఉద్యోగులకు వీఆర్ఎస్ ఆఫర్

ఇప్పటికే కాస్ట్ కటింగ్ .. జీత భత్యాలను తగ్గించేందుకు ఉద్యోగులకు వీఆర్ఎస్ ఆఫర్

ఉత్పత్తి వ్యయం పెరుగుతూ, అమ్మకాలు తగ్గుతున్న తరుణంలో, ఇన్పుట్ ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నిస్తున్న వాహన తయారీదారులలో ఒకరైన అశోక్ లేలాండ్ వరుస నష్టాలతో ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం అశోక్ లేలాండ్ ఎన్నోర్ ఫ్యాక్టరీ లోని ప్లాంట్ ఉద్యోగులు ఈ సంవత్సరం అధిక బోనస్ చెల్లింపులను కోరుతూ నిరసన తెలియజేశారు. శుక్రవారం ఉత్పత్తి పైన ఫ్యాక్టరీ లోని కార్మికులు చేసిన నిరసన ప్రభావం పడింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీ ఉద్యోగుల డిమాండ్ తో కూడా కుదేలవుతోంది. దీంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పంత్ నగర్ ప్లాంట్లో రెండుసార్లు కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అలాగే ప్లాంట్ పనిచేయని రోజుల్లో చెల్లింపులు చేసేది లేదని తేల్చి చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరం 500 కోట్ల మేర ఖర్చులు తగ్గించుకునే ఆలోచనలో ఉన్న సంస్థ ఉద్యోగులకు ఆ విషయాన్ని తేల్చి చెప్పింది. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకునేవారికి వీ ఆర్ ఎస్ స్కీమ్, వద్దనే వారికి ఉద్యోగుల విభజన స్కీమ్ లను ప్రకటించింది.

English summary

ఆటోమొబైల్ రంగంపై మందగమన ప్రభావం .. ఉద్యోగులకు ఉద్వాసన పలికే దిశగా అశోక్ లేలాండ్ | Slowdown impact on Ashok Leyland ..announced VRS, separation scheme for employees

slowdown in the automotive segment forcing Original Equipment manufacturers, component makers and dealers to slash costs, cut jobs to shore up margins. Ashok Leyland had floated two schemes to reduce the production cost. The packages are capped at Rs 30 lakh and Rs 60 lakh, possibly based on experience with the company; the Employee Separation Scheme being an alternative for those who do not opt for the VRS. Employees have been informed that they need to intimate the company before end of August to avail themselves of the scheme.
Story first published: Saturday, August 17, 2019, 11:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X