For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాగ్నిజెంట్‌లో వందల ఉద్యోగాల కోత, క్యాంపస్ హైరింగ్స్ డిలే

|

ప్రముఖ సాఫ్టువేర్ దిగ్గజం కాగ్నిజెంట్ మరోసారి కంపెనీలోని ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. వందలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోందని ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలో వార్తలు వచ్చాయి. కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా వందలాది మందిని తొలగించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఉద్యోగుల తొలగింపుతో పాటు ఖర్చులు తగ్గించుకునే ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తోందట.

ఇప్పటికే ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు కఠినమైన పనితీరు విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణ పనితీరు ఉండి ఏ ప్రాజెక్టులలో చేయని వారిని వేరు చేయనున్నారని తెలుస్తోంది. అలాగే, ఎనిమిది ఏళ్ల కంటే పైబడి కంపెనీలో చేస్తున్న వందలాది మంది ఉద్యోగులను తొలగించవచ్చునని తెలుస్తోంది.

Cognizant may lay off more, delays campus hires

కాగ్నిజెంట్ కొత్త సీఈవో బ్రయాన్ హంప్‌షైర్ ఆధ్వర్యంలో కాగ్నిజెంట్ వృద్ధిపై దృష్టి సారించడంతో పాటు ప్రాఫిట్ పెరిగేందుకు అనవసర ఖర్చులను తగ్గించే అంశంపై కూడా దృష్టి సారిస్తున్నారు. ఇది అప్రైజల్ ప్రక్రియలో భాగమని, ఇది కఠినతరం అవుతుందని, మార్జినల్ పర్ఫార్మర్ అయినా లేదా ఏ ప్రాజెక్టుకు అటాచ్ చేయకపోయినా విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఉద్యోగుల తొలగింపు వందల్లో ఉండవచ్చునని, ఎనిమిదేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి ఉన్న వారిని ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే కంపెనీ అనవసరమైన ప్రయాణాలను నిలిపేసిందని, అలాగే, ఖర్చుల తగ్గింపుపై మరిన్ని చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. క్యాంపస్ హైరింగ్స్ కూడా ప్రస్తుతానికి నిలిపివేయనున్నారని తెలుస్తోంది. కాగ్నిజెంట్ ప్రధానంగా క్యాంపస్ ఆఫర్లకు ఫేమస్. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని తెలుస్తోంది.

కాగ్నిజెంట్ తన ఆదాయవృద్ధి అంచనాను తగ్గించింది. జూన్ 30వ తేదీ నాటికి కంపెనీ హెడ్ కౌంట్ 288,200గా ఉంది. గత ఏడాది కంటే 7 శాతం పెరిగింది. గత ఏడాది 268,900గా ఉంది. 2018 చివరి నాటికి 281,600 ఉద్యోగులు ఉన్నారు. భారత్‌లో 69 శాతం మంది ఉద్యోగులు లేదా 194,700 ఉద్యోగులు ఉన్నారు.

English summary

కాగ్నిజెంట్‌లో వందల ఉద్యోగాల కోత, క్యాంపస్ హైరింగ్స్ డిలే | Cognizant may lay off more, delays campus hires

Cognizant is readying another round of layoffs, expected to number a few hundred, as part of its strategy to cut costs, and more ways of slashing spending are on the anvil.
Story first published: Saturday, August 17, 2019, 11:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X