For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దివీస్ మురళి వేతనం ఎంతో తెలుసా?

|

ప్రముఖ తెలుగు పారిశ్రామికవేత్త మురళి దివి మరో సారి వార్తల్లోకెక్కారు. ఈసారి ఆయన ఫార్మా రంగంలో దేశంలోనే అత్యధిక వేతనం తీసుకొంటున్న వ్యక్తిగా నిలిచారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే డివైస్ లాబొరేటరీస్ చైర్మన్ సీఎండీ మురళి కే దివి 2018-19 ఆర్థిక సంవత్సరంలో వేతనం, కమిషన్ రూపంలో రూ 58.8 కోట్ల ప్యాకేజీ పొందారు. దీంతో అయన భారత్ దేశంలోని ఫార్మా కంపెనీలన్నిటి లోకీ అధిక శాలరీ తీసుకొనే వ్యక్తికే రికార్డు సృష్టించారు. కేవలం శాలరీ లోనే కాదు ... వేతన వృద్ధిలోనూ అయన రికార్డు నమోదు చేసారు. కంపెనీ గతేడాది వార్షిక నివేదిక ప్రకారం ... మురళి దివి వేతనం ఏకంగా 46.3% పెరగటం విశేషం. పీటీఐ వార్త సంస్థ ఈ విషయాన్నీ వెల్లడించింది.

శాలరీ కంటే కమిషన్ అధికం...
కాగా ... దివీస్ సీఎండీ మురళి వేతనంలో అసలు శాలరీ కంటే కమిషన్ అధికంగా ఉండటం గమనార్హం. ఆయన పొందిన రూ 58.8 కోట్ల ప్యాకేజీ లో రూ 57.61 కోట్లు కావడం విశేషం. మురళి దివి 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ 40.20 కోట్ల వేతనం పొందారు. అందులో రూ 39 కోట్లు కమిషన్ గా లభించింది. కార్పొరేట్ కంపెనీలు ప్రమోటర్లు, డైరెక్టర్లు, సీఈఓ లకు నికర లాభం ఆధారంగా కమిషన్ అందిస్తుంటాయి. అసలు వేతనం కంటే, ఈ కమిషన్ సహజంగానే అధికంగా ఉంటుంది. కానీ... కంపెనీ లాభం పెరగక పోతే మాత్రం ఉన్నతాధికారులు కమిషన్ రూపంలో ఎక్కువ మొత్తం పొందలేరు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక ఫార్మా ఫ్యాక్టరిలీలను కలిగి ఉన్న దివీస్ లాబొరేటరీస్ అత్యధిక వేగంగా వృద్ధి చెందుతున్న ఫార్మా కంపెనీల్లో ఒకటి. అందుకే, కంపెనీ వృద్ధి పాటె... టాప్ మానేజ్మెంట్ భారీ పారితోషికాలు పొందుతోంది.

 At Rs 58.8 cr, Murali of Divis Lab highest paid Indian pharma

డైరెక్టర్ల పారితోషికం ఘనమే...

దివీస్ లాబొరేటరీస్ సీఎండీ మురళి మాత్రమే అధిక వేతనం పొందటం లేదు. ఈ కంపెనీలో ఇతర డైరెక్టర్ల ప్యాకేజీలు సైతం అధికంగా ఉన్నాయ్. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యెన్ వీ రమణ పారితోషికం రూ 30 కోట్లు అని కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించింది. అదే సమయంలో మురళి, డైరెక్టర్ ఐన కిరణ్ దివి రూ 20 కోట్ల భారీ పారితోషికాన్ని పొందారు.

ఉద్యోగుల వేతనాల పెంపు మాత్రం తక్కువే...

ఒకవైపు ప్రోమోటర్లకు అధిక వేతనాలు ఇస్తూ వార్తల్లో నిలిచిన దివీస్ లాబొరేటరీస్... సాధారణంగా ఉద్యోగులందరికీ పెంచే వేతన సగటు పెరుగుదల మాత్రం 3. 96% ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా... 2018-19 లో కంపెనీ రూ 5,036 కోట్ల ఆదాయంపై రూ రూ 1,333 నికర లాభాన్ని ఆర్జించింది. దేశంలో అతి పెద్ద ఫార్మా కంపెనీ ఐన సన్ ఫార్మా ఫౌండర్ దిలీప్ షాంగ్వి వేతనం రూ 1 మాత్రమే కాగా, ఇతరత్రా ఇన్సెంటివ్స్ రూ 2,62,800 పొందారు. రెండో అతిపెద్ద ఫార్మా కంపె ఐన ఆరోబిందో ఫార్మా ఎండీ యెన్ గోవిందరాజన్ రూ 14.6 కోట్ల వేతనం అందుకొన్నారు. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఎండీ జి వీ ప్రసాద్ రూ 12.4 కోట్ల పారితోషికాన్ని పొందారు.

English summary

దివీస్ మురళి వేతనం ఎంతో తెలుసా? | At Rs 58.8 cr, Murali of Divi's Lab highest paid Indian pharma

Chairman and Managing Director of city-based pharma company C Murali K Divi is the highest paid executive of the Indian pharma industry with Rs 58.8 crore remuneration which includes salary and commission in 2018-19.
Story first published: Tuesday, August 13, 2019, 18:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X