For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫాస్ట్ మూవీంగ్ కాదు.. స్లో మూవింగ్: నాలుగోసారీ అంతే

|

ఫాస్ట్ గ్రోయింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) వృద్ధి జూలై - సెప్టెంబర్ 2018 క్వార్టర్ నుంచి తగ్గిపోతోంది. వ్యాల్యూపరంగా, వ్యాల్యూంపరంగా కూడా క్షీణించింది. దీనికి కారణం పట్టణ వినియోగదారులు రోజువారీ ముఖ్యమైన బ్రాండ్స్‌కు మారితే, గ్రామీణ వృద్ధి మందగించింది. జూలై - సెప్టెంబర్ 2018 క్వార్టర్ నుంచి ఈ ఏడాది జూన్ క్వార్టర్‌కు వరకు వృద్ధి లేదా రెవెన్యూ 16.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గిందట. అలాగే వ్యాల్యూమ్ వృద్ధి లేదా అమ్ముడుపోయిన ప్యాక్స్ సంఖ్య 13.4 శాతం నుంచి ఏకంగా 6.2 శాతానికి పడిపోయింది.

<strong>ఈ అమ్మకాలు భారీగా తగ్గుతున్నాయి, గ్రామాల్లో రెండింతలు తగ్గుదల </strong>ఈ అమ్మకాలు భారీగా తగ్గుతున్నాయి, గ్రామాల్లో రెండింతలు తగ్గుదల

మందగమనానికి పలు కారణాలు

మందగమనానికి పలు కారణాలు

ప్రస్తుత మందగమనానికి పలు కారణాలు ఉన్నాయని బ్రిటనానియా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ అన్నారు. కేవలం గ్రామీణ ప్రాంతాల మార్కెట్లు మాత్రమే కాకుండా, సంపదను సృష్టించే అన్ని అంశాలు ప్రతికూలంగానే ఉన్నాయన్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయంగా పడిపోయిందని, ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా అలాగే ఉందని చెబుతున్నారు.

వృద్ధి రేటు తగ్గించాయి.

వృద్ధి రేటు తగ్గించాయి.

ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకులు వివిధ కారణాలను చూపుతూ భారతదేశ వృద్ధి రేటు అంచనాను తగ్గించాయని ఆర్థికవేత్తలు గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాది భారత వృద్ధి రేటు 7 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసిందని, అంతకుముందు ఇది 7.3 శాతంగా ఉందని చెబుతున్నారు. ఆర్థిక కొరత ఆందోళనల నేపథ్యంలో ఈ ఏడాది వృద్ధి రేటు అంచనాను ఏడీబీ 7 శాతానికి తగ్గించింది.

సంకేతాలు

సంకేతాలు

ఆర్థిక వ్యవస్థ మందగమన సంకేతాలు కనిపిస్తున్నాయని, ఇది అన్ని పరిశ్రమల్లోను కనిపిస్తోందని డాబుర్ చైర్మన్ అమిత్ బర్మానీ అన్నారు. వాస్తవానికి ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ వృద్ధి రెండేళ్ల కనిష్టానికి పడిపోయిందని, గ్రామీణ, అర్బన్ మార్కెట్లలో ఇది కనిపిస్తోందని చెప్పారు. దాదాపు రెండు సంవత్సరాలుగా కోర్ ద్రవ్యోల్భణం కనిష్ట స్థాయిలో ఉందని, ఇది వినియోగ డిమాండ్‌ను బలహీనపరిచిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ వేతనాల పెరుగుదల తక్కువగా ఉండటం, ఆలస్యమైన రుతుపవనాలు కూడా కారణమని చెబుతున్నారు. సమీప భవిష్యత్తులో బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary

ఫాస్ట్ మూవీంగ్ కాదు.. స్లో మూవింగ్: నాలుగోసారీ అంతే | Slow moving consumer goods, four quarters in a row

Growth in the fast-moving consumer goods (FMCG) sector has slumped in the past four quarters in a row since July-September 2018, both by value and volume, as consumers shifted to cheaper daily essential brands in the urban markets and rural growth slowed.
Story first published: Wednesday, August 7, 2019, 16:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X