For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ఈ క్యాష్ డిపాజిట్లపై ఛార్జీలు వద్దు, అన్ని బ్యాంకుల్లో ఉచితమే'

|

బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలో నెలలో ఎన్నిసార్లు డబ్బు జమ చేసినా ఎలాంటి నిబంధనలు విధించవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించింది. బేసింగ్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) అకౌంట్‌లో ఒక నెలలో చేసి డిపాజిట్స్ పైన అలాగే అమౌంట్ పైన ఎలాంటి పరిమితులు విధించవద్దని స్పష్టం చేసింది. BSBD అకౌంట్స్‌ను ప్రధానంగా పేదల కోసం ఉద్దేశించినదని, దీని ద్వారా కొన్ని సౌకర్యాలు ఉచితంగా అందించాలన్నారు.

డిపాజిట్స్‌పై ఎలాంటి ఛార్జీలు విధించవద్దు..

డిపాజిట్స్‌పై ఎలాంటి ఛార్జీలు విధించవద్దు..

ఈ అకౌంట్స్ సాధారణంగా పేదవర్గాలకు చెందినవి కావడంతో వారికి డబ్బును దాచుకునే వెసులుబాటు కల్పించాలని ఆర్బీఐ సూచించింది. బ్యాంకుల్లో లేదా ఏటీఎంల వద్ద డిపాజిట్స్ పైన ఎలాంటి ఛార్జీలు విధించకూడదని పేర్కొంది.

సాధారణ బ్యాంకు సేవలు మొత్తం అందాలి...

సాధారణ బ్యాంకు సేవలు మొత్తం అందాలి...

అలాగే, BSBD ఖాతాదారులకు నెలకు కనీసం నాలుగు విత్ డ్రాలకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది. అలాగే ఏటీఎం కార్డు, ఏటీఎం కమ్ డెబిట్ కార్డును ఎలాంటి ఛార్జీలు లేకుండా ఇవ్వాలని తెలిపింది. సాధారణ బ్యాంకు సేవలు మొత్తం BSBD ఖాతాలకు కూడా అందేటట్లు చూడాలని తెలిపింది.

 అన్ని బ్యాంకులకు BSBD తప్పనిసరి..

అన్ని బ్యాంకులకు BSBD తప్పనిసరి..

అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలనే లక్ష్యంతో అన్ని బ్యాంకులు కూడా BSBD ఆఫర్ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. దీనిని ప్రతి బ్యాంకుకు తప్పనిసరి చేసింది. మహావీర్, రెప్కో, అండమాన్ అండ్ నికోబర్ స్టేట్ కో ఆపరేటివ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్, కో ఆపరేటివ్, భరత్ కో ఆపరేటివ్, సారస్వత్, బాంబే మర్చండ్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, జనతా సహకారి... ఇలా పలు కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి.

English summary

'ఈ క్యాష్ డిపాజిట్లపై ఛార్జీలు వద్దు, అన్ని బ్యాంకుల్లో ఉచితమే' | Basic savings accounts in co op banks should be made free: RBI

The Reserve Bank of India (RBI) said on Friday that banks should not impose any limit on number and value of deposits that can be made in a month on the Basic Savings Bank Deposit (BSBD) account.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X