For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5,088 హోండా కార్లు రీకాల్, కస్టమర్లు ఇలా చెక్ చేసుకోవచ్చు!

|

జపాన్ దిగ్గజ కార్ల కంపెనీ హోండా భారత్‌లోని 5,088 కార్లను రీకాల్ చేసింది. పాత జనరేషన్‌కు చెందిన జాజ్, సిటీ సీఆర్-వీ, సివిక్, అకార్డ్ మోడల్ కార్లను వెనక్కి తీసుకుంది. గతంలో వీటికి అమర్చిన టకాటా ఎయిర్ బ్యాగ్స్‌ను మార్చేందుకు రీకాల్ చేసింది. ఈ మేరకు హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రకటన చేసింది.

సరికొత్త SBI వెల్త్: అర్హతలు, ప్రయోజనాలు తెలుసుకోండిసరికొత్త SBI వెల్త్: అర్హతలు, ప్రయోజనాలు తెలుసుకోండి

2009-2012 మధ్య తయారుచేసిన పది జజ్ కార్లు, 2007-2013 మధ్య తయారు చేసిన 2099 సిటీ మోడల్స్, 2006-2008 మధ్య తయారైన 52 సివిక్ మోడల్ కార్లు, 2003-2008 మధ్య తయారైన 2577 సీఆర్-వీ మోడల్ కార్లు, 2003లో తయారు చేసిన 350 అకార్డ్ కార్లు రీకాల్ చేసింది.

Honda Cars India recalls previous Gen Jazz, City, CR V, Civic and Accord

దేశవ్యాప్తంగా ఉన్న HCIL డీలర్‌షిప్‌లలో ఉచిత సేవలు అందుతాయి. 29 జూలై 2019 నుంచి ఈ విషయం వినియోగదారులకు తెలియజేస్తారు. కంపెనీ నేరుగ వినియోగదారులతో కమ్యూనికేట్ అవుతుంది.

కస్టమర్లు కూడా తమ కార్లు వీటి పరిధిలోకి వస్తాయో లేదో చెక్ చేసుకోవచ్చు. 17 క్యారెక్టర్స్ కలిగిన అల్పా న్యూమరిక్ వెహికిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (VIN)‌ను కంపెనీ వెబ్‌సైట్ క్రియేట్ చేసిన ప్రత్యేక మైక్రోసైట్‌లో సబ్‌మిట్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇదే ఏడాది ఏప్రిల్ నెలలో హోండా 3,669 ఆకార్డ్ కార్లను రీకాల్ చేసింది. టకాట ఎయిర్‌ బ్యాగ్స్‌లో సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా కార్లను రీకాల్ చేసింది.

English summary

5,088 హోండా కార్లు రీకాల్, కస్టమర్లు ఇలా చెక్ చేసుకోవచ్చు! | Honda Cars India recalls previous Gen Jazz, City, CR V, Civic and Accord

Honda Cars India Ltd (HCIL) has announced that it has expanded its campaign to replace Takata driver and passenger front airbag inflators in 5,088 units of its previous generation models of Jazz, City, CR-V, Civic and Accord.
Story first published: Tuesday, July 30, 2019, 14:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X