For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉబెర్ ఈట్స్ ఆన్ సేల్?: ఫుడ్ డెలివరీలోకి అమెజాన్, ప్రైమ్ మెంబర్‌షిప్‌తో భారీ ప్లాన్

|

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగు పెట్టనుందని, ఈ మేరకు ఉబెర్ ఈట్స్‌తో చర్చలు సాగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఉబెర్ ఈట్స్‌ను కొనుగోలు చేసే అంశంపై ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఉబెర్ ఈట్స్ కొనుగోలు లేకుంటే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశముంది. దీనిపై అమెజాన్ ఇండియా, ఉబెర్ స్పందించాల్సి ఉంది.

పెట్రోల్ బంకులో మీరు ఈ సేవలు ఉచితంగా పొందవచ్చుపెట్రోల్ బంకులో మీరు ఈ సేవలు ఉచితంగా పొందవచ్చు

ఉబెర్ ఈట్స్ వ్యాల్యూ $300 మిలియన్లుగా అంచనా

ఉబెర్ ఈట్స్ వ్యాల్యూ $300 మిలియన్లుగా అంచనా

ఉబెర్ ఈట్స్ తమ కంపెనీ వ్యాల్యుయేషన్‌ను దాదాపు 300 మిలియన్స్ డాలర్లుగా అంచనా వేస్తున్నాయని తెలుస్తోంది. దీంతో చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి. ఇప్పటికే జొమాటో, స్విగ్గీ భారీ వ్యాపారం నిర్వహిస్తున్నాయని, ఈ యాప్స్‌కు ఎంతోమంది క్లయింట్స్ ఉంటారని, తాము ఉబెర్ ఈట్స్‌తో జత కడితే బలపడవచ్చునని అమెజాన్ భావిస్తోంది. అమెజాన్ ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని ప్రైమ్ మెంబర్ షిప్ ద్వారా నిర్వహించాలని ప్లాన్ వేస్తోంది.

ప్రైమ్ మెంబర్ షిప్ ద్వారా మరింత దగ్గరగా..

ప్రైమ్ మెంబర్ షిప్ ద్వారా మరింత దగ్గరగా..

అమెజాన్ ఇండియా ఈ డెలివరీ వ్యాపారాంపై చాలా ఆసక్తితో ఉంది. అమెజాన్ అందించే సేవల్లో ఫుడ్ డెలివరీ ఉండాలని బలంగా కోరుకుంటోంది. కోటి మందికి పైగా సభ్యులు ఉన్న ప్రైమ్ మెంబర్ షిప్ ద్వారా కస్టమర్లను తమ యాప్‌కు చేరువ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ప్రైమ్ యాప్‌లో ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, నిత్యావసర వస్తువులు వంటివి కొనుగోలు చేయవచ్చు. దీనికి ఫుడ్ డెలివరీని యాడ్ చేస్తే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ప్లాన్.

ఫుడ్ డెలివరీ ద్వారానే ఎక్కువ...

ఫుడ్ డెలివరీ ద్వారానే ఎక్కువ...

ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, గ్రాసరీస్ కంటే ఫుడ్ డెలివరీ ద్వారానే వినియోగదారులు ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఎక్కువగా వినియోగిస్తారని అంచనా వేస్తోంది. గత ఏడాది స్విగ్గీ రోజుకు 8 లక్షల ఆర్డర్లను, జొమాటో రోజుకు 6,50,000 ఆర్డర్ల నమోదు చేయగా, ఉబెర్ ఈట్స్‌ రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఆర్డర్లను నమోదు చేసింది.

గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఉబెర్ ఈట్స్

గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఉబెర్ ఈట్స్

స్విగ్గీ, జొమాటోలు కూడా ఉబెర్ ఈట్స్ ఇండియా యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. వ్యాల్యుయేషన్‌లో తేడా వల్ల జొమాటో, స్విగ్గీ చర్చలు ఫెయిలయ్యాయని సమాచారం. ఉబెర్ ఈట్స్ ఇండియాలో గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఓ వైపు స్విగ్గీ గ్రాసరీ డెలివరీలోకి దూసుకెళ్తుండగా, జొమాటో మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ జొమాటో గోల్డ్ ద్వారా వృద్ధి సాధిస్తున్నాయి.

English summary

ఉబెర్ ఈట్స్ ఆన్ సేల్?: ఫుడ్ డెలివరీలోకి అమెజాన్, ప్రైమ్ మెంబర్‌షిప్‌తో భారీ ప్లాన్ | Amazon plans to add Uber Eats local unit to its cart

Amazon India is in early talks to buy Uber Eats' local unit and enter the food delivery business, reports Business Standard. Uber Eats is eyeing a valuation of around $300 million, sources told the paper.
Story first published: Monday, July 29, 2019, 12:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X