For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాష్ట్రాలు కూడా ఆధార్ డేటాను ఉపయోగించుకోవచ్చు

|

న్యూఢిల్లీ: ఆధార్ కార్డును ఇప్పుడు ప్రతిచోట ఉపయోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇది తప్పనిసరి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు ఆధార్ కార్డు ప్రూఫ్‌ను అడుగుతాయి. తాజాగా, నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రాలు మంజూరు చేసే రాయితీలు అందుకునే లబ్ధిదారుల గుర్తింపు కోసం ఆధార్ వినియోగానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.

మీ మొబైల్ ఫోన్‌తో జాగ్రత్త..! ఇలా చేయండి: HDFC హెచ్చరికమీ మొబైల్ ఫోన్‌తో జాగ్రత్త..! ఇలా చేయండి: HDFC హెచ్చరిక

రాష్ట్ర పథకాలకు ఇదే వర్తించేలా...

రాష్ట్ర పథకాలకు ఇదే వర్తించేలా...

ఆధార్‌లో మార్పులు, ఇతర సవరణలకు ఆమోదం తెలిపింది. కేంద్రం అమలు చేస్తున్న రాయితీ పథకాలకు ఆధార్ కార్డుతో అనుసంధానం చేశామని, ఇదే విధానాన్ని రాష్ట్ర పథకాలకు కూడా వర్తింపజేయనున్నామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.

ఈ సమావేశంలో బిల్లు

ఈ సమావేశంలో బిల్లు

128 కోట్ల మందికి ఆధార్ ఉందని, కాబట్టి ఎవరికీ ఇబ్బందులు ఉండవని చెప్పారు. అనర్హులు అనుచిత లబ్ధిపొందకుండా చూడవచ్చన్నారు. ఇందుకోసం చట్టంలో మార్పులు చేస్తామని, సవరణ బిల్లును ఈ సమావేశాల్లోనే తీసుకొస్తామన్నారు.

లబ్ధిదారులకు మరింత ప్రయోజనం

లబ్ధిదారులకు మరింత ప్రయోజనం

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లోని లబ్ధిదారుల ఆధార్ బయోమెట్రిక్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకోవచ్చునని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆధార్, ఇతర చట్టాల (సవరణ) బిల్లులో మార్పులకు ఆమోదం తెలిపామన్నారు. ఇది లబ్ధిదారులకు మరింత ప్రయోజనం అవుతుందన్నారు. సబ్సిడీలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయన్నారు.

English summary

రాష్ట్రాలు కూడా ఆధార్ డేటాను ఉపయోగించుకోవచ్చు | States can now use Aadhaar for welfare schemes

The Union Cabinet approved changes to the Aadhaar and Other Laws (Amendment) Bill 2019 on Wednesday, to incorporate a clause that will allow the use of Aadhaar data for state schemes and subsidies.
Story first published: Thursday, July 25, 2019, 12:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X