For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిస్సాన్‌లో 10,000 ఉద్యోగాల కోత, కారణాలివే

|

టోక్యో: ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలోని 10,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు నిస్సాన్ మోటార్స్ కంపెనీ లిమిటెడ్ ప్లాన్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం, ఖర్చులు తగ్గించుకునే క్రమంలో భాగంగా గత మే నెలలోనే 4,800 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాలని యోచించిన కంపెనీ, తాజాగా పదివేల మందికి ఉద్వాసన పలకనుంది. ఈ మేరకు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

నిస్సాన్ యొక్క నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో దశాబ్ద కనిష్టానికి పడిపోయింది. అంతేకాకుండా రాబోవు 12 నెలల్లో కష్టతరమైన వ్యాపార వాతావరణం ఉంటుందని భావిస్తోంది. కంపెనీ తన తొలి త్రైమాసిక ఆదాయాన్ని గురువారం ప్రకటించనుంది. దీనిపై ముందే ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు.

 Nissan plans to cut over 10,000 jobs globally

'గురువారం ఏం ప్రకటిస్తామనేది ఇంకా నిర్ణయించలేదు. అలాగే, మీడియా ఊహాగానాలపై మేం వ్యాఖ్యానించదల్చుకోలేదు' అని నిస్సాన్ ప్రతినిధి కోజి కుడా తెలిపారు. అమెరికా, ఐరోపాలలో అమ్మకాలు పడిపోవడంతో పాటు ఆర్థిక కుంభకోణం ఆరోపణలపై మాజీ బాస్ కార్లోస్ ఘోస్న్ అరెస్ట్ అనంతరం నిస్సాన్ మరింత దెబ్బతిన్నది.

అలాగే, 43 శాతం వాటా ఉన్న ఫ్రెంచ్ భాగస్వామి రెనాల్ట్‌తో వివాదం ముదిరింది. దీంతో సంక్షోభంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,39,000 ఉద్యోగుల్లో 4,800 ఉధ్యోగాలకు కోత పడనుందని కంపెనీ మే నెలలో ప్రకటించింది. ఇప్పుడు ఇది రెండింతలకు చేరుకుంది.

2019 మార్చి లో 319 బిలియన్ యెన్ల నికర లాభాలను నివేదించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది సగం వరకు క్షీణత. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లాభాలు 170 బిలియన్లకు పడిపోవచ‍్చని అంచనా వేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ ఏడాది మొదటి త్రైమాసిక ఫలితాలను గురువారం ప్రకటించనుంది.

English summary

నిస్సాన్‌లో 10,000 ఉద్యోగాల కోత, కారణాలివే | Nissan plans to cut over 10,000 jobs globally

Nissan Motor Co Ltd is planning to cut more than 10,000 jobs globally to help turn around its business, a source said on Wednesday, showing a tough road ahead for the automaker which is also reeling from the ouster of former Chairman Carlos Ghosn.
Story first published: Wednesday, July 24, 2019, 15:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X