For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: EVలపై తగ్గనున్న పన్ను, మీరు ఎంత డబ్బు ఆదా చేస్తారంటే?

|

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ నెల 25వ తేదీన జీఎస్టీ కౌన్సెల్ భేటీ కానుంది. ఈ సమావేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై (EV) ట్యాక్స్ తగ్గింపు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జీఎస్టీ 36వ కౌన్సెల్ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుందని తెలుస్తోంది. EVలతో పాటు సౌర శక్తి ఉత్పత్తి వ్యవస్థ, విండ్ టర్బైన్ ప్రాజెక్టులపై విుధించే జీఎస్టీని ఎత్తివేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

SIP రిటర్న్స్: రూ.300 ఇన్వెస్ట్‌తో కోటీశ్వరులు కావొచ్చు!SIP రిటర్న్స్: రూ.300 ఇన్వెస్ట్‌తో కోటీశ్వరులు కావొచ్చు!

EVలపై జీఎస్టీ తగ్గించే ఛాన్స్

EVలపై జీఎస్టీ తగ్గించే ఛాన్స్

గత జీఎస్టీ సమావేశంలో ev, ఎలక్ట్రిక్ ఛార్జర్లు, అద్దెకు తీసుకునే evలపై జీఎస్టీ పన్ను విధింపు నిర్ణయానికి సంబంధించి వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. evల తయారీని, వాడకాన్ని ప్రోత్సహించేందుకు వీటిపై విధించే జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కౌన్సెల్ కేంద్ర ప్రభుత్వానికి గతంలో సూచించింది. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పెట్రోల్, డీజిల్ కార్లు, హైబ్రిడ్ వాహనాలపై ఇప్పటికే 28 శాతం జీఎస్టీతో పాటు అదనంగా సెస్ విధిస్తున్నారు.

సోలార్ పవర్ ప్రాజెక్టులపై సమీక్ష

సోలార్ పవర్ ప్రాజెక్టులపై సమీక్ష

సోలార్ పవర్ ప్రాజెక్టు ట్యాక్స్ స్ట్రక్చర్‌ను సమీక్షించనుంది. ట్యాక్సేషన్ స్ట్రక్చర్‌ను పునఃపరిశీలించాలని గత మే నెలలో ఢిల్లీ హైకోర్టు జీఎస్టీ కౌన్సెల్‌ను ఆదేశించింది. సంబంధిత ఇండస్ట్రీ ఈ అంశంపై పిటిషన్ వేయగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోలార్ ప్రాజెక్టుకు సంబంధించి 70 శాతాన్ని గూడ్స్‌గా పరిగణించి 5 శాతం ట్యాక్స్, మిగతా 30 శాతాన్ని సేవల కింద పరిగణించి 18 శాతం ట్యాక్సబుల్‌గా పరిగణిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.

evలు ఉపయోగించేవారికి బెనిఫిట్స్...

evలు ఉపయోగించేవారికి బెనిఫిట్స్...

పర్యావరణహిత వాహనాల కోసం నిరంతరం డిమాండ్ పెరుగుతుండటంతో ఆటోమేకర్స్ సమీప భవిష్యత్తులో మరింత ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వినియోగదారునికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉత్పత్తిని పెంచేప్రయత్నా చేస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వం, లోకల్ బాడీస్ కొన్ని సడలింపులు, ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని సాధ్యమైనంతగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. బడ్జెట్ సందర్భంగా ఇదే విషయం వెల్లడించారు.

రూ.2.5 లక్షల బెనిఫిట్స్...

రూ.2.5 లక్షల బెనిఫిట్స్...

ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి రెండు కీలక ప్రకటనలలో ఒకటి సెక్షన్ 80EEB కింద ఎలక్ట్రిక్ వాహనాల కోనుగోలుపై తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీపై రూ.1.5 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఉంది. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ప్రతిపాదన చేశారు. దీనిని పరిశీలిస్తే ఎలక్ట్రిక్ వెహికిల్స్ కొనుగోలు చేసే పన్ను చెల్లింపుదారులకు రుణ వ్యవధిలో సుమారు రూ.2.5 లక్షల బెనిఫిట్స్ ఉంటాయి. కామన్ మ్యాన్‌కు సరసమైన, పర్యావరణ అనుకూల ప్రజా రవాణా ఎంపికలు అందించడమే ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సహం ముఖ్య ఉద్దేశ్యం. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకారం, వేగవంతమైన అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (Hybrid), ఎలక్ట్రిక్ వెహికిల్స్ (FAME) స్కీం కింద ఈ-వెహికిల్స్ ప్రోత్సహిస్తామన్నారు.

English summary

గుడ్‌న్యూస్: EVలపై తగ్గనున్న పన్ను, మీరు ఎంత డబ్బు ఆదా చేస్తారంటే? | GST Council to decide on tax cut on electric vehicles this week

The GST Council, chaired by Finance Minister Nirmala Sitharaman, will meet on July 25 and decide on lowering tax rates for electric vehicles, officials said.
Story first published: Monday, July 22, 2019, 8:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X