For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూపర్ రిచ్ టాక్స్ తో కార్పొరేట్ కంపెనీలకు కొత్త తలనొప్పి

|

ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన సూపర్ రిచ్ టాక్స్ లేదా సెస్ ... ఏకంగా 43 % నికి పెరిగిపోవటంతో... దేశంలోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఈ నిర్ణయం తో కంపెనీల బాస్ ల వేతనాలను సవరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే ... గతంలో కంటే వారికీ పన్ను బాదుడు ఎక్కువ అవటం వల్ల ... ఆ మేరకు వేతనం పెంచక పెంచాల్సి ఉంటుంది. ఎండీ , సీఈఓ, ప్రెసిడెంట్ స్థాయి ఉన్నతాధికారులకు వేతనాలు కోట్లలోనే ఉంటాయి. ఆర్ధిక మంత్రి రూ 2 కోట్లు ఆపైన ఆదాయం ఉన్నవారికి పన్ను పై సర్చార్జీ పెంచగా... రూ 5 కోట్లు అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్లకు బడుగు మరింత ఎక్కువైంది. దీంతో అటు ఉన్నతాధికారులు, ఇటు కంపెనీలు తలలు పట్టుకొంటున్నాయి.

వారి సంపాదన రూ 11 కోట్ల పైనే...

వారి సంపాదన రూ 11 కోట్ల పైనే...

భారత్ లోని స్టాక్ మార్కెట్లో లిస్ట్ ఐన కొన్ని కంపెనీల బాస్ ల శాలరీ తీసుకొంటే కళ్ళు చెదిరే రేంజ్ లో ప్యాకేజీ ఉంటున్నాయి.ఉదాహరణకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి 500 కంపెనీలు తీసుకొంటే అందులో 144 మంది ఉన్నధికారుల వేతనాలు సగటున రూ 11.4 కోట్లుగా తేలినట్లు టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. కొత్తగా ప్రతిపాదించిన పన్ను స్లాబుల ప్రకారం... ఇలాంటి సూపర్ రిచ్ ఎగ్జిక్యూటివ్ లకు సరాసరి 20% వరకు టేక్ హోమ్ శాలరీ తగ్గిపోనుందట. ఇది కూడా ఒక ప్రముఖ కంపెనీ సీఈఓ వెల్లడించిన వాస్తవం. మరి అదే రేంజ్ లో కంపెనీలు వారికీ న్యాయం చేయాల్సి ఉంటుంది. దీంతో కంపెనీలపై కనీసం 10% నుంచి 20% వరకు అదనపు భారం పడనుందని... తద్వారా కంపెనీల లాభదాయకతపై ఆ మేరకు ప్రభావం ఖచ్చితంగా ఉంది తీరుతుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బాదుడే ... బాదుడు...

బాదుడే ... బాదుడు...

ఈ ఏడాది బడ్జెట్ లో సామాన్యుడిపై కాస్త కనికరం చూపించిన ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ... సంపన్నులపై మాత్రం కొరడా ఝుళిపించిందనే చెప్పాలి. రూ 2 కోట్ల నుంచి రూ 5 కోట్ల వరకు ఆదాయ ఉన్న వారిపై సర్చార్జీ ని 15% నుంచి 25% పెంచటంతో... వారిపై పన్ను రేటు గతంలోని 35.88% నుంచి 39% నికి పెరిగిపోయింది. ఇక రూ 5 కోట్లు అంతకంటే అధిక ఆదాయం ఉన్నవారి పరిస్థితి అయితే చెప్పనక్కర లేదు. వారిపై ఏకంగా సర్చార్జీ ని ఏకంగా 15% నుంచి 37% శాతాన్ని పెంచటం తో... వారి పన్ను రేటు అత్యధికంగా 42. 7% నికి ఎగబాకింది. 1992 తర్వాత ఇంతటి పన్ను రేటు భారత్ లో ఉండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఇండియా లో రిచ్ సీఈఓ సీపీ గుర్నాని ....

ఇండియా లో రిచ్ సీఈఓ సీపీ గుర్నాని ....

ఇండియా లోని కార్పొరేట్ కంపెనీల్లో అతయధిక వేతనం పొందుతున్న సీఈఓ ల్లో ఓపీ గుర్నాని ముందున్నారు. ఆయన టెక్ మహీంద్రా కంపెనీకి సీఈఓ గా కొనసాగుతున్నారు. గుర్నాని వార్షిక వేతనం ఏకంగా రూ 146 కోట్లు కావడం విశేషం. ఆ తర్వాతి స్థానంలో రూ 137 కోట్ల వార్షిక వేతనం తో ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ చైర్మన్ ఏఎం నాయక్ నిలిచారు. మన దేశంలో అత్యంత సంపన్నుడు ... రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మాత్రం కొన్నేళ్లుగా స్థిరంగా రూ 15 కోట్ల వేతనాన్ని తీసుకొంటున్నారు.

50,000 నుంచి 1,00,000 మంది...

50,000 నుంచి 1,00,000 మంది...

అయితే మన దేశంలో రూ 1 కోటి అంత కంటే ఎక్కువ పన్ను చెల్లించే వారి సంఖ్యా 50,000 నుంచి 1,00,000 మధ్య ఉంటుందని అనధికారిక అంచనాలు ఉన్నాయి. వీరందిపై కొత్త పన్ను విధానం భారీ ప్రభావాన్నే చూపనుంది. వ్యక్తిగతంగా ఎగ్జిక్యూటివ్ లు కొంత మేరకు నష్టపోతే, కంపెనీలపై దీని ప్రభావం ఎక్కువగా పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి దీని ప్రభావం ఎలా ఉంటుందో.

English summary

సూపర్ రిచ్ టాక్స్ తో కార్పొరేట్ కంపెనీలకు కొత్త తలనొప్పి | FM Nirmala Sitharaman shrugs off pleas by FPIs on super rich tax

The super-rich tax is here to stay for a large section of foreign portfolio investors (FPIs), with Union finance minister Nirmala Sitharaman ignoring their pleas while proposing further tax relief for startups and non-bank lenders.
Story first published: Friday, July 19, 2019, 8:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X