For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేంద్ర ప్రభుత్వ పథకాలు.. వడ్డీ రేటు, కాలపరిమితి

|

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, రైతులకు, ఆడపిల్లలకు... ఇలా అందరికీ వివిధ రకాల పథకాలను ఆఫర్ చేస్తోంది. సురక్షితమైన డబ్బు ఆదా, సంపద పెంచుకునేందుకు ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక పెట్టుబడులతో ప్రయోజనాలు పొందవచ్చు. ఇలా ఇన్వెస్ట్ చేసిన మొత్తం ఆ తర్వాత వృద్ధాప్యంలో పెన్షన్‌గా, పిల్లల పెళ్లిళ్లు.. ఇలా వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు.

HDFC హెచ్చరిక: మీ డబ్బు దొంగిలిస్తారు.. ఇలా చేయకండి!HDFC హెచ్చరిక: మీ డబ్బు దొంగిలిస్తారు.. ఇలా చేయకండి!

ప్రభుత్వ పథకాలు ప్రయోజనకరం...

ప్రభుత్వ పథకాలు ప్రయోజనకరం...

మ్యుచువల్ ఫండ్స్ వంటి వాటిల్లా కాకుండా ప్రభుత్వ పథకాల్లో రిస్క్‌లు చాలా తక్కువ. స్థిరమైన రాబడి పొందుతాము. అలాగే ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. మీ కూతురు పెళ్లికి లేదా చదువు కోసం కొంత మొత్తం డిపాజిట్ చేస్తే దానిపై కొంత మొత్తం వడ్డీ వస్తుంది. ఆదాయ పన్ను పరిమితిలో దీనిని చూపించుకునే వెసులుబాటు ఉంది. వేతనజీవికి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ తప్పనిసరి. ప్రభుత్వ పథకాల ముఖ్య ఉద్దేశ్యం ప్రస్తుతం మీ ఆదాయంలో కొంత భాగాన్ని భవిష్యత్తులోని అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.

వివిధ రకాల స్కీంలు...

వివిధ రకాల స్కీంలు...

ప్రభుత్వం ఎన్నో రకాల స్కీంలు ప్రవేశపెట్టింది. ఈ పథకాలతో పాటు వాటికి వడ్డీని కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. పలు పథకాలకు కాల పరిమితి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్య పథకాలు, వడ్డీ రేటు, వాటి కాలపరిమితి తెలుసుకుందాం...

వివిధ పథకాలు.. వడ్డీ రేటు

వివిధ పథకాలు.. వడ్డీ రేటు

- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) - వడ్డీ రేటు 8% (జనవరి-మార్చి 2019) - కాల పరిమితి 5 లేదా 10 ఏళ్లు.

- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) - 8% (April 1, 2018 నుంచి వర్తింపు) - కాల పరిమితి కనీసం 15 ఏళ్లు.

- వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) - 8.65% - కాల పరిమితి కనీసం 5 ఏళ్లు

- నేషనల్ పెన్షన్ స్కీం (NPS) - ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుంది - కాల పరిమితి.. 60 ఏళ్లకు మెచ్యూరిటీ

- పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ - 4% - కాలపరిమితి లేదు

- పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ - టెన్యూర్ ఆధారంగా ఉంటుంది - కాల పరిమితి 1 నుంచి 5 ఏళ్లు

- పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ - 7.3% - కాల పరిమితి 5 ఏళ్లు

- పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం - 7.7% - కాల పరిమితి 5 ఏళ్లు

- అటల్ పెన్షన్ యోజన - 8% - కాల పరిమితి వయస్సు ఆధారంగా ఉంటుంది

- సుకన్య సమృద్ధి యోజన - 8.5% - కాల పరిమితి... 21 ఏళ్లు లేదా అమ్మాయి పెళ్లికి.

- కిసాన్ వికాస్ పత్ర - 7.7% - కాల పరిమితి 118 నెలలు

- సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం - 8.7% - కాల పరిమితి 5 ఏళ్లు

English summary

కేంద్ర ప్రభుత్వ పథకాలు.. వడ్డీ రేటు, కాలపరిమితి | Savings Plan: Government Savings Scheme in India

The government offers various saving schemes to suit the different needs of investors. Check-out the various types of savings schemes in India along with their features and benefits.
Story first published: Wednesday, July 17, 2019, 15:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X