For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ITR ఫాంలో ఎలాంటి మార్పు లేదు, యుటిలిటీ సాఫ్టవేర్ మాత్రం అప్‌డేట్ అవుతోంది

|

న్యూఢిల్లీ: ఐటీ రిటర్న్స్ ఫాంలో ఎలాంటి మార్పులు లేవని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (CBDT) మంగళవారం స్పష్టం చేసింది. ఆదాయ పన్ను రిటర్న్స్ ఫాంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని, దీంతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే అవన్నీ వట్టివేనని CBDT కొట్టిపడేసింది.

జాగ్రత్త!: గడువుదాటినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే జరిమానా ఇలా, జైలుశిక్షజాగ్రత్త!: గడువుదాటినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే జరిమానా ఇలా, జైలుశిక్ష

'ఏప్రిల్ 1, 2019న నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి ఐటీఆర్ 2, ఐటీఆర్ 3 సహా ఏ ఐటీఆర్ ఫాంలోను ఎలాంటి మార్పులు చేయలేదు.' అని CBDT పేర్కొంది. 'ఐటీఆర్ 2, ఐటీఆర్ 3 రిటర్న్స్ దాఖలు చేసేందుకు ట్యాక్స్ పేయర్స్ ఇబ్బందులు పడుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అవి వాస్తవం కాదు' అని తెలిపింది.

No change in ITR forms, only utility software updated

కేవలం ఈ-ఫైలింగ్ కోసం యుటిలిటీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవుతుందని, అంతకుమించి ఇతర మార్పులు ఏవీ చేయలేదని తెలిపింది. మూలంవద్ద పన్ను కోత (TDS) సమాచారం ఆధారంగా ప్రీ-ఫైలింగ్‌ వంటి పలు సౌకర్యాలు ఇందులో భాగంగా ఉందని పేర్కొంది.

English summary

ITR ఫాంలో ఎలాంటి మార్పు లేదు, యుటిలిటీ సాఫ్టవేర్ మాత్రం అప్‌డేట్ అవుతోంది | No change in ITR forms, only utility software updated

The Central Board of Direct Taxes (CBDT) on Tuesday said that no changes have been made in any of the Income Tax Return (ITR) forms.
Story first published: Wednesday, July 17, 2019, 14:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X