For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కేంద్రం కొత్త నిర్ణయం! 30% డ్రైవింగ్ లైసెన్స్ ఫేక్

|

న్యూఢిల్లీ: దేశంలోని డ్రైవింగ్ లైసెన్స్‌లలో 30శాతం ఫేక్ అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లోకసభలో వెల్లడించారు. ప్రపంచంలోనే సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందగలిగే సౌకర్యం భారతదేశంలో ఉందని, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ సులభంగా పొందవచ్చునని, లైసెన్స్ పైన ఫోటోగ్రాప్స్ చూస్తే కొన్ని మ్యాచ్ కావడం లేదని చెప్పారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా, చట్టంపై గౌరవం లేకుండ్ డ్రైవింగ్ చేస్తున్నారన్నారు. రూ.50, రూ.100 చలాన్లను ఎవరు కూడా లెక్క చేయడం లేదన్నారు.

SBI E-Rail: రైల్వే టిక్కెట్‌ను ఇలా ఈజీగా బుక్ చేసుకోండిSBI E-Rail: రైల్వే టిక్కెట్‌ను ఇలా ఈజీగా బుక్ చేసుకోండి

డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ తప్పనిసరి కాదు

డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ తప్పనిసరి కాదు

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆధార్ ధృవీకరణను నిలిపివేస్తున్నట్లు గడ్కరీ రాజ్యసభలో తెలిపారు. నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ సమాచారం మేరకు ఆధార్ కలిగిన డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆధార్‌కతో కూడిన వాహన రిజిస్ట్రేషన్లు కోటిన్నరకు పైగా చొప్పున ఉన్నాయని చెప్పారు. టీఆర్ఓల వద్ద బయోమెట్రిక్ సేకరణ ప్రక్రియ నిలిపేస్తున్నట్లు తెలిపారు.

యూపీలో ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికిల్స్

యూపీలో ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికిల్స్

2030 నాటికి భారత్‌లో 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గడ్కరీ చెప్పారు. జూలై 9వ తేదీ వరకు ఇండియాలో 3.97 లక్షల రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్/బ్యాటరీ వెహికిల్స్ ఉన్నట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోకెల్లా యూపీలో ఎక్కువగా 1.39 లక్షల EV వెహికిల్స్ ఉన్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఢిల్లీలో 75 వేలకు పైగా, కర్ణాటకలో దాదాపు 32 లక్షలు ఉన్నాయి. అతి తక్కువగా అంటే అరుణాచల్ ప్రదేశ్‌లో 13, దాద్రా నగర్ హవేలీలో 14, మేఘాలయలో 17, మిజోరాంలో 18 ఉన్నాయి.

వాహన చట్టంలో సవరణలు

వాహన చట్టంలో సవరణలు

వాహన చట్టంలో సవరణలు చేస్తూ ప్రతిపాదనలు చేశారు. ఇందులో జరిమానాలు భారీగా పెంచారు. ఈ కొత్త బిల్లు ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రస్తుతం ఉన్నదాని కంటే పదిరెట్ల జరిమానా విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే రూ.5,000 వరకు ఫైన్ వేయనున్నారు. మద్యం తాగి వాహనం నడిపితే రూ.10,000 వరకు, డేంజరస్ డ్రైవింగ్‌కు రూ.5,000 విధిస్తారు.

English summary

డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కేంద్రం కొత్త నిర్ణయం! 30% డ్రైవింగ్ లైసెన్స్ ఫేక్ | 30% driving licences in India are fake, Highest EVs in UP

About 30% driving licences in India are fake, road transport and highways minister Nitin Gadkari said in the Lok Sabha on Monday as he made a strong pitch for passage of the much-delayed Motor Vehicles (Amendment) Bill.
Story first published: Wednesday, July 17, 2019, 12:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X