For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI ఖాతాదారులా?: 'డబ్బు కోల్పోతారు.. జాగ్రత్తగా ఉండండిట'

|

ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఫేక్ అకౌంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వాటిని నమ్మి మీ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని హితవు పలికింది. ఈ మేరకు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.

మీరు SBI బ్యాంక్ అకౌంట్ ఖాతాదారు అయినా, మరే బ్యాంకు ఖాతాదారు అయినా జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రాడ్ చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. SBI అకౌంట్ హోల్డర్ అయితే, ఈ బ్యాంక్ చేసిన ట్వీట్ మీకు ఎక్కువగా వర్తిస్తుంది. ఆన్ లైన్ ఫ్రాడ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఏపీ బడ్జెట్‌కు మోడీ దెబ్బ! జగన్ ఎక్కడ సర్దుబాటు చేస్తారు?ఏపీ బడ్జెట్‌కు మోడీ దెబ్బ! జగన్ ఎక్కడ సర్దుబాటు చేస్తారు?

ఎస్పీఐ జాగ్రత్తలు

ఎస్పీఐ జాగ్రత్తలు

ఆన్‌లైన్ ఫ్రాడ్ ద్వారా ఎంతోమంది తమ డబ్బులు కోల్పోతున్నారు. సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఈ ఫ్రాడ్ రోజు రోజుకు పెరగడం ఆందోళన కలిగించే అంశం. ఈ నేపథ్యంలో ఫేక్ సోషల్ మీడియా ఎస్బీఐ అకౌంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ తన కస్టమర్లకు చెప్పింది.

ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్‌కు కనుక మీరు సబ్‌స్క్రైబ్ అయి ఉంటే వెంటనే అన్‌ఫాలో కావాలని సూచించింది. ఎస్బీఐకి 42 మిలియన్ల సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇందులో ఫేస్‌బుక్, సోషల్ మీడియా వంటి వాటిల్లో ఫాలో అయ్యేవారు కూడా లక్షల్లో ఉన్నారు. ఎస్బీఐ సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా వాలిడేటెడ్‌గా ఉంటాయని స్పష్టం చేసింది. కేవలం అఫీషియల్ అకౌంట్స్‌ను మాత్రమే ఫాలో కావాలని సూచించింది.

సమయం వృథా చేసుకోవద్దు

ఫేక్ అకౌంట్స్ ద్వారా చాలామంది ఖాతాదారులను కన్విన్స్ చేసి, డబ్బులు నష్టపరిచే ప్రయత్నాలు చేస్తారు. సోషల్ మీడియా ఫేక్ అకౌంట్స్ ద్వారా మీ సమయాన్ని, డబ్బును ఇన్వెస్ట్ చేసే ప్రయత్నాలు చేయవద్దని, ధృవీకరించబడిన సోషల్ మీడియా అకౌంట్స్ మాత్రమే ఫాలో అవండని, ఎస్బీఐ మీ కామెంట్స్, కంప్లయింట్స్ ఎస్బీఐ ద్వారా వెంటనే పరిష్కరించబడతాయని, ఫ్రాడస్టర్స్ చేతిలో మోసపోవద్దని పేర్కొంది.

వెరిఫైడ్ సోషల్ మీడియా లింక్స్

వెరిఫైడ్ సోషల్ మీడియా లింక్స్

ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా లింక్స్‌ను కూడా పేర్కొంది. 1.Facebook: @StateBankOfIndia

2.Instagram: @theofficialsbi

3.Twitter: @TheOfficialSBi

4.LinkedIn: State Bank of India (SBI)

5.YouTube: State Bank of India

6.Quora: State Bank of India (SBI)

7.Pinterest: State Bank Of India

ఆన్‌లైన్ ఫ్రాడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ సూచించింది. ఒకవేళ మీరు అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1800112211 లేదా 18004253800 కాల్ చేయవచ్చునని తెలిపింది.

English summary

SBI ఖాతాదారులా?: 'డబ్బు కోల్పోతారు.. జాగ్రత్తగా ఉండండిట' | Are you SBI account holder? Alert, You can lose money, never do this

The SBI has stated that before tagging any officer or the bank from your social media account, customers must be ensure that the account is verified.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X