For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైతు కోసం...: రూ.611 కోట్లు చెల్లించాలని జగన్‌కు పవన్ కళ్యాణ్ డిమాండ్

|

అమరావతి: 2014లో టీడీపీకి మద్దతిచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. 2019లో ఒంటరిగా పోటీ చేసిన జనసేనాని రైతుల సమస్యలపై ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నెల రోజులు దాటింది. ఈ నేపథ్యంలో ఆయన రైతుల అంశాన్ని లేవనెత్తారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం వారికి డబ్బులు చెల్లించడంలో జాప్యం చేయడాన్ని దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అదే సమయంలో బీజేపీ కూడా రైతుల అంశంపై వైసీపీకి సూచనలు చేస్తోంది.

ఏపీకి జగన్ గుడ్‌న్యూస్: ఏడాదికి రూ.250 పెంపు, వాలంటీర్ల భారం ఏంతంటే?

రైతులు అప్పు చేసే పరిస్థితి, బకాయిలు చెల్లించలేదు

రైతులు అప్పు చేసే పరిస్థితి, బకాయిలు చెల్లించలేదు

ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విత్తనాల కొరత కారణంగా రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పవన్ ఆందోళన వ్యక్తం చేసారు. అర్ధరాత్రి వరకు క్యూలైన్లలో నిలుచున్నప్పటికీ విత్తనాలు లభిస్తాయో లేదో తెలియని పరిస్థితి ఉందన్నారు. అనంతపురం జిల్లాలో 4.96 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగుకు 3 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా ఐతే 1.8 లక్షల క్వింటాళ్లు మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చాయన్నారు. తొలకరి సమయంలో వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడుల కోసం రైతులు అప్పులు చేసే పరిస్థితి ఉందని, బకాయిలు చెల్లించకుండా, రైతాంగానికి అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచకుండా వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

జగన్! సమాధానం చెప్పు.. ఆ డబ్బు చెల్లించండి

జగన్! సమాధానం చెప్పు.. ఆ డబ్బు చెల్లించండి

విత్తనాలు ప్రభుత్వం సరఫరా చేసే కేంద్రాల కంటే వ్యాపారుల గోదాముల్లోనే ప్రభుత్వం సంచుల్లో వేరుశనగ విత్తనాలున్నాయని రైతు చెబుతున్నారని, అంటే లోపం ఎక్కడుందో ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో వరి పంటకు అవసరమైన విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవన్నారు. దీనిని సమీక్షించాలన్నారు. అలాగే, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన దాదాపు రూ.611 కోట్లను ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.240 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.176 కోట్లు, కృష్ణాలో రూ.94 కోట్ల బాకీ ఉందన్నారు. ఖరీఫ్ పనులు మొదలైనా ధాన్యం అమ్మిన సొమ్ము రాకపోవడంతో రైతులకు ఇబ్బందిగా మారిందన్నారు. రైతులకు బకాయిల చెల్లింపు, విత్తనాల కొరత తీర్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. రైతులు రోడ్డెక్కే పరిస్థితులు రావొద్దన్నారు.

పొగాకు రైతుల కోసం జీవీఎల్

పొగాకు రైతుల కోసం జీవీఎల్

ఏపీలో అయిదేళ్లుగా కరువు పరిస్థితులు నెలకొనడంతో పొగాకు రైతులు బాగా నష్టపోయారని, వారిని ఆదుకోవాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు రాజ్యసభలో అన్నారు. కరవు కారణంగా పంట నాణ్యత తగ్గిందని, దానికి తోడు గిట్టుబాటు ధర రాలేదన్నారు. 2015లో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు పరిహారం ఇచ్చారన్నారు. ఏపీ రైతులకు ఇలాగే పరిహారం ఇవ్వాలన్నారు. అదనంగా ఉత్పత్తి చేసిన పంటకు 15 శాతం లెవీ విధిస్తున్నారని, దానిని రద్దు చేయాలన్నారు.

జగన్ ప్రభుత్వానికి ప్రణాళిక లేదు

జగన్ ప్రభుత్వానికి ప్రణాళిక లేదు

రైతు సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని చంద్రబాబు కూడా ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ లేదని, అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేశారన్నారు. రైతులకు బకాయిలు చెల్లించకపోవడంతో సాగుకు పెట్టుబడి లేకుండా పోయిందన్నారు. ఒకవేళ అప్పులు తెచ్చి సాగుకు సిద్ధమైతే విత్తనాలు దొరికే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్లే ఇలా జరుగుతోందన్నారు.

రైతుల కోసం వ్యవసాయ మిషన్

రైతుల కోసం వ్యవసాయ మిషన్

మరోవైపు, రైతుల ఆర్థికావృద్ధి కోసం ఏపీలో వ్యవసాయ మిషన్‌ను ఏర్పాటు చేశారు. వ్యవసాయ అనుబంధ సంస్థలు, రైతులకు మార్గనిర్దేశనం చేయడం, వారి అవసరాలు గుర్తించి తగిన చర్యలు సూచిస్తూ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడమే దీని లక్ష్యం. దీని చైర్మన్‌గా జగన్, వైస్ చైర్మన్‌గా ఆక్వా రైతు ఎంవీఎస్ నాగిరెడ్డిని నియమించారు.

English summary

Pawan kalyan demands YS Jagan to pay farmers due

Janasena chief Pawan kalyan demanded YS Jagan Mohan Reddy government to pay Andhra Pradesh farmers dues.
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more