For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5జీ టెక్నాలజీ లో చైనా ను నమ్మొచ్చా?

By Jai
|

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట పెద్ద సవాలే ఉంది. టెక్నాలజీ లో స్వయంగా గ్లోబల్ లీడర్ గా ఎదగాలన్న భారత్ ఆకాంక్షలకు తగ్గట్లు ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా అనేది ప్రశ్నార్థకమైంది. ఇటీవల చైనా కు చెందిన టెక్నాలజీ, హార్డ్ వేర్ దిగ్గజం హువవె ని అమెరికా బహిష్కరించినత పని చేసింది. డేటా చౌర్యానికి పాల్పడుతోందన్న కారణాలతో ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఆ కంపెనీ తో కలిసి పనిచేయకూడని అమెరికా కంపెనీలకు హెచ్చరికలు జరీ చేసారు.

గూగుల్ సహా అమెరికా దిగ్గజాలు ట్రంప్ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నాయి. అయితే, 5 జీ టెక్నాలజీ లో ఇప్పటికే అత్యంత అభివృద్ధి చెందిన హువవె లేకున్నా ఆ లోటును అమెరికా కంపెనీలు స్వయంగా పూడ్చుకోగలవు. కానీ భారత కంపెనీలు, ప్రభుత్వం మాత్రం 5 జీ టెక్నాలజీ విషయం లో అమెరికా కంపెనీలతో జత కడుతుందా , లేదంటే చైనా కు చెందిన హువవె తో ముందుకు సాగుతుందా అనేది చూడాలి.

మీరు లోన్ డిఫాల్టరా?: మరో కొత్త చిక్కులో పడినట్లే!

ఇప్పటికే చైనామయం :

ఇప్పటికే చైనామయం :

భారత్ ఇప్పటికే చైనా పై అతిగా ఆధారపడుతోంది. మన దేశంలో విక్రయించే స్మార్ట్ ఫోన్స్ లో మూడింట రెండు ఫోన్లు చైనా కంపెనీలు విక్రయిస్తున్నవే కావడం గమనార్హం. వాటన్నిట్లోనూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా హువావే టెక్నాలజీ, పాత్ర ఉంటుంది. మన డాటాను ఆ కంపెనీ లాగేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమయం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించా నున్న 5 జీ టెక్నాలజీ వాళ్ళ మన దేశం మరింతగా చైనా పై ఆధారపడాల్సి వస్తుంది అనేది కాదనలేని నిజం. మన బద్ధ శత్రువు పాకిస్తానుకు అన్ని వేళలా వెన్నంటి ఉండే చైనా .... మనతోనూ బోర్డర్ విషయం లో వివాదాలను కొనసాగిస్తున్న చైనాకు టెక్నాలజీ లో మనం దాసోహం అంటే మాత్రం భవిష్యత్ ఎల్ ఉంటుందో ఊహించలేమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఏమిటీ 5 జీ:

ఏమిటీ 5 జీ:

ఇప్పటి వరకు భారత్ లో 2జీ, 3జీ , 4 జీ టెక్నాలజీ ఆధారంగా మొబైల్, ఇంటర్నెట్ వినియోగం జరుగుతోంది. అయితే , 5 జీ విషయానికి వస్తే మాత్రం స్పీడ్ పరంగా, సేవల నాణ్యత పరంగా చాలా మార్పులు చోటుచోసుకొంటాయి. ఉదాహరణకు 4జీ టెక్నాలజీ ద్వారా ఒక చదరపు కిలో మీటర్లో 10,000 మందికి సేవలు అందిస్తే... అది 5 జీ టెక్నాలజీ ద్వారా ఏకంగా 25,00,000 నుంచి 30,00,000 మందికి నాణ్యమైన సేవలను అందించా వచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. భారీ అపార్టుమెంట్లు, సెల్లార్లు, రిమోట్ ప్రాంతాల్లోనూ చాల స్పష్టమైన సేవలను దీంతో అందించవచ్చు. అయితే, కేవలం మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ మాత్రమే కాకుండా, తౌన్షిప్ల అభివృద్ధి, పోర్ట్ లు, అయిర్పోర్టులు, రైల్వే, రోడ్లు ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలతో పాటు, డిఫెన్సె, ఆర్ధిక రంగాల్లోనూవు దీన్ని భాగస్వయం చేస్తారు. అందుకే, ఇంట ప్రాముఖ్యత ఉన్న 5జీ కోసం చైనా కంపనీ పై ఆధార పడాలా వద్ద అని మోడీ ప్రభుత్వం మల్ల గుల్లాలు పడుతోంది.

 న్యూక్లియర్ లాగే:

న్యూక్లియర్ లాగే:

న్యూక్లియర్ పరీక్షలు చేసినప్పుడు అమెరికా సహా వివిధ దేశాలు మనపై ఆంక్షలు విధించాయి. ఐతే, మనం వాటిని మన సొంత టెక్నాలజీ అభివృద్ధితో అధిగమించాం. ఇందులో ఇస్రో పాత్ర, డిఫెన్సె రీసెర్చ్ సంస్థల పాత్ర కీలకమైంది. అలాగే ఇప్పుడు కూడా భారత్ తన సొంత టెక్నాలజీని అభివృద్ధి చేసుకొని, ప్రపంచ దేశాల్లో టెక్నాలజీ పరంగా తనకు తిరుగు లేదని నిరూపించే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీ... ఈ విషయం లో చాల తెలివిగా నిర్ణయం తీసుకొంటారని ఎదురు చూస్తున్నారు.

 5 జీ ప్రియం:

5 జీ ప్రియం:

ఇదిలావుండగా, 5జీ సేవల స్పెక్ట్రం వేలం ధర చాలా ఎక్కువ ఉందని దేశీయ టెలికాం దిగ్గజాలు పెదవి విరుస్తున్నాయి. గ్లోబల్ ధరలతో పోల్చితే కనీసం 30-40% ధరలు అధికమని, అంత చెల్లించే స్థోమత తమకు లేదని పేర్కొంటున్నాయి. ప్రప్రంచంలోనే చవక ధరల్లో మొబైల్ సేవలను అందిస్తున్న దేశంగా భారత్ కు పేరుంది. కానీ, 5జీ విషయం లో ప్రభుత్వం ధరలను కనీసం 50% తగ్గించక పోతే, స్పెక్ట్రమ్ కొనుగోలుకు టెలికాం సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేయక పోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary

5G trials: Chinese official urges India to include Huawei

Calling for India to include Huawei in its 5G trials despite the U.S. government’s opposition to the Chinese telecommunications major, a senior Chinese official said New Delhi must not be exclusive in its choice.
Story first published: Tuesday, July 2, 2019, 16:57 [IST]
Company Search