For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేమస్ యాప్‌లకు క్రికెట్ ఫీవర్, ఇన్‌గేమ్స్ తో అదరగొడుతున్న స్టార్టప్ కంపెనీలు

By Jai
|

భారత్ కు క్రికెట్ కు అవినాభావ సంబంధం ఉంది. మాములుగా క్రికెట్ మ్యాచ్ ఉందంటేనే భారతీయులు టీవీలకు అతుక్కు పోతారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ క్రికెట్ అంటే అభిమానులు ఎలా ఉంటారో ఊహించు కోవాల్సిందే. ఈ అభిమానాన్నే ఆసరా చేసుకొని ప్రముఖ ప్రెమెంట్స్ యాప్ ల నుంచి ఫుడ్ దేవేలివెరీ యాప్ ల వరకు అన్నింటిదీ ఇదే రూట్. వినియోగదారులను ఎలాగైనా తమ ఆప్ లను ఎక్కువగా వాడేలా చేసేందేందుకు, అలాగే వారిని ఆప్ లలోనే అధిక సమయం గడిపేందుకు క్రికెట్ ను ఆశ్రయిస్తున్నాయి.

జొమాటో క్రికెట్ కప్, స్విగ్గి మ్యాచ్ డే మేనియా, ప్రెటీఎం గేమ్స్, తేజ్ (గూగుల్ పే ) షాట్స్ గేమ్స్ ఇందుకు మ్యాచుకు కొన్ని ఉదాహరణలు. ఇన్-ఆప్ గేమ్స్ గా పేర్కొనే ఇలాంటి గేమ్స్ ఆప్ లలో రావటం కొత్త కాకా పోయిన... వరల్డ్ కప్ క్రికెట్ తో ఈ గేమ్స్ మేనియా మరింత ప్రాచుర్యం పొందుతోందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

Famous apps bet on World Cup Fever in India, Where cricket is Religion

జొమాటో లో రెండు గేమ్స్ అందుబాటులో ఉన్నాయ్. ప్రీమియర్ లీగ్ , క్రికెట్ కప్ పేరుతో ఇవి కొత్త వినియోగదారులతో పటు పథ వారిని కూడా ఆకట్టుకొంటున్నాయి. ప్రెటీఎం అందించే ఫాంటసీ క్రికెట్ గేమ్ - ఫస్ట్ గేమ్స్ అయితే ఏకంగా 60% యూజర్లు రోజూ ఆడుతున్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం లో పేర్కొంది. తేజ్ షాట్స్ అనే గేమ్ కూడా వర్చ్యువల్ మొబైల్ క్రికెట్ గేమ్ కావటం విశేషం.

ఫిక్సెడ్ డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయ్ ! ఫిక్సెడ్ డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయ్ !

ఈ గేమ్స్ కేవలం శారద కోసం కాకుండా గిఫ్ట్స్ వౌచెర్స్, మూవీ టికెట్స్, స్పెషల్ డిస్కౌంట్స్ పొందేందుకు వినియోగదారులు ఉపయోగించుకొంటారు. తద్వారా లభించిన ఆఫర్లు, డిస్కౌంట్స్ వెంటనే వినియోగించుకునేందుకు వారు ఆర్డర్లు ప్లేస్ చేస్తారు. దీని వాళ్ళ ఆయా కంపెనీలకు మరింతగా బిజినెస్ లభిస్తుంది. ఇన్ ఆప్ గేమ్స్ ను ప్రవేశ పెట్టటం ఉద్దేశం కూడా ఇదేనని మార్కెట్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

క్రాస్ సెల్లింగ్ జరగటం వల్ల కంపెనీలు మండగం నుంచి బయట పడతాయి. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నపుడు ప్రేక్షకులను ఆప్ ల వైపు మళ్ళించాలంటే ఎదో ఒక ఆసక్తి కరమైన గేమ్స్ ను ఆఫర్స్, డిస్కౌంట్స్ తో ఊరించి వారితో ఆర్డర్లు పెట్టించేలా చేయాల్సిందే. అందుకే దాదాపు అన్ని రంగాల్లో పనిచేస్తున్న స్టార్టుప్ కంపెనీలు కూడా ఇలాంటి ఇన్ ఆప్ గేమ్స్ వైపు పరుగులు పెడుతున్నాయి.

ఒక వినియోగదారు సాధారణంగా ఆప్ లో ఎక్కువ సమయం గడిపితే వారు తప్పకుండ ఒడిక కొంగలు చేస్తారనేది మార్కెట్ సూత్రం. కొత్త క్రికెట్ గేమ్స్ వాళ్ళ దాదాపు అన్ని యాప్ ల లోనూ 15 - 20 నిముషాలు అధికంగా వినియోగదారులు సమయం వెచ్చిస్తున్నారట.

ఇందుకు తగినటట్లే ఇప్పటి వరకు ఓటమి లేకుండా దూసుకు పోతున్న భారత జట్టు ఇలాంటి ఇన్ ఆప్ గేమ్స్ కు మరింత క్రేజ్ తీసుకొస్తోంది. ఇప్పటి వరకు భరత్ ఆడిన అన్ని మ్యాచ్ లలోనూ గెలిచినా విషయం తెలిసిందే. అయితే, మరికొన్ని రోజుల్లో క్రికెట్ వరల్డ్ కప్ ముగియనుంది. ఆ తర్వాత ఈ ఆప్ లు మారె గేమ్స్ వైపు పరుగులు పెడతాయో చూడాలి మరి.

English summary

ఫేమస్ యాప్‌లకు క్రికెట్ ఫీవర్, ఇన్‌గేమ్స్ తో అదరగొడుతున్న స్టార్టప్ కంపెనీలు | Famous apps bet on World Cup Fever in India, Where cricket is Religion

Famous apps and startup companies bet on World Cup Fever in India, Where cricket is Religion.
Story first published: Sunday, June 30, 2019, 8:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X