బెర్న్: పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) స్కాంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి స్విట్జర్లాండ్ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు చెందిన నాలుగు స్విస్ అకౌంట్స్‌ను సీజ్ చేసింది. ఆయన సోదరి పూర్వీ మోడీ ఖాతాలను కూడా అధికారులు స్తంభింపచేశారు. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విజ్ఞప్తి మేరకు అధికారులు ఫ్రీజ్ చేశారు.
నీరవ్ మోడీ, ఆయన సోదరి పూర్వీ మోడీలకు చెందిన ఖాతాల్లోని రూ.283.16 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. భారతీయ బ్యాంకుల నుంచి అక్రమంగా స్విస్ అకౌంట్లకు నిధులు మళ్లించారని ఈడీ.. స్విస్ అధికారులకు తెలిపింది.

నీరవ్ మోడీ అకౌంట్‌లో 3,74,11,596 డాలర్లు, అతని సోదరి పూర్వీ మోడీ స్విస్ అకౌంట్‌లో 27,38,136 GBP (బ్రిటిష్ పౌండ్)లు ఉన్నాయని, మొత్తం రూ.283 కోట్లకు పైగా ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. పీఎన్‌బీ స్కాంలో నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీతో పాటు పూర్వీ మోడీ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్ ద్వారా పీఎన్‌బీలో రూ.13,700 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ స్కాం వెలుగు చూడటానికి ముందే నీరవ్ మోడీ, బంధువులు లండన్ పారిపోయారు. లండన్‌కు పారిపోయి అక్కడ తలదాచుకోగా కొన్ని వారాల క్రితం నీరవ్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నాడు. నీరవ్ పలుసార్లు బెయిల్ కోసం పిటిషన్లు వేయగా అవి తిరస్కరణకు గురయ్యాయి.
గురువారం ఆయనను లండన్‌లోని ఓ న్యాయస్థానంలో మరోసారి విచారించనుంది. ప్రస్తుతం జైల్లో ఉంటున్న ఆయన వీడియో లింక్ ద్వారా విచారణకు హాజరుకావడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. యూకే చట్టాల ప్రకారం ఆయనపై విచారణ కొనసాగుతోంది. ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద నీరవ్‌ను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications