For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిన్న పెరుగు కంపెనీలో... నేడు ఏరోస్పేస్ ఇండస్ట్రీలో దీపికా పదుకొణే పెట్టుబడులు

|

భారత ప్రయివేటు రాకెట్ స్టార్టప్ బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ 3 మిలియన్ డాలర్లు సేకరించింది. ఐడీఎఫ్‌సీ-పరంపర, స్టార్టప్ఎక్స్‌సీడ్‌లతో పాటు బాలీవుడ్ నటి దీపికా పదుకొణే తదితరుల నుంచి ఈ మొత్తం సేకరించిందని తెలుస్తోంది. బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ నానో శాటిలైట్స్ లాంచర్ల నిర్మాణంతో పాటు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్స్‍‌ను బిల్ట్ చేస్తోంది. తాజా మూలధన సేకరణ అంతరిక్ష ప్రయాణానికి నిదర్శనం. ప్రస్తుతం ఇది తన ఉత్పత్తుల సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు భాగస్వామి కోసం ఎదురు చూస్తోంది.

బెల్లాట్రిక్స్ కంపెనీ మొదట శాటిలైట్స్ కోసం ఎలక్రిక్ థ్రస్టర్స్ ఉత్పత్తి చేసింది. ఇది ఉపగ్రహాల బరువును గణనీయంగా తగ్గిస్తుంది. ప్రస్తుతం ఇది చేతక్ అనే నానో శాటిలైట్‌ను కూడా డెవలప్ చేస్తోంది. దీని పేలోడ్ కెపాసిటీ 150 కిలోలు.

Bellatrix Aerospace raises $3 million funding from IDFC Parampara, Deepika Padukone and others

2016లో బెల్లాట్రిక్స్ తన ఎలక్ట్రిక్ శాటిలైట్ థ్రష్టర్స్ కోసం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)తో కలిసి పని చేసింది. ఇస్రో ఈ స్టార్టప్ కంపెనీకి కస్టమర్ కూడా. ఆ తర్వాత ఇస్రో క్రమంగా తన సొంత ప్లాస్మా థ్రష్టర్స్ డిజైన్ చేయడం ప్రారంభించింది.

ఆశ్చర్యంగా ఓ పెరుగు కంపెనీలో దీపికా పదుకొణే పెట్టుబడి ఆశ్చర్యంగా ఓ పెరుగు కంపెనీలో దీపికా పదుకొణే పెట్టుబడి

బెల్లాట్రిక్స్ లోతైన సాంకేతికతతో వినూత్నంగా ముందుకు సాగుతోందని, థ్రష్టర్స్ పరంగా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని స్టార్టప్ఠ్ఎక్స్‌స్పీడ్ మేనేజింగ్ పార్ట్‌నర్ బీవీ నాయుడు చెప్పారు. ఈ ఇండియన్ స్టార్టప్.. ప్రపంచ మార్కెట్ వేగంగా పెరుగుతున్న వాణిజ్య శాటిలైట్స్ తదితర వాటిపై దృష్టి సారించింది.

ఇండియా స్పేస్ టెక్ సెక్టార్ ఇప్పటికీ ఆరంభంలోనే ఉంది. కమర్షియల్ శాటిలైట్స్ మార్కెట్ లాంచింగ్‌లో ప్రభుత్వ రంగ ఇస్రో మాత్రమే దూసుకెళ్తోంది. ఎక్స్‌సీడ్ స్పేస్, టీమ్ ఇండస్, ధ్రువ స్పేస్, ఆస్ట్రోమ్ వంటి పలు సంస్థలు తక్కువ ఖర్చుతో పాటు శాటిలైట్ అసెంబ్లింగ్, ఆప్టికల్ కమ్యూనికేషన్, ప్రొపల్షన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నాయి.

ఇక దీపిక పదుకోన్ కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం నిర్మాతగా మారి ఛపక్ చిత్రంలో లీడ్‌గా నటిస్తున్నది. అలాగే భర్త రణ్‌వీర్‌తో కలిసి 83 అనే చిత్రంలో తెరపైన సతీమణిగా దీపిక కనిపించబోతున్నారు. 14 నిమిషాల నిడివి గల పాత్ర కోసం ఆమె రూ.14 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు సమాచారం.

Read more about: bollywood
English summary

నిన్న పెరుగు కంపెనీలో... నేడు ఏరోస్పేస్ ఇండస్ట్రీలో దీపికా పదుకొణే పెట్టుబడులు | Bellatrix Aerospace raises $3 million funding from IDFC Parampara, Deepika Padukone and others

India's private rocket startup Bellatrix Aerospace has raised $3 million in pre-Series A funding led by IDFC-Parampara, StartupXseed and Bollywood superstar Deepika Padukone, among others.
Story first published: Wednesday, June 26, 2019, 12:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X