For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధార్ కార్డ్ ముద్రించినంత సులభమా: నీతిఆయోగ్‌పై హీరో, బజాజ్, టీవీఎస్

|

న్యూఢిల్లీ: రానున్న ఆరేళ్లలో బైక్స్, ఫోర్ వీలర్ వంటి వాహనాలన్నింటిని పూర్తిస్థాయి ఎలక్ట్రానిక్ వాహనాలుగా (EV) మార్చడం సాధ్యం కాదని వెహికిల్స్ తయారీ కంపెనీలు హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ వంటి సంస్థలు స్పష్టం చేశాయి. 2023 వరకు ఫోర్ వీలర్స్, 2025 నాటికి బైక్స్ పూర్తిగా విద్యుత్‌తో నడిచేలా తయారు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు నీతి అయోగ్ 100 శాతం విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగంపై లక్ష్యాన్ని నిర్దేషించుకోగా, దీంతో కంపెనీలు విభేదించాయి.

ఇప్పుడున్న పెట్రో ఆధారిత వాహనాల స్థానంలో విద్యుత్ ఆధారిత వాహనాలను కేవలం 2025 నాటికి తీసుకురావడం సాధ్యం కాదని కంపెనీలు తేల్చి చెప్పాయి. కోట్ల మందితో ముడివడిన, ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపే ఈ నిర్ణయాన్ని ఆధార్‌ వివరాలతో ప్లాస్టిక్‌ కార్డు తయారు చేసినంత సులభంగా చూడొద్దని హితవు పలకడం గమనార్హం. సంపూర్ణ అధ్యయనం, పరిశీలన లేకుండా సిఫార్సు చేశారన్నారు. విద్యుత్తు వాహనాలకు సత్వరం మారేందుకు ఎలాంటి చర్యలు అవసరమో రెండు వారాల్లోగా వాహన తయారీదార్ల సంఘం (సియామ్‌), కంపెనీలు తెలపాలని నీతి ఆయోగ్ గతవారం కోరడంపై కంపెనీలు ఇలా స్పందించాయి.

 ఆధార్ ముద్రించినంత ఈజీయా: నీతిఆయోగ్‌పై హీరో, బజాజ్, టీవీఎస్

ఇదేమీ ఆధార్ కార్డులా కాదని, సాఫ్టువేర్ అంతకంటే కాదని, వెంటనే ప్రింట్ కార్డులు రావని టీవీఎస్ మోటార్ కో చైర్మన్, ఎండీ వేణు శ్రీనివాసన్ పీటీఐతో అన్నారు. ఆటో రంగ సంస్థలన్నీ ఇందుకు సమాయత్తం కావాలని, విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగానికి వీలైన పరిస్థితులను కొనుగోలుదారులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నిర్ణీత గడువు తర్వాత టూవీరల్, త్రీవీలర్ వాహనాలపై వేటు వేయాలన్న నీతి అయోగ్ సిఫార్సుపై హీరో మోటోకార్ప్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇది పరిశ్రమకు హానీ తలపెట్టే చర్య అన్నారు. ప్రస్తుతం తయారు చేస్తున్న వాహనాలను విద్యుత్తులోకి మార్చడం సాధ్యం కాదని గుర్తించాలన్నారు. ఇందుకు పూర్తిస్థాయి సరఫరా వ్యవస్థలు సిద్ధం కావాలన్నారు. తగిన ప్రణాళికలు నాలుగు నెలల్లో రూపొందిస్తామన్నారు. ఇంత పెద్ద వ్యవస్థను కొద్ది రోజుల్లో మార్చలేమన్నారు.

150CC లోపు సంప్రదాయ బైక్ వాహనాలను పూర్తిగా నిషేధించాలనే నీతి అయోగ్ ప్రతిపాదనల వల్ల అవాంఛనీయ పరిణామాలు సంభవించవచ్చునని హీరో మోటోకార్ప్ పేర్కొంది. 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ప్రమాణాల వల్ల, ప్రపంచంలోనే అధఇక ఇంధన సామర్థ్యంతో పని చేస్తూ, అతి తక్కువ ఉద్గారాలను మాత్రమే వెదజల్లే బైక్స్ ఉంటాయని, విద్యుత్ వాహనాలను బలవంతంగా రుద్దకుండా, రెండు రకాల వాహనాలు ఆరోగ్యకరంగా సాగేలా విధానాలు ఉండాలని పేర్కొంది.

బైక్స్, త్రీవీలర్స్ అన్నీ వంద శాతం విద్యుత్‌తోనే నడిపించాలనే ప్రతిపాదనే సరికాదని, వాస్తవ కార్యాచరణను దూరంగా, ప్రస్తుత సమయంలో చేశారన్నారు. ఇది అర్థవంతమైన సూచన కాదన్నారు. ఓ వైపు పెట్రోల్, డీజిల్ వాహనాలను బీఎస్ 6 ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ఇచ్చిన గడువుకు సమీపంలోనే, మళ్లీ విద్యుత్తుకు మారాలంటే చాలా వ్యయం అవసరమని, బొగ్గుతో జరిగే విద్యుదుత్పత్తితో ఛార్జింగ్ అయ్యే బ్యాటరీలను వాహనాల్లో వినియోగించినంత మాత్రాన కాలుష్యం ఏమీ తగ్గదన్నారు.

కాగా, ప్రమాదకర స్థాయికి చేరిన వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు, పెట్రో దిగుమతుల భారం తగ్గించుకునేందుకు విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగాన్ని పెంచాలని కేంద్రం భావిస్తోంది.

బ్యాంకుల కంటే మంచి ఆఫర్, ఇలా మీ డబ్బు రెండింతలు అవుతుంది

English summary

Automakers run into collision with Centre's EV plan

Companies such as Bajaj Auto and TVS Motor have objected to banning two- and three-wheelers and asked for at least four months to come up with a comprehensive plan.
Story first published: Tuesday, June 25, 2019, 13:41 [IST]
Company Search