For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్ కప్ సీజన్‌లో టీవీల సేల్స్ జీరో ! షాక్‌లో కంపెనీలు

By Chanakya
|

హైదరాబాద్ : టీవీ.. ఈ రోజుల్లో లగ్జరీ కానేకాదు. పూరి గుడిసెల్లో కూడా ఇది చాలా కామన్ అయిపోయింది. వివిధ ఆఫర్ల నేపధ్యంలో ఇప్పుడు 40 -50 అంగుళాల టీవీల కోసం కూడా జనాలు ఎగబడ్తున్నారు. చిన్న చిన్న టీవీలను, పాత టీవీలను పక్కనబడేసి కొత్త వాటి కోసం వెంపర్లాడుతున్నారు. అదే ఇక వరల్డ్ కప్ సీజన్‌లో అయితే మాత్రం ఈ అమ్మకాలు బాగా పెరుగుతాయి. కానీ ఆశ్చర్యంగా ఈ సీజన్‌లో టీవీల సేల్స్ దారుణంగా పడిపోయింది, భారీ ఆశలు పెట్టుకున్న వివిధ కంపెనీలకు పెద్ద చిల్లుపడింది. టీవీలకు బదులు ఏసీలకు డిమాండ్ పెరగడం కొసమెరుపు.

టీవీల సేల్స్ లేనేలేదు
మొట్టమొదటిసారిగా వల్డ్ కప్ సీజన్‌లో టీవీ సేల్స్ పెరగడానికి బదులు పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో, అది కూడా కొన్ని కంపెనీలకు కేవలం 5 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. గతంలో ఈ సీజన్‌లో టీవీల అమ్మకాలు 80-90 శాతం వరకూ ఎక్కువగా ఉండేవని కానీ ఈ సారి మాత్రం భిన్నంగా ఉందని టాప్ 5 ఎలక్ట్రానిక్ సంస్థలు ఆందోళనలో ఉన్నాయి. రిటైలర్ల దగ్గర కూడా ఇన్వెంటరీ (నిల్వలు) పేరుకుపోయాయని చెబ్తున్నాయి. 55 అంగుళాల టీవీల కొద్దిగా డిమాండ్ పెరిగింది. వాటిల్లో సోనీ వంటి కంపెనీలు 20-25 శాతం వరకూ డిమాండ్‌ను చూశాయి. అయితే 26,32,43 అంగుళాల టీవీల్లో మాత్రం సేల్స్ నెగిటివ్‌కి పడిపోయింది. మొత్తం సేల్స్‌లో చిన్న టీవీల వాటాయే 85-90 శాతం వరకూ ఉంటుంది.

world cup season tv sales are very low

కారణం ఏంటంటే..
మొదటిది ఈ మధ్య ఐపీఎల్ వంటి వాటితో ఇంటర్నేషనల్ క్రికెట్ ఎక్కువైపోయింది. ప్రత్యేకించి వరల్డ్ కప్‌ కోసం వేచి ఉండాల్సిన ఇంట్రెస్ట్ పోయింది. మామూలు రోజుల్లోనే క్రికెట్ ఫన్ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో టీవీల కోసం ప్రత్యేకించి సేల్స్ అంతగా లేదనేది నిపుణుల మాట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ ఎండాకాలంలో జనాలు టీవీలు కొనుక్కునే కంటే ఏసీలు కొనేందుకే అధిక ప్రాధాన్యమిచ్చారని తెలుస్తోంది. ఎందుకంటే ఏసీల సేల్స్ ఏప్రిల్ - మే నెలలో 18 శాతం పెరిగాయి. ఎండలు మండి, నలబై డిగ్రీల మార్కును దాటిన నేపధ్యంలో జనాలు వినోదం కంటే రిలాక్స్ అయ్యేందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. దాని వల్ల ఈ ఎండాకాలంలో టీవీల సేల్స్ పడిపోయి, ఎయిర్ కండిషన్ల దూకుడు పెరిగింది.

English summary

వరల్డ్ కప్ సీజన్‌లో టీవీల సేల్స్ జీరో ! షాక్‌లో కంపెనీలు | world cup season tv sales are very low

Most of the Indian buyers preferred AC's rather than TV's in this summer season. TV Companies expected huge growth in TVs in this world cup season, but their dreams shattered.
Story first published: Saturday, June 22, 2019, 15:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X