For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెక్షన్ 80సి కింద వేటికి పన్ను మినహాయింపు లభిస్తుందో తెలుసా?

By Jai
|

హైదరాబాద్ : ఆదాయ పన్ను చట్టం కింద ఒక సంవత్సరంలో నిర్దేశిత మొత్తంకన్నా ఎక్కువగా ఆదాయాన్ని ఆర్జించినట్టయితే దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పన్ను చెల్లింపునకు ముందు కొన్ని రకాల మినహాయింపులను పొందడానికి అవకాశం కల్పించారు. దీని వల్ల పన్ను భారం తగ్గుతుంది. వివిధరకాల పొదుపులు, పెట్టుబడుల ద్వారా సెక్షన్ 80సి కింద గరిష్టంగా రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇది వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలకు వర్తిస్తుంది.

సెక్షన్ 80సి కింద చేసే ఏయే పెట్టుబడులకు మినహాయింపులు వర్తిస్తాయంటే...

taxable benefits on 80c section

1. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)
పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేసే మొత్తం పన్ను మినహాయింపునకు అర్హమైనదే. ఇందులో ఏడాదికి గరిష్టంగా రూ.1.50 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఈ మొత్తానికి మినహాయింపు కోరవచ్చు. పీపీఎఫ్ ఖాతా లాక్ ఇన్ పీరియడ్ 15 ఏళ్ళు. ఏడేళ్ల తరవాత ఖాతాలోని కొత్త సొమ్మును ఉపసంహరించుకోవచ్చు.

2. పెన్షన్ ఫండ్ కాంట్రిబ్యూషన్లో ఉద్యోగి వాటా
ఉద్యోగులు తమ పెన్షన్ కోసం చెల్లించేమొత్తానికి పన్ను మినహాయింపు లభిస్తుంది.

3. నేషనల్ సేవింగ్స్ సెర్టిఫికెట్లు
పన్ను చెల్లింపుదారులు తమ సొమ్మును ఇందులో పెట్టుబడిగా పెట్టేందుకు ప్రోత్సహించేందుకు గానే పన్ను మినహాయింపు ఇస్తున్నారు. అయితే వీటిపై వచ్చే వడ్డీకి మాత్రం పన్ను వర్తిస్తుంది. వచ్చిన వడ్డీని పెట్టుబడిగా పెడితే పన్ను మినహాయింపు లభిస్తుంది.

4. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు
జీవిత బీమా కోసం చెల్లించే ప్రీమియం మొత్తానికి 80సి కింద మినహాయింపు పొందవచ్చు. సొంత బీమా, భార్య/భర్త, పిల్లల బీమా, హిందూ అవిభాజ్య కుటుంబసభ్యుడి బీమా ప్రీమియం దీని పరిధిలోకి వస్తుంది.

5. ఇద్దరు పిల్లల ట్యూషన్ ఫీజు
పిల్లల చదువుల కోసం చెల్లించే ట్యూషన్ ఫీజుకు పన్ను మినహాయింపు ఉంటుంది.

6. సుకన్య సమృద్ధి యోజనా
ఆడపిల్లల కోసం ఈ పథకాన్ని తెచ్చారు. దీనికింద ఖాతాలో వేసే సొమ్ముకు పన్ను మినహాయింపు పొందవచ్చు. పదేళ్ల లోపు ఆడపిల్ల పేరుమీద తల్లి లేదా తండ్రి గార్డియన్ గా ఉంది ఈ ఖాతాను తెరవవచ్చు. ఇద్దరు ఆడపిల్లలకు కూడా ఈ ఖాతాను తీయవచ్చు.

7. గృహ రుణంలో చెల్లించే ప్రధాన మొత్తం
గృహ రుణంలోని ప్రిన్సిపల్ అమౌంట్ చెల్లింపులపై పన్ను మినహాయింపు ఉంటుంది.ఈ మినహాయింపు పొందాలంటే నిర్మాణం పూర్తయి ఉండాలి.

8. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్సు ప్లాన్స్
యూలిప్స్ లో పెట్టుబడులపై కూడా పరిమితి మేరకు పన్ను మినహాయింపు ఉంటుంది.

9. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్
ఇందులో పెట్టుబడుల ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పెట్టుబడులపై మూడేళ్ళ లాక్ ఇన్ పీరియడ్ వర్తిస్తుంది. ఐదేళ్లు, ఏడేళ్ల కాలానికి పెట్టుబడులు పెడితే సంపద పెంచుకునే అవకాశం ఉంటుంది.

10. ఐదేళ్ల డిపాజిట్ పథకం
దాదాపు అన్ని బ్యాంకులు కూడా పన్ను ఆదాకు అవకాశం ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను అందిస్తున్నాయి. వీటి కాలపరిమితి ఐదేళ్లు. అయితే ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీపై మాత్రం పన్ను ఉంటుంది.

11. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ పథకం
ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు మాత్రమే పొదుపు చేయవచ్చు. ఈ పథకం కాల పరిమితి ఐదేళ్లు. ఇందులో పెట్టుబడిపై పన్ను మినహాయింపు లభిస్తుంది.

12. నోటిఫై చేసిన సెక్యూరిటీలు, డిపాజిట్ పథకాలు

13. మ్యూచువల్ ఫండ్ లేదా యూటీఐ ఏర్పాటు చేసిన పెన్షన్ ఫండ్ కు కాంట్రిబ్యూషన్

14. ఎల్ ఐ సి యాన్యుటీ ప్లానుకు చెల్లింపులు

15. నాబార్డ్ సబ్ స్క్రిప్షన్

Read more about: 80c tax పన్ను
English summary

సెక్షన్ 80సి కింద వేటికి పన్ను మినహాయింపు లభిస్తుందో తెలుసా? | taxable benefits on 80c section

Under the Income Tax Act, income is earned over the prescribed amount in one year and taxable. However, some types of exemptions are available before the tax is paid. This will reduce the tax burden. Various savings and investments can be tax deductible up to a maximum of Rs 1,50,000 under Section 80C. This applies to individuals and Hindu undivided families.
Story first published: Saturday, June 22, 2019, 18:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X